ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2
మరో ప్రయోగాత్మక పాత్రలో బాలకృష్ణ?
సినీ కార్మికులకు బాలకృష్ణ సాయం
మల్టీ స్టారర్ మూవీ లో బాలకృష్ణ ?

బాబోయ్ మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో చేయను...!

`రామారావు`కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్?

నటసింహ బాలకృష్ణ ‘లెజెండ్’కు ఆరేళ్ళు

మలయాళ రీమేక్ లో బాలకృష్ణ?
బోయపాటి సినిమాలో బాలయ్య విలన్ కాదట...!
బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ కోసం ఎదురుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
మరో ప్రయోగాత్మక పాత్రలో బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్. 'సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా, లెజెండ్'... ఇలా పలు బ్లాక్ బస్టర్స్ లో బాలయ్య పలికిన సంభాషణలు ఆయా చిత్రాలకు ప్రధాన బలంగా నిలిచాయి. అలాంటి బాలయ్య... తొలిసారి డైలాగ్స్ లేని ఓ ప్రయోగాత్మక పాత్రలో నటించబోతున్నారని సమాచారం.
సినీ కార్మికులకు బాలకృష్ణ సాయం
సినీ కార్మికులకు సాయం చేయడానికి సినీ పరిశ్రమ నుండి ఒక్కొక్కరుగా ముందుకొచ్చి తమ వంతు సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి ఒక అడుగుముందుకేసి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కరోనా క్రైసిస్ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టారు. ఇప్పటికే ఎంతో మంది వారికి అండగా నిలిచి విరాళాలు అందించారు. ఇప్పుడు తాజాగా వారి జాబితాలో నందమూరి బాలకృష్ణ కూడా చేరిపోయాడు. కరోనాను అరికట్టడానికి గానూ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల…
మల్టీ స్టారర్ మూవీ లో బాలకృష్ణ ?
టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ల "F2", వేంకటేష్ , నాగచైతన్య "వెంకీ మామ" మల్టీస్టారర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. నాని, సుధీర్ బాబు నటించిన మల్టీ స్టారర్ మూవీ "V" విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ "రౌద్రం రణం రుధిరం " మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. యంగ్ హీరోలతోపాటు సీనియర్ హీరోలు కూడా మల్టీ స్టారర్ మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు.

బాబోయ్ మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో చేయను...!
మళ్లీ ఎన్టీఆర్ పాత్రను చేయనని నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. అసలు సంగతేంటంటే...ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్ కథానాయకుడు', ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో తన తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలకృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ.. సినిమా మాత్రం అనుకున్నంత విజయం దక్కించుకోలేకపోయింది అని చెప్పొచ్చు. దీనితో బాలకృష్ణ కాస్త నిరాశపడ్డారట. అందుకే మరోసారి ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి నో చెప్పారట.

`రామారావు`కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్?
`పటాస్` నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. కాగా, ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత అనిల్ చేయబోయే సినిమా ఏంటో ఇంకా క్లారిటీ రాలేదు. `ఎఫ్ 2` సీక్వెల్ చేయబోతున్నాడంటూ ఒకవైపు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ పక్కా అంటూ మరోవైపు కథనాలు వస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే... నటసింహ బాలకృష్ణతో అనిల్ నెక్స్ట్ వెంచర్ ఉంటుందని టాక్.

నటసింహ బాలకృష్ణ ‘లెజెండ్’కు ఆరేళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అలాంటి బాలయ్య, బోయపాటి కలయికలో ‘సింహా’(2010) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వచ్చిన రెండో చిత్రం ‘లెజెండ్’. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. జగపతిబాబు, సుమన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, అజయ్, బ్రహ్మాజీ, ‘ఆహుతి’ ప్రసాద్, సుజాతా కుమార్, కళ్యాణి, ఈశ్వరీ రావు, సితార తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సుహాసిని అతిథి పాత్రలో కనిపించగా... హంసా నందిని ఐటమ్ సాంగ్‌లో నర్తించింది.

మలయాళ రీమేక్ లో బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ పలు రీమేక్ చిత్రాల్లో నటించడమే కాకుండా... ఘనవిజయాలను సైతం అందుకున్నారు. తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలచిన `మంగమ్మ గారి మనవడు` రీమేక్ మూవీనే. అలాగే `ముద్దుల మావయ్య`, `లక్ష్మీ నరసింహ`... ఇలా పలు సక్సెస్ ఫుల్ రీమేక్స్ లోనూ నటించిన వైనం బాలయ్య సొంతం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం, ఆపై బి.గోపాల్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్న నటసింహ... త్వరలో ఓ రీమేక్ ఫిల్మ్ లో నటించే అవకాశముందట. అది కూడా.. ఓ మల్టీస్టారర్ సబ్జెక్ట్ కోసం.