ట్యాగ్ · 10 కథనాలు
మరో ప్రేమ కథా చిత్రం లో శర్వానంద్ ?

హీరో శర్వానంద్ తమిళ మూవీ ?
శర్వానంద్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్

2020 సంవత్సరంలో మూడు సినిమాలు రిలీజ్
శర్వానంద్ తో అజయ్ భూపతి `మహాసముద్రం`?

"శ్రీకారం " చుట్టిన శర్వానంద్

టైటిల్ అన్వేషణలో శర్వానంద్ చిత్రం

ప‌్లే బాయ్ గా శర్వానంద్?

నాగచైతన్య దర్శకుడితో శర్వానంద్?
ముగ్గురు నాయికలతో శర్వానంద్
యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో ఓ పిరియాడిక్ రొమాంటిక్ సాగా రాబోతున్న సంగతి తెలిసిందే. 1910 నుంచి 2021 వరకు సాగే ప్రేమకథా చిత్రమిది. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో శర్వానంద్ సరసన ముగ్గురు నాయికలు సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు చందు మొండేటి స్వయంగా వెల్లడించాడు.
మరో ప్రేమ కథా చిత్రం లో శర్వానంద్ ?
యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న "శ్రీకారం "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "RX 100" మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ "మహా సముద్రం" మూవీ కి శర్వానంద్ ఓకే చెప్పారు. శర్వానంద్ ఇప్పుడు మరో వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

హీరో శర్వానంద్ తమిళ మూవీ ?
"రన్ రాజా రన్ ", మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు", "శతమానం భవతి", "మహానుభావుడు" వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించిన హీరో శర్వానంద్ కథానాయకుడిగా, చేరన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన "రాజాధిరాజా" మూవీ 2015 సంవత్సరంలో తమిళ భాషలో రిలీజ్ అయ్యింది. ఆ మూవీ తరువాత తెలుగు మూవీస్ తో బిజీగా ఉన్న శర్వానంద్ తమిళ మూవీస్ లో నటించలేదు. శర్వానంద్ ఇప్పుడు ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
శర్వానంద్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్
హీరో శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఒక కొత్త సినిమా ప్రకటన వెలువడింది. శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 3 గా సూపర్ హిట్ మూవీస్ "నేను శైలజ ", "చిత్రలహరి" ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడు గా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది.

2020 సంవత్సరంలో మూడు సినిమాలు రిలీజ్
యంగ్ హీరో శర్వానంద్ 2020 సంవత్సరంలో మూడు సినిమాలతో ప్రేక్షక, అభిమానులను అలరించనున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా తమిళ సూపర్ హిట్ మూవీ "96 " తెలుగు రీమేక్ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుంది. హీరో శర్వానంద్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.
శర్వానంద్ తో అజయ్ భూపతి `మహాసముద్రం`?
గత ఏడాది సంచలనం `ఆర్ ఎక్స్ 100`తో దర్శకుడిగా తొలి అడుగు వేశాడు అజయ్ భూపతి. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా రెండో చిత్రం పట్టాలెక్కలేదు. వాస్తవానికి, `మహాసముద్రం` పేరుతో ఓ మల్టీస్టారర్ ని చేయాలని అజయ్ భావించాడు. అయితే, పలు కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్ళబోతోందని సమాచారం.

"శ్రీకారం " చుట్టిన శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడు గా నటించే కొత్త సినిమా ఆదివారం (జూన్ 30వ తేదీ )పూజ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషొర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా శ్రీకారం మూవీ రూపొందనుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్ కొట్టిన శ్రీకారం మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభమవుతుంది. మిక్కీ J మేయర్ సంగీతం అందిస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. శ్రీకారం మూవీ ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

టైటిల్ అన్వేషణలో శర్వానంద్ చిత్రం
యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో ఓ గ్యాంగ్ స్టర్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లవర్ బాయ్‌గా, ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్‌గా… ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో శర్వానంద్ నటిస్తుండగా… అతనికి జోడీగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప‌్లే బాయ్ గా శర్వానంద్?
యువ కథానాయకుడు శర్వానంద్ ఈ ఏడాది రెండు ఆసక్తికరమైన చిత్రాలతో అభిమానులను పలకరించనున్నాడు. వాటిలో ఒకటి... సుధీర్ వర్మ రూపొందిస్తున్న చిత్రం కాగా... మరొకటి `96` రీమేక్. ఈ రెండు సినిమాలు కూడా తక్కువ గ్యాప్‌లోనే తెరపైకి రాబోతున్నాయి. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా మే నెలలో విడుదల కానుండగా... `96` రీమేక్ ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుందని సమాచారం.

నాగచైతన్య దర్శకుడితో శర్వానంద్?
యువ కథానాయకుడు శర్వానంద్ ఈ ఏడాది రెండు చిత్రాలతో సందడి చేయనున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న పేరు నిర్ణయించని సినిమా వేసవిలో విడుదల కానుండగా... తమిళ బ్లాక్‌బస్టర్ `96`కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది. ఈ రెండు సినిమాల తరువాత మరో ఆసక్తికరమైన సినిమాకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.