
ట్యాగ్ · 9 కథనాలు


స్ట్రాంగ్ మెసేజ్ తో వంశీ పైడిపల్లి - విజయ్

అఫీషియల్.. వంశీ తో 'విజయ్ 66'
'మహేష్' ఛాలెంజ్ ను స్వీకరించిన 'విజయ్'
కీర్తి సురేష్ మ్యూజికల్ విషెస్
మరోసారి పెద్ద మనసు చాటుకున్న విజయ్..!

దళపతి తనయుడు హీరోగా తమిళ "ఉప్పెన"

తెలుగు రాష్ట్రాల కు విజయ్ సాయం..!

50 రోజులు పూర్తి చేసుకున్న వారిసు (వారసుడు )
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి.

స్ట్రాంగ్ మెసేజ్ తో వంశీ పైడిపల్లి - విజయ్
తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న నటుడు దళపతి విజయ్‌తో వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వంశీ పైడి పల్లి రీసెంట్ సినిమా మహర్షి. ఇందులో రైతుల సమస్యలు, వ్యవసాయం గురించి చెప్పాడు. ఇక ఈసినిమాకు గాను జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. మరోవైపు విజయ్ కూడా దాదాపు ఈమధ్య అన్ని సినిమాలు మెసేజ్ ఒరియెంటెట్ సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కాబట్టి ఎలాంటి సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అఫీషియల్.. వంశీ తో 'విజయ్ 66'
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఇప్పుడు తన రూట్ ను మార్చారు. కేవలం తెలుగులో కాకుండా తమిళ్, హిందీలో కూడా తన మార్క్ ను చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే లెజెండరీ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీనితో పాటు దిల్ రాజు- తమిళ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో కూడా సినిమా రాబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.
'మహేష్' ఛాలెంజ్ ను స్వీకరించిన 'విజయ్'
సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తన నివాసంలో మొక్కలు నాటి పచ్చని ప్రపంచం కోసం ఒక్క అడుగు ముందుకు వేద్దాం అంటూ మరో ముగ్గురు స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్, నటి శృతిహాసన్‌లకు ఛాలెంజ్ విసిరారు. ఇక దీనిలో భాగంగా మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించాడు విజయ్. ఈ నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటాడు విజయ్. మహేష్ ఇది నీకోసం... గ్రీనర్ ఇండియా.. గుడ్ హెల్త్ థ్యాంక్యూ అంటూ మొక్కలు నాటుతూ తన ఆ పోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. మహేష్ విసిరినా ఛాలెంజ్ కు శృతి హాసన్ స్పందించి త్వరలో మొక్కలు నాటుతానని తెలిపింది.
కీర్తి సురేష్ మ్యూజికల్ విషెస్
తమిళ సూపర్ స్టార్ , తలపతి విజయ్ బర్త్ డే జూన్ 22 సందర్భంగా సినీ ప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లు వెత్తాయి. తెలుగు , తమిళ , మలయాళ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ , విజయ్ కు వెరైటీ గా బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు.
మరోసారి పెద్ద మనసు చాటుకున్న విజయ్..!
కరోనా నిర్మూలనలో భాగంగా ప్రభుత్వాలు తమ వంతు సాయం అందిస్తుండగా సినీ తారలు కూడా ముందుకొచ్చి పెద్దఎత్తున విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన వంతు సాయంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాల సహాయ నిధులకు రూ.1.30 కోట్లను విరాళంగా ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కూడా చెరో రూ.5 లక్షలు చొప్పున అందజేశారు.

దళపతి తనయుడు హీరోగా తమిళ "ఉప్పెన"
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ తేజ్, కృతిశెట్టి జంటగా నిజ జీవిత సంఘటనలతో "ఉప్పెన" మూవీ రూపొందింది. తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. భారీ అంచనాలు ఉన్న "ఉప్పెన" మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదాపడింది.

తెలుగు రాష్ట్రాల కు విజయ్ సాయం..!
కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన సహాయం అందిస్తున్నాయి. సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల దాక ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ఎవరికి తోచిన సాయం చేస్తున్నారు. ఆకలితో బాధపడే వారికి ఆహారం అందిస్తూ.. ఆర్థికంగా చేయూత నిస్తూ కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తున్నారు.
షూటింగ్ స్పాట్ లోనే విజయ్ కు ఐటీశాఖ షాక్..!
తమిళ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ తన సినిమాల ద్వారానే కాకుండా.. ఈ మధ్య పలు విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూటింగ్ సమయంలో ఐటీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి షాకిచ్చారు. అసలు సంగతేంటంటే.. విజయ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన 'బిగిల్' సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు.. 200 కోట్ల మార్క్ కలెక్షన్స్ సైతం సాదించింది. 'విజయ్ సినిమా అంటే ఆ మాత్రం కలక్షన్స్ రావడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు'. ఇక ఈ సినిమాను నిర్మించింది AGS ఎంటర్టైన్మెంట్స్.