ట్యాగ్ · 8 కథనాలు
షూటింగ్ షెడ్యూల్ సేఫ్ గా పూర్తి

2020 సంవత్సరంలో నితిన్ త్రిబుల్ ట్రీట్
ఆసక్తికరమైన కథాంశంతో నితిన్, యేలేటి చిత్రం?
'మిస్ ఇండియా తెలంగాణ'తో నితిన్..?

మెట్రో లో హీరో నితిన్

మరో కొత్త సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్
"రంగ్ దే !" మూవీ అప్ డేట్
పలు బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్న ఇటలీ దేశంలో షూటింగ్స్ జరపడానికై పలు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ ఇటలీ లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సేఫ్టీ ప్రికాషన్స్ తో "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ సక్సెస్ ఫుల్ గా జరుగుతుంది. ఇప్పుడు మరో చిత్ర యూనిట్ ఇటలీ లో షూటింగ్ కై ప్లాన్ చేసింది.
షూటింగ్ షెడ్యూల్ సేఫ్ గా పూర్తి
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "రంగ్ దే !"మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. నరేష్ , బ్రహ్మాజీ , వినీత్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

2020 సంవత్సరంలో నితిన్ త్రిబుల్ ట్రీట్
యంగ్ హీరో నితిన్ 4 మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. 2020 సంవత్సరంలో నితిన్ హీరోగా నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. కొత్త సంవత్సరం కానుకగా తన అభిమానులకు హీరో నితిన్ త్రిబుల్ ట్రీట్ ఇస్తున్నారు. నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం 2018 సంవత్సరం ఆగస్ట్ లో రిలీజయింది. ఆ మూవీ తరువాత నితిన్ నటించిన ఏ మూవీ రిలీజ్ కాలేదు.
ఆసక్తికరమైన కథాంశంతో నితిన్, యేలేటి చిత్రం?
యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి `చదరంగం`, `ఏ 1` అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే... ఈ సినిమా స్టోరీలైన్‌పై ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది.
'మిస్ ఇండియా తెలంగాణ'తో నితిన్..?
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా భీష్మ సినిమా చేస్తున్న సంగతి తెలసిందే కదా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిస్టమస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. రష్మికా మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను... సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అంధాధున్’ రీమేక్‌లో నితిన్?
‘అంధాధున్’... గత ఏడాది హిందీనాట కాసుల వర్షం కురిపించిన బాలీవుడ్ మూవీ. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ... పలు ప్రాంతీయ పురస్కారాలతో పాటు తాజాగా మూడు జాతీయ అవార్డులను కూడా కైవసం చేసుకుంది. అలాంటి నేపథ్యం ఉన్న ఈ చిత్రాన్ని... తమిళంలో ప్రశాంత్ హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా... తెలుగులోనూ ఈ సినిమాని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. తాజా సమాచారం ప్రకారం... `అంధాధున్` తెలుగు రీమేక్ రైట్స్‌ను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఫ్యాన్సీ రేట్‌తో సొంతం…

మెట్రో లో హీరో నితిన్
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, బ్లాక్ బస్టర్ మూవీ ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ మూవీ రూపొందుతుంది. భీష్మ మూవీ రెండు రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే . ప్రస్తుతం భీష్మ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రుతుపవనాల రాకతో నిన్న తెలంగాణ రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసాయి. హైదరాబాద్ లో కురిసిన కుంభవృష్టి వర్షానికి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కువ శాతం ప్రజలు మెట్రో రైళ్ళను ఆశ్రయించారు.

మరో కొత్త సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా మళ్లీ ఫామ్ లోకి వస్తున్నాడు. ఏడాదికి ఒక సినిమాకే ఫిక్స్ అవ్వకుండా రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నితిన్ లిస్ట్ లో భీష్మ సినిమా ఉంది. వెంకీ కుడుముల డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి సైట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.