కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Thala Ajith Latest Film Updates

ట్యాగ్ · 7 కథనాలు

సినిమా వార్తలు

హీరో అజిత్ రిస్కీ బైక్ స్టంట్స్

బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ , హుమా ఖురేషి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో కార్తికేయ నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ , చెన్నై లలో కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "వాలిమై " మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అజిత్ కు విలన్ గా.. కార్తికేయ హింట్ ఇచ్చాడా..!

`ఆర్ ఎక్స్ 100` తో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తికేయ మొదటి సినిమాతోనే సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయాడు. గత ఏడాది ఏకంగా నాలుగు చిత్రాలు హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడ‌ర్, 90 ML తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే అవి ఆశించినంత విజయం అందించలేక పోయాయి. వీటిలో `గ్యాంగ్ లీడ‌ర్`లో పోషించిన విల‌న్ రోల్ కు మాత్రం మంచి పేరొచ్చింది. హీరోగానే కాదు విలన్ గా కూడా తాను నటించగలని చూపించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో అజిత్ కు బర్త్ డే శుభాకాంక్షలు

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న తమిళ సూపర్ స్టార్ అజిత్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు సోషల్ మీడియా లో అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. "అమరావతి "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన అజిత్ "వాలి" , "పూవెల్లా ఉన్ వాసమ్" ," విలన్", "వరలారు" , "మన్ కథ" వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్నారు. దర్శకుడు శివ, హీరో అజిత్ కాంబినేషన్ లో "వీరమ్", "వేదాళం", "వివేగం", "విశ్వాసం" , దర్శకుడు వినోత్ , అజిత్ కాంబినేషన్ లో "నెర్కొండ పార్వై" తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
Thala Ajith Rides Back From Hyderabad To Chennai On Bike
సినిమా వార్తలు

తమిళ స్టార్ హీరో అజిత్ సాహసం

బోనీ కపూర్ మూవీస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్. వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై" తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో హుమా ఖురేషి, యామీగౌతమ్ కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డిఫరెంట్ యాక్షన్ సీన్స్ తో "వాలిమై"

బోనీ కపూర్ మూవీస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "తీరన్ అధిగారం ఒండ్రు " , "నెర్కొండ పార్వై " మూవీస్ ఫేమ్ హెచ్ వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో దూసుకుపోతున్న స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై" తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో హుమా ఖురేషి, యామీ గౌతమ్ కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Thala Ajith Contributes 1.25 Crore To Corona Virus Fund
సినిమా వార్తలు

భారీ విరాళం ప్రకటించిన 'అజిత్'

కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టే చర్యల నిమిత్తం తమ వంతు సాయం అందించడానికి పలువురు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు సినీ పరిశ్రమలకు చెందిన హీరోలు, హీరోయిన్లు ఇప్పటికే పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీరి జాబితాలో తమిళ్ స్టార్ హీరోయిన్ అజిత్ కూడా చేరిపోయారు. రూ. కోటి 25 లక్షల రూపాయిలను విరాళంగా ప్ర‌క‌టించారు. ప్రధాన మంత్రి స‌హాయ నిధికి రూ. 50 ల‌క్ష‌లును, తమిళనాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 50 ల‌క్ష‌లను, అలాగే సినీ వర్కర్స్ యూనియన్ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఐ కోసం మరో రూ. 25 ల‌క్ష‌లను అజిత్ విరళంగా అందిస్తున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Thala Ajith Once Again To Play Dual Role For His Upcoming Movie Valimai
సినిమా వార్తలు

మ‌రోసారి అజిత్ ద్విపాత్రాభిన‌యం?

గ‌త ఏడాది ‘నేర్కొండ పార్వై’ (బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `పింక్`కి త‌మిళ్ వెర్ష‌న్) చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నారు కోలీవుడ్ స్టార్ అజిత్, ద‌ర్శ‌కుడు హెచ్.వినోద్. కాగా, ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో `వ‌లిమై` పేరుతో మ‌రో సినిమా రూపొందుతోంది. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో అజిత్‌కి జంట‌గా హ్యూమా ఖురేషి న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌మందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభిన‌యంతో అల‌రించ‌నున్నాడ‌ని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్