
ట్యాగ్ · 67 కథనాలు · పేజీ 4


సెన్సార్ పూర్తి చేసుకున్న 'కొండపొలం'

'కొండపొలం' ట్రైలర్ రిలీజ్

స్పెషల్ డే కు "హరి హర వీరమల్లు "టీజర్
సంగీత దర్శకుడు కీరవాణి రిటైర్ మెంట్ ?

హీరో అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు..!
మెగా కాంపౌండ్ నుండి హీరో వస్తున్నాడంటే ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయో అందరికీ తెలిసిందే. సినిమా హిట్ అయిందా ఓకే లేకపోతే ఏ రేంజ్ లో కామెంట్ చేస్తారో తెలియంది కాదు. అలా ఎన్నో అంచనాల మధ్య మెగా కాంపౌండ్ నుండి వచ్చి.. మొదటి సినిమాతోనే పలు రికార్డులు క్రియేట్ చేసి ఒకరకంగా చెప్పాలంటే మెగా యంగ్ హీరోలందరి రికార్డులను చెరిపేసి సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో వెష్ణవ్ తేజ్. ఇక ఫస్ట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్ కు ఆ తరువాత వరుస అవకాశాలు కూడా వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కూడావైష్ణవ్ తేజ్ కమర్షియల్ హంగులకు పోకుండా కథకు, పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి క్రిష్ సినిమాతో రాబోతున్నాడు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'కొండపొలం'
‘ఉప్పెన’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు తను నటిస్తున్న మరో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అడవి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

'కొండపొలం'.. శ్వాసలో లిరికల్ వీడియో రిలీజ్
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం కొండపొలం. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఇక రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం. మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ట్రైండ్ అవుతూ ఈ సినిమా ట్రైలర్ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

'కొండపొలం' ట్రైలర్ రిలీజ్
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా కొండపొలం. మొదటి సినిమాతోనే 2021లోనే మొట్టమొదటి భారీ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా విడుదలవుతున్న రెండో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు క్రిష్ డైరెక్షన్.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి మాములుగానే ఈసినిమాపై అంచనాలు ఉన్నాయి.. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

స్పెషల్ డే కు "హరి హర వీరమల్లు "టీజర్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ 2022 సంవత్సరం జనవరి లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మొఘల్ , కుతుబ్ షాహి కాలం నాటి చట్టాలను ఎదిరించే వీరుడిగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు .
బ్యాక్ టు వర్క్ మోడ్ - రెండు సినిమాలకు పని చేస్తున్నా
ఇటీవలే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కరోనా నుండి కోలుకున్న సంగతి తెలిసిందే. కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం కూడా చేశారు. ఇక అలా రికవర్ అయ్యారో లేదో అప్పుడే వర్క్ మోడ్ లోకి వెళ్లిపోయారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు పలు సినిమాలకు కూడా కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసినిమాల పనిలో ఉన్నట్టు చెపుబుతున్నాడు కీరవాణి. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తున్నారు.
సంగీత దర్శకుడు కీరవాణి రిటైర్ మెంట్ ?
"మనసు మమత"(1990) మూవీ తో టాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా పరిచయం అయిన కీరవాణి 3 దశాబ్దాలుగా తెలుగు, తమిళ , కన్నడ , మలయాళ, హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించారు. గాయకుడిగా పలు హిట్ సాంగ్స్ ఆలపించారు. బ్లాక్ బస్టర్ "అన్నమయ్య " మూవీ కి అద్భుతమైన సంగీతం అందించి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి నేషనల్ అవార్డ్ అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా 11 నంది, 8ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న కీరవాణి పలు ఇంటర్వూస్ లో త్వరలోనే రిటైర్ అవుతానని అభిమానులకు షాకిచ్చారు.