ట్యాగ్ · 7 కథనాలు
'విరాట పర్వం' టీం కు తప్పిన ప్రమాదం..!
ఆ కోరిక వచ్చే ఏడాది నెరవేరుతుంది..!
రానా దగ్గుబాటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ?

హారర్ మూవీ లో రానా దగ్గుబాటి
నో డౌట్.. థియేటర్ లోనే 'విరాట పర్వం'
థియేటర్స్ లేకపోవడంతో చిన్నగా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు దర్శకనిర్మాతలు. పెద్ద సినిమాలు అంటే ఎలాగూ థియేటర్ లోనే రిలీజ్ కావాలి.. ఉదాహరణకి ఒక ఆర్ఆర్ఆర్, ఒక కె.జి.యఫ్ లాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ వెయిట్ చేస్తారు.. అసలు ఆసినిమాలు ఓటీటీ రిలీజ్ చేస్తామన్నా ముందు ప్రేక్షకులే ఒప్పుకోరు. కానీ చిన్న సినిమాలు .. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాల పరిస్థితి వేరు. అందుకే చిన్న సినిమాలు అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీ రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెంగ్విన్ అయింది.. ఇటీవల 'వి' సినిమా అయింది…

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో..!
భల్లాలదేవ మళ్లీ వర్క్ మోడ్ లోకి వచ్చేసాడు. అసలు పెళ్లి చేసుకుంటాడా అన్న క్వశ్చన్ మార్క్ ను తీసేసి అందరికీ షాకిస్తూ లాక్ డౌన్ సమయంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు రానా. ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలో ఉన్న రానా ఇక ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చెప్పాడుపెట్టాడు. రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తిచేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కు బ్రేక్ పడింది. రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాను సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రానా పెళ్లి - సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న రానా - ప్రభాస్ పై ఫన్నీ మీమ్స్
ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చింది అన్న సామెత వినే ఉంటారు కదా.. ఇప్పుడు బాహుబలి ప్రభాస్ ను చూస్తే అదే గుర్తొస్తుంది. దీనికి కారణం ఏంటో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా..రానా పెళ్లి విషయమే. నిన్న సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను బయటి ప్రపంచానికి చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. అందరూ ఏమో కానీ టాలీవుడ్ లో కొందరు హీరోలు మాత్రం రానా పై ఫన్నీ కామెంట్స్ వేస్తున్నారు. సాయి తేజ్ ఇందంతా కలా.. మళ్ళీ పడుకుందాం అని ట్వీట్ చేయగా.. నాని అయితే 2020 లో ఇంకా ఏమేం చూస్తామో అని ఫన్నీ గా ట్వీట్ చేశాడు. ఇక ప్రభాస-రానా పై అయితే ఒక రేంజ్ లో ట్వీట్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఈ రోజు ఈ మీమ్స్ మీదనే రచ్చ…
'విరాట పర్వం' టీం కు తప్పిన ప్రమాదం..!
వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.
ఆ కోరిక వచ్చే ఏడాది నెరవేరుతుంది..!
లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తున్నారు.. అయితే సోషల్ మీడియాద్వారా మాత్రం ఒకరికొకరు దగ్గరగా ఉన్నారు. ఇక సెలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ.. వారి సినిమాల గురించి.. ఏం చేస్తున్నారు.. ఏం చేయబోతున్నారు.. ఇలా పలు విషయాలు గురించి.. పలు ఆసక్తికరమైన విషయాల గురించి చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా... రానాను రొమాంటిక్ హీరోగా చూడాలని ఉందనే కోరికను ఒక అభిమాని వ్యక్తం చేయగా, వచ్చే ఏడాది ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే…
రానా దగ్గుబాటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ?
రానా దగ్గుబాటి పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆసక్తికర స్క్రిప్ట్స్, ఛాలెంజింగ్ రోల్స్ కు ప్రాధాన్యత నిచ్చే రానా ఇప్పటికే కంటెంట్ బేస్డ్ మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం "విరాటపర్వం" మూవీ లో హీరోగా నటిస్తున్న రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సమావేశమయ్యారు.

హారర్ మూవీ లో రానా దగ్గుబాటి
ఆసక్తికర క్యారెక్టర్స్, విభిన్న కథాంశ చిత్రాలను ఎంపిక చేసుకొనే రానా దగ్గుబాటి ఒక హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు తెలుగు, హిందీ మూవీస్ లో నటిస్తున్న రానా ప్రస్తుతం USA లో ఉన్నారు. ఈ నెలాఖరుకు హైదరాబాద్ చేరుకొని వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. కంటిన్యూ షెడ్యూల్స్ తో విరాటపర్వం మూవీ షూటింగ్ పార్ట్ రానా కంప్లీట్ చేస్తారని సమాచారం.