
ట్యాగ్ · 7 కథనాలు


కన్నప్పలో ప్రభాస్.. హింట్ ఇచ్చిన మంచు విష్ణు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రారంభం

టైగర్ నాగేశ్వరరావు కీలక షెడ్యూల్ కంప్లీట్

మంచు విష్ణు కన్నప్ప నుంచి తప్పుకున్న హీరోయిన్
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు సరసన 'ఆదిపురుష్' ఫేమ్ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ని కథానాయికగా ఎంపిక చేశారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. ఇంతలో ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగుచూసింది. అదేంటంటే.. ‘కన్నప్ప’ నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుంది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణునే తెలియజేశారు.

కన్నప్పలో ప్రభాస్.. హింట్ ఇచ్చిన మంచు విష్ణు
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ వెల్లడయింది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రారంభం
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కలల చిత్రం (డ్రీమ్ ప్రాజెక్ట్) ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. ఈరోజు శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు. 'అవా ఎంటర్టైన్మెంట్' మరియు '24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ' పతాకంపై విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు సరసన కథానాయికగా నటించనుంది. దివంగత సీనియర్ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన ఒకప్పటి సూపర్ హిట్ చిత్రం ఈ ‘భక్త కన్నప్ప’. అయితే…

టైగర్ నాగేశ్వరరావు కీలక షెడ్యూల్ కంప్లీట్
మాస్ మహారాజా రవితేజ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఒక్కటే మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. అందులో ధమాకా మూవీ రీసెంట్ గానే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ ను అందించింది. ఇక ప్రస్తుతం రవితేజ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. స్టూవర్ట్ పురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. మొదటిసారి రవితేజ విభిన్నమైన సినిమాతో వస్తుండటంతో ఈసినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి.

టైగర్ నాగేశ్వర రావు సెట్స్ లో రేణు దేశాయ్ బర్త్ డే వేడుకలు
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్, రేణు దేశాయ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

టైగర్ నాగేశ్వరరావు-ఇంట్రెస్టింగ్ గా ఇంటర్వెల్ ట్విస్ట్
మాస్ మహారాజా ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి ఇంకా రామారావు ఆన్ డ్యూటీ అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు సినిమాలు కూడా పెద్ద విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాాజాగా ఈసినిమా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందట. నాగేశ్వరరావు జీవితం ఎలా మలుపు తిరిగింది ?, అనే…

టైగర్ నాగేశ్వర రావు మూవీ లో రేణు దేశాయ్ లుక్ , వీడియో క్లిప్ రిలీజ్
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్ , రేణు దేశాయ్ , అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.