
ట్యాగ్ · 10 కథనాలు


శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్ 'భళా తందనాన'
'గాలి సంపత్' డైరెక్షన్ లో కూడా
'రాజ రాజ చోర' షూటింగ్ రీస్టార్ట్
హీరో శ్రీవిష్ణు కొత్త మూవీ ప్రారంభం
హీరో శ్రీవిష్ణు కు జోడీ గా కాజల్ అగర్వాల్ ?
కొత్త దర్శకుడితో శ్రీవిష్ణు మూవీ

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే శ్రీవిష్ణు హర్ష కనుగొంటి దర్శకత్వంలో ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత తన కొత్త ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేశాడు. నేడు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు సామజవరగమన అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇప్పటికే ఈసినిమా…

అల్లూరి కి గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం 'అల్లూరి'. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా బెక్కెం బబిత సమర్పించారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

శ్రీ విష్ణు 'అల్లూరి' ఫస్ట్ లుక్ రిలీజ్..!
సినిమా జయాపయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో ఒకరైన శ్రీవిష్ణు. గత ఏడాది ‘గాలి సంపత్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈఏడాది అర్జున ఫల్గుణ, భళా తందనాన అనే సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను సిద్దం చేస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా టైటిల్ ను అలానే ప్రీ లుక్ ను చాలా రోజుల క్రితమే రిలీజ్ చేశారు. అల్లూరి అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఈసినిమాలో శ్రీవిష్ణు పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈసినిమా నుండి తాజాగా…

శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్ 'భళా తందనాన'
ప్రస్తుతం శ్రీవిష్ణు వరుస సినిమాలకు ఓకే చెప్తూ మంచి జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది. శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ‘గాలి సంపత్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
'గాలి సంపత్' డైరెక్షన్ లో కూడా
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మాత్రం రాపిడ్ స్పీడ్ లో జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అరుకులో ప్రారంభమవగా.. సుమారు 25 రోజులపాటు అరుకు, విశాఖపట్నంలో తొలి షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేశారు. ఒక్క షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను 80 శాతం పూర్తి చేశారంటే చెప్పొచ్చు ఎంత ఫాస్ట్ గా వున్నారో. ఇక ఇప్పుడు దాదాపు షూటింగ్ చివర దశకు చేరుకుంది.
'రాజ రాజ చోర' షూటింగ్ రీస్టార్ట్
కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ " రాజ రాజ చోర". ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు.
హీరో శ్రీవిష్ణు కొత్త మూవీ ప్రారంభం
వైవిధ్య భరిత మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు శ్రీ విష్ణు కొత్త మూవీ ఈ రోజు హైదరాబాద్ లో పూజ కార్యక్రమం జరుపుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరో గా ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది.
హీరో శ్రీవిష్ణు కు జోడీ గా కాజల్ అగర్వాల్ ?
2007 సంవత్సరం లో లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు ,2008 సంవత్సరంలో పళని మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అయిన కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని, స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కాజల్ అగర్వాల్ నటించిన పలు తెలుగు, తమిళ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాలలో కాజల్ నటించారు. 12 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ కు సీనియర్ హీరోల మూవీస్ తో బాటు యువ హీరోల మూవీస్ లో కూడా ఆఫర్స్ రావడం విశేషం.
కొత్త దర్శకుడితో శ్రీవిష్ణు మూవీ
వైవిధ్య భరిత పాత్రలలో విభిన్న కథాంశాల చిత్రాలలో హీరోగా నటిస్తున్న శ్రీవిష్ణు నటించిన నీదీ నాదీ ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా మూవీస్ ఘనవిజయం సాధించాయి. సెలెక్టివ్ గా మూవీస్ లో నటిస్తున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఒక కొత్త దర్శకుడి మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ ఒక వినూత్న కథతో రూపొందనుంది.