డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ RRR మూవీ2020 సంవత్సరం జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా 1920 ల నాటి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న RRR మూవీలో ఆ కాలం ప్రతిబింబించేలా ఉత్తరాది లో షూటింగ్ ప్లాన్ చేశారు. ముందుగా గుజరాత్ లో తరువాత ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లో షూటింగ్ జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
RRR మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ లు కథానాయికలు కాగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొదటి షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. సుమారు 45 రోజులపాటు జరిగే రెండవ షూటింగ్ షెడ్యూల్ లో హీరోలు, హీరోయిన్స్ పాల్గొంటారు. బిగ్ షూటింగ్ షెడ్యూల్ కు వెళుతున్నామని యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ నుండి వడోదర కు బుక్ అయిన ఫ్లైట్ టికెట్స్ షేర్ చేస్తూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Off to a flying start!Big schedule ahead.#RRR pic.twitter.com/f82ksuIWR6
— Jr NTR (@tarak9999) March 28, 2019
[youtube_video videoid=_myq-46Lp_c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: