
ట్యాగ్ · 7 కథనాలు

బయోపిక్ మూవీ లో సమంత ?
రిటైర్ మెంట్ పై సమంత క్లారిఫికేషన్

ఒకే చిత్రంలో నయనతార, సమంత
`కర్తవ్యం` దర్శకుడితో సమంత చిత్రం?

"మహాసముద్రం " మూవీ హీరోయిన్ సమంత ?
హారర్ థ్రిల్లర్ లో సమంత?

52 వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథి గా సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు.సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన సమంత వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారు.
బయోపిక్ మూవీ లో సమంత ?
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఒక బయోపిక్ మూవీ ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటిక్ సింగర్, యాక్టి విస్ట్ , స్కాలర్ బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ ని రూపొందించనున్నారు. నాగరత్నమ్మ క్యారెక్టర్ కు సూటబుల్ యాక్ట్రెస్ కై సింగీతం ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట అనుష్కను సంప్రదించగా డేట్స్ ప్రాబ్లెమ్ తో సెట్ కాలేదు. రీసెంట్ గా ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత ను సంప్రదించగా స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
రిటైర్ మెంట్ పై సమంత క్లారిఫికేషన్
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత "జాను "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు. "జాను "మూవీ ప్రమోషన్స్ లో రెండు లేదా మూడు సంవత్సరాలు మాత్రమే నటిస్తానని, రిటైర్ మెంట్ గురించి స్టేట్ మెంట్ ఇచ్చి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. సమంత ఇప్పుడు ఆ స్టేట్ మెంట్ పై క్లారిఫికేషన్ ఇచ్చారు.

ఒకే చిత్రంలో నయనతార, సమంత
ఇద్దరు అగ్ర కథానాయకులు కలసి నటిస్తే ఎంత కనువిందుగా ఉంటుందో... ఇద్దరు అగ్ర నాయికలు జట్టుకట్టినా అంతే రసవత్తరంగా ఉంటుంది. అలాంటి కనువిందునే కలగించబోతున్న చిత్రం... `కాదు వాక్కుల రెండు కాదల్`. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఈ తమిళ సినిమాలో దక్షిణాది అగ్ర తారలు నయనతార, సమంత తొలిసారి కలసి నటించబోతున్నారు.
`కర్తవ్యం` దర్శకుడితో సమంత చిత్రం?
`యూటర్న్`, `ఓ బేబీ`.. ఇలా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ముందుకు సాగుతున్న టాలెంటెడ్ బ్యూటీ సమంత... మరో నాయికా ప్రాధాన్య చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. ఇందులో ఇదివరకెన్నడూ పోషించని ఓ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలిసింది.

"మహాసముద్రం " మూవీ హీరోయిన్ సమంత ?
బ్లాక్ బస్టర్ "RX 100"మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో "మహాసముద్రం " మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ లో శర్వానంద్ కు జోడీ గా సమంత ఎంపిక అయ్యారని సమాచారం. హీరో శర్వానంద్, సమంత జంటగా నటించిన "96 " మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సూపర్ హిట్ తమిళ మూవీ "96 " కు తెలుగు రీమేక్ గా రూపొందింది.
హారర్ థ్రిల్లర్ లో సమంత?
`యూ టర్న్`(2018), `ఓ బేబి`(2019)... ఇలా ఏడాదికో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో ముందుకు సాగుతోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత. ఈ పరంపరలోనే వచ్చే ఏడాది కూడా ఓ బైలింగ్వల్ హారర్ థ్రిల్లర్ తో పలకరించబోతోందట ఈ కుందనపు బొమ్మ.