కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nivetha Thomas New Movie Details On Cards

ట్యాగ్ · 7 కథనాలు

Nivetha Thomas is back on Vakeel Saab Seets
సినిమా వార్తలు

'వకీల్ సాబ్' సెట్ లో నివేదా

మొత్తానికి సినీపరిశ్రమకు ఇప్పుడిప్పుడే కళ వస్తుంది. అందరూ షూటింగ్స్ ను మళ్ళీ మొదలుపెడుతున్నారు. ఇక థియేటర్స్ కూడా కొద్దిరోజుల్లో తెరుచుకోనున్న నేపథ్యంలో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే.. రీసెంట్ గానే వకీల్ సాబ్ చిత్ర యూనిట్ కూడా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా..ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలి, ఇతర నటీనటులు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేశా

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఒక ప్లేస్ ను సొంతం చేసుకోవడం కష్టం. ఒకసారి మంచి నటిగా పేరు వచ్చిన తర్వాత అవకాశాలు అవే వచ్చేస్తాయి. ఇక టాప్ పొజిషన్ కు చేరుకున్న తర్వాత స్టార్ హీరోలు సరసన నటించాలని అనుకుంటారు. ఇంకా దిగ్గజాలు క‌మ‌ల్, ర‌జినీతో క‌ల‌సి న‌టించ‌డం అంటే అంత కంటే అదృష్టం లేదు అని భావిస్తారు. కానీ అలాంటి అరుదైన అవ‌కాశాల‌ను అందుకున్న వారిలో యువ క‌థానాయిక నివేదా థామ‌స్ కు చాలా తొందరగానే వచ్చిందని చెప్పొచ్చు. ఐదేళ్ళ గ్యాప్ లో ఈ ఇద్ద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది నివేదా. యాదృచ్చికం ఏంటంటే రెండు సినిమాల్లోనూ కూతురిగా న‌టించే అవ‌కాశం ద‌క్క‌డం గ‌మ‌నార్హం.

TFN Adminవాట్సాప్
Actress Nivetha Thomas Shares A Dance Rehearsal Video Shot During V Movie Shooting On Social Media
షూటింగ్ అప్‌డేట్

'V' కోసం నివేద డ్యాన్స్ ప్రాక్టీస్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్ట్రెస్ లో నివేద థామస్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. ఎన్ని సినిమాలు చేశామన్నది.. ఎవరితో చేశామన్నది కాదు.. ఎలాంటి పాత్ర చేసాం.. ఆడియన్స్ కు ఎంత నచ్చింది అనేది చూసే హీరోయిన్స్ లో నివేద కూడా ఒకటి. అందుకే మొదటి నుండి అలాంటి పాత్రలే ఎన్నుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల విడుదలైన 'వి' సినిమాలో కూడా క్రైమ్ రైటర్ గా విభిన్నమైన పాత్రలో నటించి ఎప్పటిలాగే సూపర్ అనిపించుకుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు కు జోడీగా నటించగా.. వీరిద్దరి పెయిర్ కు మంచి మార్కులు పడ్డాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"V" మూవీ ప్రమోషన్స్ లో నివేద థామస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. అమిత్ త్రివేది సాంగ్స్ స్వరపరచగా థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చాలా విషయాల్లో నాని నాకు ఇన్స్పిరేషన్

వైవిధ్యమైన సినిమాల్లో... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేద థామస్. ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం నివేదా నటించిన 'వి' సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. నాని, సుధీర్ బాబు, ఆదితిరావు హైద‌రిల‌తో క‌లిసి నివేదా ఈ సినిమాలో నటించింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా నానితో తనకున్న అనుబంధం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రతి ఆర్టిస్ట్ కు ఆ కోరిక ఉంటుంది

కథల ఎంపికలో చాలా సెలెక్టివ్ గా వుంటూ.. విభిన్నమైన పాత్రల్లో నటించే నటులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వాళ్లల్లో నివేదా థామస్ కూడా ఒకటని చెప్పొచ్చు. మొదటి నుండి స్క్రిప్ట్స్ విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటుంది నివేదా. అందుకే తను నటించే సినిమాలు మాగ్జిమం సక్సెస్ ను సొంతం చేసుకుంటాయి. ఇక ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నివేదా థామస్‌ ఈ సినిమా గురించి పలు విషయాలు పంచుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నివేద థామస్ మనసులో మాట

"వెరుతే ఒరు భార్య " మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు బాలనటి గా పరిచయం అయిన నివేద థామస్ , ఆ మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ అవార్డ్ ను అందుకున్నారు . సక్సెస్ ఫుల్ "ప్రయాణం "మూవీ లో నటించిన నివేద "పోరాలి " మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. సూపర్ హిట్ "జెంటిల్ మన్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "నిన్నుకోరి", "జై లవకుశ ", "118 ", "బ్రోచేవారెవరురా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో నివేద ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్

షేర్