డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా RRR మూవీరూపొందుతున్న విషయం తెలిసిందే. ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల నేపథ్యంలో సుమారు 400కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న మల్టీ స్టారర్ RRR మూవీ కి MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీ లోబాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సూపర్ హిట్ మూవీ తో బాలీవుడ్ లో ఎంటరయి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అలియా భట్, RRR మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినందుకు తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్త పరిచారు. నిజంగా ఈ రోజు గ్రేట్ ఫుల్ గా ఫీల్ అవుతున్నానని, గ్రేట్ ఆర్టిస్ట్ లు, భారీ టీమ్ తో వర్క్ చేయడానికి ఆసక్తి తో ఎదురు చూస్తున్నానని, RRR మూవీలో హీరోయిన్ గా అవకాశం
కలిగించినందుకు డైరెక్టర్ రాజమౌళికి థ్యాంక్స్ అని అలియా భట్ ట్వీట్ చేశారు.
[youtube_video videoid=0XwacVaiMO0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: