
ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2


`జెర్సీ` దర్శకుడితో రామ్ చరణ్ చిత్రం?
వికారాబాద్ అడవుల్లో రామ్ చరణ్

రామ్ చరణ్ తో హరీష్ శంకర్?

మరోసారి జెంటిల్ మ్యాన్ అయిన చరణ్

డెబ్యూ డైరెక్టర్ తో రామ్ చరణ్?
కథానాయకుడిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ది 13 ఏళ్ళ నటనాప్రస్థానం. ఈ ప్రయాణంలో 12 చిత్రాలలో హీరోగా సందడి చేశాడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`.. తన 13వ సినిమా. ఆసక్తికరమైన ఏమిటంటే... తొలి చిత్రం `చిరుత` నుండి తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` వరకు అనుభవమున్న దర్శకులతోనే పనిచేశాడు చరణ్. అయితే.. `ఆర్ ఆర్ ఆర్` తరువాత పట్టాలెక్కనున్న తన 14వ చిత్రం మాత్రం ఒక డెబ్యూ డైరెక్టర్ తో చేయబోతున్నాడట మెగాపవర్ స్టార్.

`జెర్సీ` దర్శకుడితో రామ్ చరణ్ చిత్రం?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బడా మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా, ఏప్రిల్ లేదా మే నాటికి చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో.. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. `మళ్ళీ రావా`, `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చెర్రీ తదుపరి సినిమా ఉంటుందని తెలిసింది. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తారని ప్రచారం…
వికారాబాద్ అడవుల్లో రామ్ చరణ్
డైరెక్టర్ నంబర్ వన్ ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. వాస్తవ పాత్రలు, కల్పిత ఘట్టాలతో రూపొందుతున్న ఈ ఊహాజనిత చారిత్రక చిత్రంలో.. కొమరం భీమ్ గా యంగ్ టైగర్ యన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది.
చరణ్ నెక్స్ట్ ప్లాన్ - 'సరిలేరు నీకెవ్వరు' డైరెక్టర్ తోనా..?
ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇక చెప్పిన డేట్ కే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతున్నట్టు కూడా చెప్పా డు రామ్ చరణ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో.

రామ్ చరణ్ తో హరీష్ శంకర్?
' సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' (సాయి తేజ్), 'దువ్వాడ జగన్నాథమ్' (అల్లు అర్జున్), 'గద్దల కొండ గణేష్' (వరుణ్ తేజ్)... ఇలా వరుసగా మెగా కాంపౌండ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్... తన నెక్ట్స్ ప్రాజెక్టు ను కూడా అదే ఫ్యామిలీ హీరోతో చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మోహన్ లాల్ హిట్ సినిమా రైట్స్ సొంతం చేసుకున్న చెర్రీ..!
ఒక పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ లోకి కూడా అడుగుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా సైరా సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీగా ఈ సినిమాను చెర్రీ రూపొందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందరానుంది.

మరోసారి జెంటిల్ మ్యాన్ అయిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి జెంటిల్ మ్యాన్ అనిపించుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మెగా అభిమానులను నిరాశపరిచింది. దీంతో సినిమా ఫెయిల్యూర్ పై చరణ్ స్పందిస్తూ అభిమానులకు సారీ చెబుతూ ఓ లేఖ కూడా రాశారు. ఎంతో కష్టపడి సినిమా తీశామని.. కానీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ ఈ సినిమా కాలేకపోయింది. మాకు సపోర్ట్ గా నిలిచినందుకు థ్యాంక్స్... ముందు ముందు మంచి సినిమాలతో వస్తామని తెలిపారు. దీంతో చరణ్ పై ప్రశంసలు కురిపించారు అందరూ.