
ట్యాగ్ · 7 కథనాలు

తెలంగాణ యువకుడి పాత్రలో నాగచైతన్య

#NC19 రేపు రాబోతున్న అప్ డేట్
నాగచైతన్యకి విలన్ గా అజయ్ భూపతి?

స్పెషల్ డేన రానున్న చైతు ప్రేమకథ?

నాగ్ డైరెక్టర్‌తో చైతూ చిత్రం?

14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో #NC 20 మూవీ
హీరో నాగచైతన్య , వెంకటేష్ తో కలసి నటించిన మల్టీ స్టారర్ మూవీ "వెంకీమామ " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగచైతన్య ప్రస్తుతం ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న #NC 19 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అందమైన ప్రేమకథ గా రూపొందుతున్న ఈ మూవీలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్నారు. నాగచైతన్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తెలంగాణ యువకుడి పాత్రలో నాగచైతన్య
శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా ఒక అందమైన ప్రేమకథ #NC 19 గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నాగచైతన్య, సాయి పల్లవి తెలంగాణ యువతీ యువకులు గా నటిస్తున్నారు. తమ కలలు నెరవేర్చుకొనడానికి చిన్న టౌన్స్ నుండి సిటీ కి వచ్చిన యువతీ యువకుల నేపథ్యంలో ఈ లవ్ స్టోరీ రూపొందుతుంది.

#NC19 రేపు రాబోతున్న అప్ డేట్
ఈ నెల 23న పుట్టినరోజు సందర్బంగా తన కొత్త సినిమాలకు సంబందించిన స్పెషల్ అప్డేట్స్ తో చైతు అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇప్పటికే వెంకీమామ సినిమా నుండి కెప్టెన్ కార్తీక్ వస్తున్నాడంటూ ప్రకటించారు. 'వెంకీమామ' నుండి తనకు సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు.
నాగచైతన్యకి విలన్ గా అజయ్ భూపతి?
గత ఏడాది సంచలనం `ఆర్ ఎక్స్ 100`తో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు అజయ్ భూపతి. మొదటి ప్రయత్నంలోనే నిర్దేశకుడిగా మన్ననలు పొందిన ఈ టాలెంటెడ్ టెక్నీషియన్... త్వరలో ప్రతినాయకుడి అవతారమెత్తుతున్నాడని టాక్.

స్పెషల్ డేన రానున్న చైతు ప్రేమకథ?
యువ సామ్రాట్ నాగ చైతన్య , సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ డ్యాన్స్ బేస్డ్ మ్యూజికల్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం... ప్రస్తుతం హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.

హిందీ సూపర్ హిట్ మూవీ రీమేక్ కు చైతు గ్రీన్ సిగ్నల్..?
మజిలీ సినిమాతో మంచి హిట్ కొట్టిన నాగచైతన్య ఇప్పుడు ప్రస్తుతం 'వెంకీమామ' షూటింగులో బిజీగా వున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే శేఖర్ కమ్ములతో మరో సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ హైద్రాబాద్ లో నిన్ననే ప్రారంభించింది. ఇక ఈ సినిమా తరువాత ఆయన అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.

నాగ్ డైరెక్టర్‌తో చైతూ చిత్రం?
`సంతోషం`... కింగ్ నాగార్జున కెరీర్‌లో మెమరబుల్ ఫిల్మ్. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాకుండా... పలు పురస్కారాలను అందుకుంది. అలాంటి... ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తోనే దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు దశరథ్. ఆ తరువాత దశరథ్ డైరెక్షన్‌లో వచ్చిన `సంబరం`, `శ్రీ`, `స్వాగతం` ఆశించిన విజయాలను సాధించకపోయినా... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో రూపొందించిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `మిస్టర్ పర్‌ఫెక్ట్`... దశరథ్‌ని మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకువచ్చింది. అలాగే... తన తొలి చిత్ర కథానాయకుడు నాగ్‌తో…