వరుస తెలుగు ఆఫర్లతో దూసుకుపోతుంది బాలీవుడ్ నటి మందిరా బేడి. ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సాహోలో నటించే అవకాశం దక్కించుకుంది మందిరా. ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టేసింది. పూరీ జగన్నాథ్ తనయుడు హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో ఓ కీ రోల్ లో మందిరా బేడి నటిస్తున్నట్టు ఈరోజు చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన ఢిల్లీ మోడల్ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
కాగా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు.. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా పూరీనే అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[youtube_video videoid=b8K6JfBr5wk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: