
ట్యాగ్ · 49 కథనాలు · పేజీ 3


#PSPK28 రూమర్స్ పై క్లారిటీ

లెక్చరర్ గా పవన్ కళ్యాణ్

ఖిలాడి డైరెక్టర్ తో పవన్.. క్లారిటీ ఇచ్చిన బండ్ల

రూమర్లకు చెక్.. పవన్ తోనే ఫిక్స్..!
ఏ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?
పవన్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి'

పవన్-హరీష్ సినిమా టైటిల్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా టైమ్ ఉన్నా ఈ గ్యాప్ లో పలు అప్ డేట్స్ మాత్రం ఇస్తూ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇప్పటికే పవర్ బర్త్ డే కు ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా.. ఈరోజు పవర్ ప్యాక్డ్ అనౌన్స్మెంట్ ఉందని చిత్రయూనిట్ నిన్న ప్రకటించింది. దీంతో అందరూ ఫస్ట్ లుక్ కు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఉంటుందేమో అని ఊహించారు.

"హరిహర వీరమల్లు" కెరీర్ కు పెద్ద బూస్ట్ - నిధి అగర్వాల్
“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపొందుతున్న "హరిహర వీరమల్లు" మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

#PSPK28 రూమర్స్ పై క్లారిటీ
స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే సాధారణంగా ఆసినిమాలపై పలు వార్తలు రావడం చూస్తూనే ఉంటాం. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇంకొక్క అడుగువేసి టైటిల్ ఇదై ఉండొచ్చు అని.. అలానే మేకర్స్ కు ఏ మాత్రం తగ్గకుండా మ్యాన్ మేడ్ పోస్టర్స్ ను తయారు చేస్తుంటారు. ఆశ్చర్యం ఏంటంటే అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈనేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించి కూడా పలు వార్తలు మొదలయ్యాయి. దీనితో మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

'హరిహర వీరమల్లు'.. బాలీవుడ్ తారలు జాయిన్ అయ్యేది అప్పుడే
పవన్ క్రిష్ కాంబినేషన్ లో హరి హర వీరమల్లు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా.ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను జరుపుకుంది. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో కాస్ట్యూమ్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ రావడం.. మరోవైపు పవన్ కు కూడా కరోనా రావడం వల్ల సినిమా షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ కు వచ్చిన తరువాత షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

లెక్చరర్ గా పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “, మలయాళ సూపర్ హిట్ "అయ్యప్పనుమ్ కోషియమ్ " మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన "గబ్బర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

ఖిలాడి డైరెక్టర్ తో పవన్.. క్లారిటీ ఇచ్చిన బండ్ల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత చాలా స్పీడు మీదున్నాడు. యంగ్ డైరెక్టర్స్ కు వరుస ఛాన్స్ లు ఇస్తున్నాడు ఇప్పటికే తను నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవ్వగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. ఇక వీటితో పాటు మరో రెండు సినిమాలు కూడా పవన్ పాకెట్ లో ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరోసినిమా లైన్ లో ఉన్నాయి.

రూమర్లకు చెక్.. పవన్ తోనే ఫిక్స్..!
2019లో విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత హరీష్ నుండి మరే సినిమా రాలేదు. అయితే పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ సంస్థ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈసినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా మరో టాపిక్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ఏ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?
సినిమా లవర్స్ మాత్రం ఆ ఏడాది పండగే పండగ. గ్యాప్ లేకుండా ప్రతివారం కనీసం ఓ నాలుగైదు సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అవి కూడా ఏదో చిన్నా చితకా సినిమాలు.. లైట్ తీసుకునే సినిమాలు కూడా లేవు. అన్నీ మంచి భారీ అంచనాలతో వస్తున్న సినిమాలే. కొన్ని సినిమాలు మాత్రం గత ఏదాది రిలీజ్ కాకుండా పెండింగ్ లో ఉన్నవి.. ఇంకొన్ని సినిమాలు ఆ ఏడాది రిలీజ్ కు సిద్దంగా ఉన్నవి.. వెరసి గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ కాగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అంతేకాదు పెద్ద సినిమాలు కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. చిరు 'ఆచార్య', పవన్ 'వకీల్ సాబ్', ప్రభాస్…
పవన్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి'
ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి' పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం వరకు దగ్గర దగ్గరగా వంద చిత్రాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. తన కళాదర్శకత్వ నైపుణ్యంతో ఎన్నో ప్రశంసలు, మరెన్నో విజయాలు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్నారు. గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక కొంత కాలం విరామం తరువాత ఆయన మళ్లీ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.