
ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2


యూఎస్ కు వెళ్లనున్న మిస్టర్ బచ్చన్ టీం

మిస్టర్ బచ్చన్ భారీ షెడ్యూల్ కంప్లీట్

లక్నోలో మిస్టర్ బచ్చన్ టీమ్ సందడి

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్‌డేట్

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ ప్రారంభం

రవితేజ మిస్టర్ బచ్చన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మాస్ మహా రాజా రవితేజ సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. నిజానికి రవితేజ కు సాలిడ్ హిట్ దక్కి చాలా రోజులైపోయింది. ధమాకా తరువాత ఇంతవరకూ ఆ రేంజ్ హిట్ కొట్టలేదు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మిస్టర్ బచ్చన్ సెట్స్‌లో రవితేజ ఫ్యాన్, ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీల్
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్‌డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో హీరో రవితేజ తన ఫేవరేట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ పోజ్‌లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే.

యూఎస్ కు వెళ్లనున్న మిస్టర్ బచ్చన్ టీం
హరీష్ శంకర్,మాస్ మహా రాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా మిస్టర్ బచ్చన్.ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించనున్నాడు.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది .ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం యూఎస్ వెళ్లనున్నారు.ఈ షెడ్యూల్ లో సాంగ్స్ తోపాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.దాంతో సినిమా దాదాపు పూర్తయినట్లే.

మిస్టర్ బచ్చన్ భారీ షెడ్యూల్ కంప్లీట్
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. మిరపకాయ్ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూశాం. దీంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

లక్నోలో మిస్టర్ బచ్చన్ టీమ్ సందడి
మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా ఈ ఏడాది అప్పుడే ఈగల్ అంటూ వచ్చేశాడు. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

వేలంటైన్స్ డే సందర్భంగా.. మిస్టర్ బచ్చన్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటించిన ‘ఈగల్’ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శించబడుతోన్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ క్రమంలో రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం 'మిస్టర్ బచ్చన్'. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్‌డేట్
మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మిస్టర్ బచ్చన్'. నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. 'మిస్టర్ బచ్చన్' తదుపరి షెడ్యూల్ ఫిక్స్ అయింది. దీనికోసం బచ్చన్ టీం కేరళలోని కరైకుడికి బయలుదేరింది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా త్వరలో ఈగల్ అంటూ రాబోతున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. రవితేజ హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. అంతేకాదు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్…