
ట్యాగ్ · 8 కథనాలు


టక్ జగదీష్ రిలీజ్ ప్రొడ్యూసర్స్ కే వదిలేశా..!

థియేటర్స్ లోనే "టక్ జగదీష్ "రిలీజ్ -నిర్మాతలు

త్వరలో "టక్ జగదీష్ "రిలీజ్

రికార్డ్ క్రియేట్ చేస్తున్న "టక్ జగదీష్ "టీజర్
'టక్ జగదీష్' టీజర్ రిలీజ్

ఇకపై రీమేక్ లు చేయాలనుకోవడం లేదు...!
గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే కదా. మన సినిమాలను చాలా మంది రీమేక్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడు. ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఎన్నో రోజులుగా నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టక్ జగదీష్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. మొదట ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ చాలా రోజులు సస్పెన్స్ లో ఉంచి ఆ తరువాత ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈసినిమా డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా రేపు స్ట్రీమింగ్ కానుంది.

ఫైనల్లీ ఓటీటీలో 'టక్ జగదీష్'.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఇన్ని రోజుల సస్పెన్స్ తరువాత టక్ జగదీష్ రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. గత కొద్ది రోజులుగా ఈసినిమా రిలీజ్ విషయంలో పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడగా థియేటర్లు ఓపెన్ అయినా కూడా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని అన్నారు. దీంతో ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేక థియేటర్లలోనే రిలీజ్ అవుతుందా అన్న కన్ఫ్యాజన్ లో ఉన్నారు. అయితే మ్యాగ్జిమమ్ ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు.

టక్ జగదీష్ రిలీజ్ ప్రొడ్యూసర్స్ కే వదిలేశా..!
కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడిన సినిమాలన్నీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. అన్ని సినిమాలు తమ సినిమాల రిలీజ్ డేట్ లను వరుసగా ప్రకటించేస్తున్నాయి. నిన్నటి వరకూ లవ్ స్టోరీ రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండేది ఫైనల్లీ ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. కానీ నాని టక్ జగదీష్ సినిమా విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. థియేటర్లలో రిలీజ్ చేస్తారా లేక.. ఓటీటీలో రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

థియేటర్స్ లోనే "టక్ జగదీష్ "రిలీజ్ -నిర్మాతలు
నేచురుల్ స్టార్ నాని హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. జగపతి బాబు , నాజర్ , నరేష్ , రావు రమేష్ , దేవదర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. . రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్, పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ కు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే.

త్వరలో "టక్ జగదీష్ "రిలీజ్
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురుల్ స్టార్ నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. జగపతి బాబు , నాజర్ , నరేష్ , రావు రమేష్ , దేవదర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

'టక్ జగదీష్' ఓటీటీ లో కాదు థియేటర్లలోనే
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక దీంతో ఓటీటీల హడావుడి మళ్లీ మొదలైంది. మరోవైపు ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశంలో లేకపోడంతో విడుదల తేదిని ప్రకటించలేదు. ఈనేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని ఇటీవల వార్తలు చాలా వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. టక్ జగదీష్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయడం లేదని, రూమర్స్ నమ్మొద్దంటూ స్పష్టం చేశారు.

రికార్డ్ క్రియేట్ చేస్తున్న "టక్ జగదీష్ "టీజర్
హీరో నాని ప్రస్తుతం సూపర్ హిట్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి , బ్లాక్ బస్టర్ "ఉప్పెన "మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయికలు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా రూపొందనున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికి !” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
'టక్ జగదీష్' టీజర్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'టక్ జగదీష్'. 'నిన్ను కోరి' సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మొదలుపెట్టినప్పటినుండే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్.. మోషన్ పోస్టర్ ఆ అంచనాలను ఇంకా పెంచేసింది. మరోసారి నాని-శివ తమ మ్యాజిక్ ను క్రియేట్ చేసేలా ఉన్నారన్న అభిప్రాయం ఏర్పడింది. క్లాస్ లుక్ లో మాస్ యాంగిల్ నాని యాక్షన్ సినిమాకు పెద్ద హైలైట్ అవ్వబోతుందని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ అయ్యాయి కూడా.