
ట్యాగ్ · 7 కథనాలు


భోళా శంకర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాచర్ల నియోజకవర్గం'

కళ్యాణ్ దేవ్ "కిన్నెరసాని"టీజర్ రిలీజ్

'ఇష్క్' ట్రైలర్ రిలీజ్

ఇష్క్ ట్రైలర్ రిలీజ్ - లవ్ అండ్ థ్రిల్లర్

పోల్ గేమ్ : టాలీవుడ్ హీరోల ఏ అప్ కమింగ్ మూవీ కి మీ ఓటు ?
భోళా శంకర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో భోళా శంకర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ వేదాళం తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. మురళీశర్మ, రావు రమేష్, రఘుబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

భోళా శంకర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి అప్పుడే బిజీ అయిపోయారు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. ఈసినిమా రిలీజ్ అయిన మూడురోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంతవరకూ వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉన్న చిరు ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను మొదలుపెట్టేశారు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ లు ఇష్టపడే వాళ్లకి, ఫ్యాన్స్ కు ఈసినిమా నచ్చుతుంది. మిగిలిన వాళ్లు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు..

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాచర్ల నియోజకవర్గం'
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. ఈసినిమాలో నితిన్ మొదటిసారి ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు అన్నీ కాస్త క్లాస్ పాత్రలే. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఫుల్ మాస్ రోల్ తో అలరించడానికి వస్తున్నాడు. ఇక ఈసినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక “రారా రెడ్డి” పాట అయితే మరో రేంజ్ లో దూసుకుపోతుంది. దీంతో సినిమా సినీ…

కళ్యాణ్ దేవ్ "కిన్నెరసాని"టీజర్ రిలీజ్
సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ , శుభమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై "అశ్వథ్థామ మూవీ ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ హీరోగా మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో, అతి సర్వత్ర వర్జయేత్ క్యాప్షన్ తో "కిన్నెరసాని" మూవీ తెరకెక్కుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లిమ్స్ , 'థీమ్ ఆఫ్ కిన్నెరసాని' సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'ఇష్క్' ట్రైలర్ రిలీజ్
జాంబిరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు తేజ సజ్జా. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా ఈ సినిమా వస్తుంది. ఈసినిమా అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈనెల 30న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ల ను, టీజర్ ను రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఇష్క్ ట్రైలర్ రిలీజ్ - లవ్ అండ్ థ్రిల్లర్
ఓ బేబి, జాంబిరెడ్డి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కుర్ర హీరో తేజ. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో వస్తున్నాడు. ఇష్క్.. 'నాట్ ఎ లవ్ స్టోరీ' అనేది ట్యాగ్ లైన్ ను బట్టి ఇది ప్రేమకథ కాదు అనేది తెలుస్తూనే ఉంది. మలయాళంలో విజయం సాధించిన 'ఇష్క్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.