
ట్యాగ్ · 8 కథనాలు


2 దశాబ్దాల జర్నీ.. నితిన్ ఎమోషనల్ మెసేజ్..!

"మాచర్ల నియోజక వర్గం"భారీ షెడ్యూల్ కంప్లీట్

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నితిన్ "ఇష్క్"

"మాస్ట్రో " మూవీ అప్ డేట్

రాబిన్ హుడ్- నితిన్ బర్త్ డే కి స్పెషల్ అప్ డేట్
టాలీవుడ్ హీరో నితిన్ ఇటీవలే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈసినిమా సరైన విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 30వ తేదీన నితిన్ పుట్టినరోజు కావడంతో…

సినిమా రివ్యూలపై హీరో నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో 100 రోజులు ఆడుతుండేవి. కొన్ని సినిమాలు 200 రోజులు ఆడేవి. అలాగే ఇంకొన్ని చిత్రాలైతే ఏకంగా ఏడాది రన్ అవుతుండేవి. అయితే, ఇదంతా గతం, కాలం మారింది. నేటి ఫాస్ట్ యుగంలో ఎంత పెద్ద సినిమా అయినా 2 వారాలు థియేటర్లలో నడిచిందంటే సూపర్ హిట్ అయినట్లే. ఏదైనా సినిమా 20 రోజులు ఆడిందంటే బ్లాక్ బస్టర్ అన్నట్లు భావిస్తున్నారు. దీనికి కారణాలు అనేకం. ప్రేక్షకుల ఆలోచనా సరళి మారడం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బోలెడన్ని ఆప్షన్స్ ఉండటం, వివిధ భాషల సినిమాలను తెలుగులో అందించే ఓటీటీలు, దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్.. ఇలా ఎన్నో కారణాలు. ఇక వీటికి తోడు వెబ్ సైట్లలో రివ్యూలు. సినిమా…

2 దశాబ్దాల జర్నీ.. నితిన్ ఎమోషనల్ మెసేజ్..!
జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నితిన్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత దిల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఆ తరువాత సంబరం. శ్రీ ఆంజనేయం లాంటి సినిమాలు చేసి ఫ్లాప్స్ ను మూట గట్టుకున్నాడు.అలాంటి సమయంలోనే రాజమౌళి తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. సై సినిమాతో హిట్ కొట్టి మళ్లీ పుంజుకున్నాడు. అయితే అది కూడా ఎన్నో రోజులు నిలువలేదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు డజనుకు పైగా సినిమాలు నితిన్ కు పరాజయాన్ని అందించాయి. అయినా కూడా ఎలాంటి నిరాశ చెందకుండా ధైర్యంతో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చాడు.

కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'మాచర్ల నియోజకవర్గం'
ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈసినిమాతోనే రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలని ఇటలీ, ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్, టీజర్ వీడియోలో నితిన్ మునుపెన్నడూ లేని విధంగా డిఫరెంట్ యాక్షన్ లుక్ తో ఆకట్టుకున్నాడు.

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' నుండి రానున్న క్రేజీ అప్ డేట్
గత కొంతకాలంగా డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నితిన్. కమర్షియల్ చేస్తూనే వాటిలో కాస్త డిఫరెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక ఈనేపథ్యంలో నితిన్ తాజాగా చేస్తున్న సినిమా మాచర్ల నియోజక వర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. పొలిటికల్ ఎలిమెంట్స్ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రేపు అంటే మార్చి 24న ఉదయం 10…

"మాచర్ల నియోజక వర్గం"భారీ షెడ్యూల్ కంప్లీట్
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నితిన్ "ఇష్క్"
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో , నితిన్ ,నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన "ఇష్క్ " మూవీ 2012 సంవత్సరం ఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. పి సి శ్రీరామ్ ఫొటోగ్రఫీ , అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. నితిన్ , నిత్యామీనన్ ల పెర్ఫార్మెన్స్ , స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. అందమైన సినిమాటోగ్రఫీ, మంచి డైలాగ్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

"మాస్ట్రో " మూవీ అప్ డేట్
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.