అలా అయితేనే రజినీ సర్ కు సపోర్ట్ చేస్తా

Ace Choreographer Raghava Lawrence Wants To Support Rajinikanth With A Condition

తన నిర్ణయాన్ని కన్సిడర్ చేస్తే కానీ రజినీకి సపోర్ట్ చేయను అంటున్నాడు రాఘవ లారెన్స్. ఇంతకీ లారెన్స్ నిర్ణయం ఏంటి అని అనుకుంటున్నారా..? త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నానని, తన గురువు రజినీకాంత్ పార్టీలో చేరుబోతున్నానని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే చేరడానికి లారెన్స్ ఒక షరతు కూడా పెడుతున్నాడు. అదేంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పార్టీలో అనుభవం వున్న వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని, తను ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని గతంలో రజనీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే రజినీకాంత్ సీఎం అభ్యర్థి అయితేనే తాను పార్టీలో చేరతానని, వేరే వ్యక్తి అయితే అందుకు తాను అంగీకరించబోనని లారెన్స్ స్పష్టం చేశారు. రజినీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించాలని కోరుతూ లారెన్స్ ట్వీట్ చేశారు. మరి లారెన్స్ రిక్వెస్ట్‌పై రజినీ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

కాగా లారెన్స్-రజినీ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమా సీక్వెల్ ను చేస్తున్నారు వీరిద్దరూ.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eleven =