
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 127


35 నుండి అరుణ్ శర్మ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

అలనాటి రామచంద్రుడు ట్రైలర్ రిలీజ్

మిస్టర్ బచ్చన్ టీజర్ రిలీజ్ - రవితేజ మాస్ ట్రీట్

మిస్టర్ బచ్చన్- రవితేజ్ డబ్బింగ్ కంప్లీట్

ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే - విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ గ్లింప్స్ రిలీజ్

దుల్కర్ సల్మాన్ హీరోగా.. ఆకాశంలో ఒక తార

యూత్‌ను ఆకట్టుకుంటోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్

రాజా సాబ్.. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్
'కల్కి 2898 AD' సినిమాతో ఇటీవలే ప్రేక్షకులముందుకు వచ్చాడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని చరిత్ర సృష్టించింది. విడుదలై నెల దాటినా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే అంతకుముందు వచ్చిన 'సలార్' మూవీతో దాదాపు రూ. 800 కోట్లు కొల్లగొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్స్ అందించాడు.

డబుల్ ఇస్మార్ట్ నుండి క్యా లఫ్డా ఫుల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నుండి రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ డబుల్ ఇస్మార్ట్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం ఈసినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుండటమే. ఇక అంచనాలకు తగ్గట్టుగా ఇప్పటికే వచ్చిన అప్ డేట్లు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఆగష్ట్ 15 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

35 నుండి అరుణ్ శర్మ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో నివేధా థామస్ పాత్రలో వస్తున్న సినిమా 35-చిన్న కథ కాదు. ఇందులో నివేదా థామస్ ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపిస్తోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఓదెల 2- బోనాల స్పెషల్ గా తమన్నా పోస్టర్ రిలీజ్
ఈ సినిమాలో తమన్నా శివశక్తి అనే పాత్రలో.. మహదేవ్‌కు పరమభక్తురాలిగా కనిపించనుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఓదెల 2 షూటింగ్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారు.ఇక గతకొద్ది రోజులుగా నిర్విరామంగా షూటింగ్ ను జరుపుతున్నారు మేకర్స్. ప్రస్తుతం అయితే రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓదెల మల్లన్న టెంపుల్ సెట్ లో క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. తమన్నా ఇంకా ఇతర కీలక పాత్రలతో పాటు దాదాపు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూట్ లో పాల్గొంటున్నట్టు సమాచారం.

అలనాటి రామచంద్రుడు ట్రైలర్ రిలీజ్
చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ వంశీ, మోక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ అలనాటి రామచంద్రుడు. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించారు. ఆగష్ట్ 2 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ వరుసగా అప్ డేట్లను ఇస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మిస్టర్ బచ్చన్ టీజర్ రిలీజ్ - రవితేజ మాస్ ట్రీట్
మాస్ మాహారాజా రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు గతంలో వీరిద్దరి కంబినేషన్లో వచ్చి షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. వాటిలో మిరపకాయ్ సినిమా సూపర్ హిట్ ను అందించింది. దీంతో ఈసినిమాపై మొదటినుండీ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దానికితోడు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సితార, రెప్పల్ డప్పుల్ సాంగ్స్ మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మిస్టర్ బచ్చన్- రవితేజ్ డబ్బింగ్ కంప్లీట్
రవితేజ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఈసినిమా బాలీవుడ్ సినిమాకు రీమేక్ అంటూ వార్తలు రాగా ఈ వార్తలకు హరీష్ శంకర్ స్పందించి క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా నుండి వరుస అప్ డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఈసినిమా నుండి వరుసగా పాటలను కూడా రిలీజ్ చేస్తున్నారు. సితార అంటూ వచ్చిన ఫస్ట్ సాంగ్, రెప్పల్ డప్పుల్ అంటూ వచ్చిన సెకండ్ సాంగ్ రెండూ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.

ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే - విశ్వక్ సేన్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ డ్రామాగా రూపొందుతుండగా.. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ విశ్వక్ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. SRT ఎంటర్టైన్మెంట్స్పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని ఆదివారం లాంచ్ చేశారు.

లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్ రిలీజ్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వివిధ భాషలలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . తెలుగులో మహానటి సినిమాతో పరిచయమైన దుల్కర్ ఆ సినిమాలో నిడివి చిన్నదే అయినా తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన సీతా రామం తో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు లక్కీ భాస్కర్ అనే మరో వైవిధ్యమైన సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ గ్లింప్స్ రిలీజ్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మెకానిక్ రాకీ సినిమా ఒకటి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీపావళి పండుగ సందర్బంగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

మిరపకాయ్ కంటే, 100 టైమ్స్ బెటర్‌గా.. మిస్టర్ బచ్చన్
హీరో క్యారెక్టరైజేషన్, టేకింగ్, విజువల్స్, మ్యూజిక్ పరంగా 'మిరపకాయ్' కంటే 'మిస్టర్ బచ్చన్' హండ్రెడ్ టైమ్స్ బావుటుందని పేర్కొన్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ మేరకు ఆయన తాజాగా మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా తాను దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' ఎక్సప్లోజివ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది.

విడాముయర్చి నుండి.. యాక్షన్ కింగ్ అర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్
యాక్షన్ కింగ్ అర్జున్… దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని విలక్షణ నటుడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఈయన మెప్పించారు. మరోసారి తనదైన శైలిలో మరో విభిన్నమైన పాత్రతో ‘విడాముయర్చి’లో ఆకట్టుకోబోతున్నారాయన. కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’.

ధనుష్ బర్త్ డే.. కుబేర నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ డిఫరెంట్ పోస్టర్లు , గ్లింప్స్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. కాగా ఆదివారం ధనుష్ పుట్టినరోజు. శేఖర్ కమ్ముల టీం ధనుష్ పుట్టినరోజును అద్భుతమైన పోస్టర్ తో సెలబ్రేట్ చేసుకుంది.

ఓదెల 2 సెట్స్‌లో 'రేవు' రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్
నూతన నటీనటులతో మత్స్య కారుల జీవన నేపథ్యంలో హరినాథ్ పులి దర్శకత్వం వహించిన చిత్రం 'రేవు'. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్‌పై నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. నిర్మాణ పర్యవేక్షకుడిగా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.

రామ్ చరణ్ చేతుల మీదుగా.. రావు రమేష్ మూవీ ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారి కథానాయకుడిగా నటించిన చిత్రం 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో రావు రమేష్ సరసన ఇంద్రజ కథానాయికగా నటించగా.. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు.

దుల్కర్ సల్మాన్ హీరోగా.. ఆకాశంలో ఒక తార
మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్..తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరిచయం అక్కర్లేని పేరు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనదైన ముద్రవేశారీ అగ్ర కథానాయకుడు. తెలుగులోనూ మహానటి, సీతారామం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఈయన అలరించిన సంగతి తెలిసిందే. రీసెంట్గా విడుదలైన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీలోనూ అతిథి పాత్రలోనూ దుల్కర్ అలరించారు.

ఉషాపరిణయం.. నువ్వు నాకు నచ్చావ్ తరహా ఎంటర్టైనర్
నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుంది. ఉషా పరిణయం అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి 'లవ్ ఈజ్ బ్యూటిఫుల్' అనేది ఉపశీర్షిక. కె.విజయ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యతారలు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కె.విజయ్ భాస్కర్ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలివి.

యూత్‌ను ఆకట్టుకుంటోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్
స్నేహం కంటే విలువైనది ఈ ప్రపంచంలో లేదు.. అలాంటి స్నేహం, స్నేహితులు మధ్య కులం, మతం అడ్డుగోలుగా నిలిస్తే ఏమవుతుంది? చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్ షిప్ కంటే కులాలకే ఎక్కువ విలువిస్తారా? ఒకవేళ నిజమైన స్నేహం మధ్య కులాలు, మతాలు అడ్డొస్తే పరిస్థితులు ఎలా మారుతాయి? కులాలతో విడిపోయిన స్నేహితుల మనసుల్లో సంఘర్షణ ఎలా ఉంటుంది? చివరకు వారు కలిశారా? అనే విషయాలు తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందే.

దేవర సెకండ్ సాంగ్ హింట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా దేవర. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఒకపక్క షూటింగ్ ను పూర్తి చేస్తూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పార్లల్ గా పూర్తిచేస్తున్నారు మేకర్స్.

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైన మెగాస్టార్ దంపతులు
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ సినిమా షూటింగులతో, ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో ఫుల్ బిజీగా ఉంటుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తన రొటీన్ లైఫ్‌కి కొంచెం విరామం ప్రకటించారు. తాజాగా ఈ మెగా హీరో ఫ్యామిలీతో కలిసి హాలీడే వెకేషన్‌కి వెళ్లారు. శుక్రవారం నుంచి పారిస్‌లో సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. సతీమణి సురేఖతో కలిసి ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.