
ట్యాగ్ · 8 కథనాలు


విక్రమ్ లో ఆపాత్ర నేను చేయాల్సింది -లారెన్స్
లారెన్స్ చేసిన పనికి అల్లు అర్జున్ ఫిదా
అలా అయితేనే రజినీ సర్ కు సపోర్ట్ చేస్తా
స్టార్ హీరోలను మించి రాఘవ లారెన్స్ విరాళం..!

కష్టాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఉదారత చాటుకున్న రాఘవ లారెన్స్
ఒకప్పుడు **విక్రమార్కుడు' సినిమాలో రవితేజతో “రేయ్ సత్తి బాల్ ఇటు వచ్చిందా” అనే డైలాగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బాలనటుడు రవి రాథోడ్ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న విషయం తెలిసిందే. చిన్నతనంలోనే 25కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న రవి, కాలక్రమేణా అవకాశాలు తగ్గిపోవడంతో వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకుని మద్యానికి బానిసయ్యాడు.

విక్రమ్ లో ఆపాత్ర నేను చేయాల్సింది -లారెన్స్
గత ఏడాది విడుదలై కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది విక్రమ్.కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటించిన ఈసినిమా తెలుగులోకూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాలో హీరో పాత్రతో పాటు రోలెక్స్,సంతానం పాత్రలు బాగా హైలైట్ అయ్యాయి.సంతానం పాత్రలో నెగిటివ్ షేడ్ లో కనిపించాడు విజయ్ సేతుపతి.ముఖ్యంగా సినిమాలో విజయ్ సేతుపతి ఎంట్రీ సీన్ ఫిదా చేస్తుంది.అయితే ఈసంతానం పాత్రను ప్రముఖ కొరియోగ్రాఫర్,హీరో..రాఘవ లారెన్స్ చేయాల్సిందట.మొదట ఈఆఫర్ తనకే వచ్చిందని అయితే డేట్ ఇష్యూ తో సినిమా వదులుకోవాల్సి వచ్చిందని లారెన్స్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు.
లారెన్స్ చేసిన పనికి అల్లు అర్జున్ ఫిదా
సమాజ సేవ చేయడంలో ముందుంటాడు ప్రముఖ డ్యాన్సర్ ,హీరో,డైరెక్టర్ రాఘవ లారెన్స్.తన పేరుమీద ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందించడం,చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ లు చేయించడం వంటి కార్యకమాలు చేస్తుంటాడు.ఇక మరోసారి గొప్ప మనుసు చాటుకున్నాడు లారెన్స్. రెండు రోజుల క్రితం రుద్రన్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో 150 మంది పిల్లలను దత్తత తీసుకొని వాళ్లకు విద్య ను అందించనున్నానని లారెన్స్ అన్నాడు. అందుకు సంబందించిన ఫొటో ను ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీనికి ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రెస్పెక్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు. అలా లారెన్స్ చేసిన పనికి అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు.

రుద్రుడు మూవీ లో ఫ్యామిలీ, మాస్, యాక్షన్ అన్నీ ఉన్నాయి
డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్, సపోర్టింగ్ రోల్స్, హీరో ఇలా అని రకాలుగా తన సత్తాను చూపించాడు రాఘవ లారెన్స్. డ్యాన్స్ మాస్టర్ గా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. అంతేకాదు పలు సినిమాలకు దర్శకత్వంలో కూడా వహించాడు. ముఖ్యంగా హార్రర్ సినిమాలతో లారెన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కతిరేసన్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా వస్తున్న సినిమా రుద్రుడు. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను…
అలా అయితేనే రజినీ సర్ కు సపోర్ట్ చేస్తా
తన నిర్ణయాన్ని కన్సిడర్ చేస్తే కానీ రజినీకి సపోర్ట్ చేయను అంటున్నాడు రాఘవ లారెన్స్. ఇంతకీ లారెన్స్ నిర్ణయం ఏంటి అని అనుకుంటున్నారా..? త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నానని, తన గురువు రజినీకాంత్ పార్టీలో చేరుబోతున్నానని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే చేరడానికి లారెన్స్ ఒక షరతు కూడా పెడుతున్నాడు. అదేంటంటే..
'చంద్రముఖి 2' లీడ్ యాక్ట్రెస్ పై లారెన్స్ క్లారిటీ..!
పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ విషయాన్ని స్యయంగా దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ ఇటీవలే ప్రకటించాడు కూడా. ఇక అప్పటినుండి చంద్రముఖి 2 పై రూమర్లు వస్తూనే ఉన్నాయి.
స్టార్ హీరోలను మించి రాఘవ లారెన్స్ విరాళం..!
కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల వల్ల పేదలు కాస్త సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక వారికి సాయం చేయడం కోసం ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చారు. పేదలకు.. రోజూ కూలి పనులు చేసుకునే వారికి ఎవరికి తోచినంత వారు సాయం చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కొరియో గ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ కూడా విరాళం అందించారు. సినిమా రంగంలోనే కాదు ప్రజాసేవలో కూడా ఎప్పుడూ ముందే ఉంటాడు ఈయన. తన సంపాదనలో చాలా వరకు ఓ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అందులో వికలాంగులకు సహాయం చేస్తుంటాడు. కరోనా బాధితులకు తన వంతు సాయంగా 3 కోట్ల విరాళం అందించాడు లారెన్స్.
రజినీకాంత్ ని డైరెక్ట్ చేయనున్న రాఘవ లారెన్స్?
వరుస చిత్రాలతో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు మీదున్నారు. గత ఏడాది సంక్రాంతికి `పేట`తోనూ.. ఈ సంవత్సరం సంక్రాంతికి `దర్బార్`తోనూ పలకరించిన రజినీ.. ఈ దసరాకి `అణ్ణాత్త` (తెలుగు టైటిల్ నిర్ణయించాల్సి ఉంది)తో సందడి చేయనున్నారు. ఆపై తన మిత్రుడు, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తన 169వ సినిమా చేయనున్నారు.