
ట్యాగ్ · 9 కథనాలు


హీరో సిద్ధార్ధ్ లాక్ డౌన్ సెల్ఫీ

'మహా సముద్రం' లో నెగెటివ్ పాత్రలో సిద్దార్థ్..!

మల్టీ స్టారర్ మూవీ లో సిద్ధార్థ్
స్టార్ హీరోల సినిమాల్లో సిద్దు కి ఛాన్స్..!
హీరో సిద్ధార్థ్ కు జోడీ గా నివేత థామస్

ఎంగేజ్ మెంట్ చేసుకున్న సిద్దార్థ్- అదితి
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి ఇద్దరూ గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే కదా. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహా సముద్రం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాతోనే వీరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుండీ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల నుండి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు హల్ చేస్తున్నాయి. వరంగల్ లోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు అంటూ పలు కథనాలు వచ్చాయి.

ఇండియన్ 2 నుండి సిద్దార్థ్ పోస్టర్ రిలీజ్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈసినిమాను జూన్ నాటికి పూర్తి చేయాలని శంకర్ ఇప్పటికే వెల్లడించాడు.. ఆదిశగానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు శంకర్. ఇక్కడ షెడ్యూల్స్ ను పూర్తిచేసుకున్న ఇండియన్2 టీమ్ రీసెంట్ గానే తైవాన్ వెళ్లి అక్కడ కూడా కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. తైవాన్ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు…

హీరో సిద్ధార్ధ్ లాక్ డౌన్ సెల్ఫీ
"బాయ్స్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన సిద్ధార్ధ్ , బ్లాక్ బస్టర్ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా "మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సిద్ధార్ధ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ "రంగ్ దే బసంతి "మూవీ తో సిద్ధార్ధ్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "బొమ్మరిల్లు ", "లవ్ ఫెయిల్యూర్ ", "జబర్దస్త్ " వంటి మూవీస్ తో సిద్ధార్ధ్ ప్రేక్షకులను అలరించారు.

'మహా సముద్రం' లో నెగెటివ్ పాత్రలో సిద్దార్థ్..!
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లు గా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత కార్తికేయ, పాయల్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించగా.. అజయ్ భూపతి మాత్రం తన రెండో సినిమాను ఇంతవరకూ పట్టాలెక్కించలేదు.
కొత్త సినిమాపై వస్తున్న రూమర్లకు చెక్..!
ఇటీవలే 'వదలడు' సినిమాతో వచ్చిన సిద్దార్ధ్ ఇప్పుడు తాజాగా మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'టక్కర్'. నిజానికి ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తెలిసిందే కదా కరోనా వల్ల రిలీజ్ కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో అన్ని సినిమాలకు వస్తున్నట్టే... ఈ సినిమాకు పై కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సిద్దార్ధ ఈ వార్తలన్నిటినీ ఖండించాడు. తమ సినిమా థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని.. ఎప్పుడు లాక్ డౌన్ అయిపోయి ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ చేస్తారో అప్పటి వరకూ వెయిట్ చేస్తామని చెప్పాడు.

మల్టీ స్టారర్ మూవీ లో సిద్ధార్థ్
"నువ్వొస్తానంటే నేనొద్దంటానా ", "బొమ్మరిల్లు ", "జబర్దస్త్ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సిద్ధార్థ్ తరువాత తమిళ మూవీస్ తో బిజీగా మారారు. చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ తెలుగు లో ఒక మల్టీ స్టారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాలీవుడ్ కు సిద్ధార్థ్కమ్ బ్యాక్ మూవీ గా ఈ మల్టీ స్టారర్ రూపొందనుంది.

తెలుగు ప్రేక్షకులకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్న సిద్ధార్థ్
"బాయ్స్" మూవీ తో కోలీవుడ్, టాలీవుడ్ లకు పరిచయమైన సిద్ధార్థ్ బ్లాక్ బస్టర్ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా " మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. "బొమ్మరిల్లు ", "జబర్దస్త్", "లవ్ ఫెయిల్యూర్" వంటి హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తరువాత సిద్ధార్థ్ కోలీవుడ్ లో బిజీగా మారారు.
స్టార్ హీరోల సినిమాల్లో సిద్దు కి ఛాన్స్..!
ఈ వయసులో కూడాయంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ తో హిట్ కొట్టిన రజినీ అదే జోష్ తో అప్పుడే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. శివ డైరెక్షన్లో రజినీ తన కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ముగిసినట్టు తెలుస్తుంది.
హీరో సిద్ధార్థ్ కు జోడీ గా నివేత థామస్
కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న నివేత థామస్ సూపర్ హిట్ "జెంటిల్ మన్ " మూవీ తో టాలీవుడ్ లో ఎంటర్ అయ్యారు. నివేత నటించిన నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా మూవీస్ ఘనవిజయం సాధించాయి. నివేత ప్రస్తుతం "V" మూవీ లో నటిస్తున్నారు. "పింక్ " రీమేక్ మూవీ కి ఎంపికయ్యారు. సిద్దార్థ్ హీరోగా రూపొందనున్న తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.