
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 10


మత్తు వదలరా కాంబోలో మరో సినిమా

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్

సంక్రాంతికి వస్తున్నాం రేర్ ఫీట్

ఆంధ్ర కింగ్ తాలూకా బీజీఎమ్ వర్క్ స్టార్ట్

SSMB 29లో కుంభ గా పృథ్వీరాజ్ సుకుమారన్

పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్

ప్రేమంటే సెకండ్ సింగిల్ రానుంది

ఫంకీ రిలీజ్ డేట్ ఫిక్స్

కమల్ బ్యానర్ లో రజినీ కాంత్ సినిమా

ఎన్టీఆర్ నీల్ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది

కాంత ట్రైలర్ రిలీజ్ రిలీజ్


కొత్త లుక్ లో ఎన్టీఆర్ .. పిక్స్ వైరల్

సింగర్ గా మారిన నవీన్ పొలిశెట్టి

పెద్ది ఫస్ట్ సింగిల్ కు రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది నుండి నిన్న విడుదలైన ఫస్ట్ సాంగ్ ఊహించినట్లుగానే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. భారీ అంచనాలతో వచ్చిన చికిరి చికిరి సాంగ్ యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ తో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో దూసుకుపోతుంది.కేవలం తెలుగులోనే ఈసాంగ్ 24గంటల్లో 29 మిలియన్ల కుపైగా వ్యూస్ తో ఆల్ టైం సౌత్ నెంబర్ 1 లిరికల్ వీడియో సాంగ్ గా నిలిచింది. ఇంతకుముందు అల్లు అర్జున్ పుష్ప 2 నుండి వచ్చిన కిస్సిక్ సాంగ్ 24గంటల్లో సింగిల్ లాంగ్వేజ్ లో 27 మిలియన్లకు పైగా వ్యూస్ తో మొదటి స్థానంలో ఉండగా పెద్ది ఆ రికార్డు బ్రేక్ చేసి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది.కేవలం తెలుగులోనే కాదు ఈ పాట హిందీలో…

మత్తు వదలరా కాంబోలో మరో సినిమా
సెన్సేషనల్ మత్తువదలరా కాంబినేషన్ మరోసారి అలరించబోతోంది. కల్ట్ హిట్ అయిన మత్తు వదలరాతో తో దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత మరో బ్లాక్‌బస్టర్ సీక్వెల్ మత్తువదలరా 2 విజయాన్ని అందుకున్న రితేష్ రానా తన నాల్గవ డైరెక్షనల్ మూవీని ప్రకటించారు.యూనిక్ స్టయిల్ నరేషన్ తో ఆకట్టుకునే రితేష్ రానా మరోసారి సత్యతో జతకడుతున్నారు.ఇది ప్రేక్షకులకు మరో నవ్వుల విందును అందించనుంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

అఖండ 2 ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ .. సాంగ్ రిలీజ్ డేట్ ఛేంజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపీ ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎం తేజస్విని నందమూరి ప్రెజెంట్స్ #BB4 అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ 'తాండవం' సాంగ్ ప్రోమో రిలీజ్- నవంబర్ 14న ఫుల్ సాంగ్ రిలీజ్

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరో ఎక్సయిటింగ్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తో పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ (అన్బు మణి, అరివు మణి) దర్శకులుగా అరంగేట్రం చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ #KHAA, కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా "హంట్ మోడ్ ఆన్" అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్ చేశారు.

సంక్రాంతికి వస్తున్నాం రేర్ ఫీట్
ఈ నెల నవంబర్ 20వ తేదీ నుండి గోవాలో ఘనంగా జరగబోయే అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (IFFI) లోని ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రదర్శితం కానుంది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 28 వరకు ఈ వేడుకలు పనాజీలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో జరుగుతాయి.

రానాతో కలసి కాంత చేయడం చాలా ఆనందంగా వుంది - దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా 'కాంత' నవంబర్ 14న విడుదల కానుంది. టీజర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో రానా ,సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనుండగా భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది.దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాంత కథ విన్న వెంటనే సినిమా చేయాలనిపించింది - రానా దగ్గుబాటి
లక్కీ భాస్కర్ తరువాత మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా కాంత . టీజర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో రానా , సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనుండగా భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. వచ్చే వారం ఈసినిమా విడుదలకానుంది.దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆంధ్ర కింగ్ తాలూకా బీజీఎమ్ వర్క్ స్టార్ట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.షూట్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచాయి.ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

SSMB 29లో కుంభ గా పృథ్వీరాజ్ సుకుమారన్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB 29 నుండి ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ వచ్చేసింది. ఎన్నో రోజులుగా సినిమా టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తుండగా, రాజమౌళి ముందుగా మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి సప్రైజ్ ఇచ్చారు.ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో పృథ్వీరాజ్ రోబోటిక్ ఛైర్ లో కూర్చొని ఇంటెన్స్ లుక్ లో కనిపించారు.

పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెద్ది సింగిల్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఇంతకుముందు విడుదలైన ప్రోమో ఇంస్టా రీల్స్ లో తెగ తిరుగుతుంది. ఇక ఈరోజు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ సాంగ్ అంచనాలకు తగ్గట్లుగానే ఉండి చార్ట్ బస్టర్ అనిపించుకుంది.మోహిత్ చౌహన్ వోకల్స్ , ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ , చరణ్ డ్యాన్స్ ,జాన్వీ కపూర్, విజువల్స్ సాంగ్ ను సూపర్ హిట్ చేశాయి.తెలుగు తోపాటు హిందీ ,మలయాళ , కన్నడ లో విడుదలకాగా అన్ని భాషల్లో సేమ్ ఫీల్ తెప్పించింది. బాలాజీ ఈ సాంగ్ ను రచించారు.ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించడం ఖాయం. ఓవరాల్ గా సాంగ్ తో సినిమాపై అంచనాలను మరింత…

ప్రేమంటే సెకండ్ సింగిల్ రానుంది
ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే చేస్తున్నాడు.ఇందులో ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్.

ఫంకీ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో విశ్వక్ సేన్ - డైరెక్టర్ అనుదీప్ కెవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫంకీ.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అనుదీప్ మార్క్ కామెడీ తో వచ్చిన ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమాలో విశ్వక్ సేన్ డైరెక్టర్ గా నటిస్తుండగా హీరోయిన్ కయదు లోహర్ నిర్మాత రోల్ లో కనిపించనుంది.

కమల్ బ్యానర్ లో రజినీ కాంత్ సినిమా
తమిళ అగ్ర నటులు రజినీకాంత్, కమల్ హాసన్ దాదాపు ఐదు దశాబ్దాల స్నేహానికి గుర్తుగా ఒక మెగా ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై, రజినీకాంత్ కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. రజినీకాంత్ కు ఇది 173 వ సినిమా. ఈ తలైవర్ 173 చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుందర్ సి డైరెక్ట్ చేయనున్నాడు.

ఎన్టీఆర్ నీల్ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అవుట్‌పుట్ విషయంలో కొన్ని మార్పులు, రూమర్స్ వచ్చినా, చిత్ర యూనిట్ అవన్నీ పక్కనపెట్టి కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

అఖండ 2 ఫస్ట్ సింగిల్ సాంగ్ రానుంది
సీనియర్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్ గా 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై 'అఖండ 2: తాండవం' ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.

కాంత ట్రైలర్ రిలీజ్ రిలీజ్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కాంత'. ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.ఇక ప్రమోషన్ లో భాగంగా ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండి సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.1950ల నాటి సినిమా నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ థిల్లర్ గా రానుంది ఈసినిమా.ట్రైలర్ చూస్తుంటే దుల్కర్ తోపాటు భాగ్యశ్రీ , రానా , సముద్రఖని పోటీ పడి నటించనట్లున్నారు.సినిమాలో వీరి నటన హైలైట్ అవ్వడం ఖాయం. ఓవరాల్ గా ట్రైలర్… సినిమా షూర్ షాట్ హిట్ అనే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కాంత పాన్ ఇండియా భాషల్లో విడుదలకానున్నడం తో తెలుగులోనూ ఈసినిమా ఆఫ్ లైన్…

జటాధర డివైన్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి- హీరో సుధీర్ బాబు
నవ దళపతి సుధీర్ బాబు,బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు.జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్,అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు.జటాధర నవంబర్ 7న హిందీ,తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు అరోరా విలేకరుల సమావేశంలో సినిమా…

కొత్త లుక్ లో ఎన్టీఆర్ .. పిక్స్ వైరల్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త లుక్‌తో కనబడిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ తాజా లుక్ ఆయన రాబోయే పాన్-ఇండియా చిత్రం 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) కోసమే.ఈ ఫొటోల్లో గతంలో కంటే ఎన్టీఆర్ చాలా బరువు తగ్గి, లీన్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు.ఈ సన్నబడిన లుక్ పట్ల కొందరు అభిమానులు మొదట్లో ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ,ఆయన పాత్రకు తగినట్టుగా ఈ మార్పు చేసుకున్నారని తెలుస్తోంది.

సింగర్ గా మారిన నవీన్ పొలిశెట్టి
సినిమా సినిమా కు చాలా గ్యాప్ తీసుకొని ప్రామిసింగ్ కంటెంట్ తో వరుస విజయాలు దక్కించుకుంటున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజై రెండేళ్లు దాటినా ఇప్పటివరకు నవీన్ మరో సినిమాను కంప్లీట్ చేయలేదు.ఇక ఈహీరో ప్రస్తుతం అనగనగా ఒక రాజు చేస్తున్నాడు. మారి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో ఇడ్లీ కడై
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం 'ఇడ్లీ కడై' (తెలుగులో ఇడ్లీ కొట్టు) ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లో సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమా అక్టోబర్ 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓటీటీలోకి వచ్చిన వెంటనే ఈ చిత్రం ఊహించని విధంగా అత్యధిక ఆదరణ పొంది ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఓజీ వంటి పెద్ద సినిమాల కంటే కూడా ఇడ్లీ కడై తక్కువ రోజుల్లోనే ఎక్కువ వ్యూస్‌ను సాధించడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం వారం రోజుల్లోనే ఈసినిమా 5.1 మిలియన్ల వ్యూస్…