ట్యాగ్ · 47 కథనాలు · పేజీ 3
వెంకీ 75 పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

వెంకటేష్ 34 సంవత్సరాల సినీ జర్నీ

వెంకటేష్ ‘ఒంటరి పోరాటం’కు 31 ఏళ్ళు

విక్టరీ వెంకటేష్ `రాజా`కి 21 ఏళ్ళు
వెంకీతో సినిమా నిజమే..!
"మోసగాళ్ళు " మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో వాస్తవ సంఘటనల ఆధారంగా అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో "మోసగాళ్ళు " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ ముగింపు దశలో ఉన్న "మోసగాళ్ళు " మూవీ కి నివాస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
వెంకీ 75 పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో తమిళ్ సూపర్ హిట్ మూవీ 'అసురన్' తెలుగు రీమేక్ నారప్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లను రిలీజ్ చేశారు. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇది వెంకీకి 74వ సినిమా.

వెంకటేష్ 34 సంవత్సరాల సినీ జర్నీ
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్ , ఖుష్బూ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "కలియుగపాండవులు " మూవీ 1986 సంవత్సరం ఆగస్ట్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఈ మూవీ తో వెంకటేష్ , ఖుష్బూ టాలీవుడ్ కు పరిచయం అవడం విశేషం. "స్వర్ణ కమలం ", "ప్రేమ ","బొబ్బిలిరాజా ", "శత్రువు ", "క్షణక్షణం ", "చంటి ", "సుందర కాండ ", "కొండపల్లి రాజా ", "అబ్బాయి గారు ", "ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు ", "ప్రేమించుకుందాం రా , "కలిసుందా రా ", "జయం మనదేరా ", "నువ్వు నాకు నచ్చావ్ ", "వసంతం ", ఘర్షణ ", ", లక్ష్మీ ", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ", " "దృశ్యం ", "గురు ", "F…

వెంకటేష్ ‘ఒంటరి పోరాటం’కు 31 ఏళ్ళు
‘విక్టరీ’ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో ‘ఒంటరి పోరాటం’ ఒకటి. ‘కలియుగ పాండవులు’, ‘భారతంలో అర్జునుడు’ వంటి సినిమాల తరువాత వెంకీ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘ఒంటరి పోరాటం’. ఇందులో వెంకీకి జోడిగా ఉత్తరాది భామ ఫరా నటించగా.. రూపిణి మరో నాయికపాత్రలో కనిపించింది. కైకాల సత్యనారాయణ, మోహన్‌బాబు, బ్రహ్మానందం, సుధాకర్, ఆనంద్‌రాజ్, శివాజీరాజా, చిట్టిబాబు, చిడతల అప్పారావు, పి.జె.శర్మ, అన్నపూర్ణ, శుభ, మమత, ‘డబ్బింగ్’ జానకి ముఖ్య భూమికలు పోషించగా.. ‘సహజనటి’ జయసుధ…

వెంకటేష్ ‘ఆడవారిమాటలకు... అర్థాలేవేరులే!’కి 13 ఏళ్ళు
కుటుంబ కథా చిత్రాలకు చిరునామాగా నిలచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన నటించిన పలు ఫ్యామిలీ డ్రామాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిలో ‘ఆడవారిమాటలకు… అర్థాలేవేరులే!’ ఒకటి. ఇందులో వెంకీ సరసన త్రిష కథానాయికగా నటించగా… కోట శ్రీనివాస రావు, శ్రీరామ్, కె.విశ్వనాథ్, సునీల్, జీవా, ‘కలర్స్’ స్వాతి, రాజ్యలక్ష్మి, ప్రసాద్ బాబు ముఖ్య భూమికలు పోషించారు. మేఘనా నాయుడు, ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతాల్లో మెరిశారు. శ్రీరాఘవ (సెల్వరాఘవన్) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.

విక్టరీ వెంకటేష్ `రాజా`కి 21 ఏళ్ళు
విక్టరీ వెంకటేష్, అభినేత్రి సౌందర్య కాంబినేషన్ లో పలు మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. వాటిలో `రాజా` ఒకటి. తమిళ చిత్రం `ఉన్నిడత్తిల్ ఎన్నై కొడుత్తేన్` (కార్తిక్, రోజా) ఆధారంగా తెరకెక్కిన ఈ రీమేక్ మూవీని ముప్పలనేని శివ తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో అబ్బాస్, సుధాకర్, చంద్రమోహన్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణ, వై.విజయ, సన తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
వెంకీతో సినిమా నిజమే..!
తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇప్పుడు పెద్ద ఛాన్సే కొట్టేశాడు. వెంకీతో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తున్నాట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య దీనిపై ఎలాంటి న్యూస్ కానీ క్లారిటీ కానీ…