
ట్యాగ్ · 7 కథనాలు


'హ్యాపీ బర్త్ డే' టీజర్ రిలీజ్

'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ ఫిక్స్..!

'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ పై అప్ డేట్..!

తమిళ మూవీ కి లావణ్య త్రిపాఠి గ్రీన్ సిగ్నల్
హాకీ ఛాంపియన్ పాత్రలో లావణ్య త్రిపాఠి

"అందాల రాక్షసి " లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 8వ తేదీ రిలీజ్ కానుంది. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే…

ఆది- లావణ్య త్రిపాఠి పులి మేక వెబ్ సిరీస్ ప్రారంభం..!
ఓటీటీల ప్రభావం ఈమధ్య కాలంలో ఎంత పెరిగిందో చూస్తూనే ఉన్నాం. కరోనా టైమ్ లో థియేటర్లు లేకపోవడంతో ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇక ఓటీటీలలో సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్ లకు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో చూసినా వెబ్ సిరీస్ లు హడావుడి కనిపిస్తుంది. ఇక వెబ్ సిరీస్ లలో నటించడానికి హీరో హీరోయిన్లు కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక ఈనేపథ్యంలోనే ఆది సాయి కుమార్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఆది ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

'హ్యాపీ బర్త్ డే' టీజర్ రిలీజ్
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా లావణ్యకు మాత్రం సరైన విజయాలు అందట్లేదు. అయినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. మత్తు వదలరా తో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు రితేష్ రానా ఈసినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా జులై 15న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటి నుండే బజ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది.

'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ ఫిక్స్..!
అందాల రాక్షసి`గా తెలుగు తెరకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో అందాల రాక్షసిగా ముద్ర వేసుకుంది. ఇక ఆ సినిమా తరువాత లావణ్య పలు సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఉంది. అయితే లావణ్యకు మాత్రం సక్సెస్ రేటు మాత్రం తక్కువే అని చెప్పొచ్చు. అయినా జయాపజయాలను పక్కనపెట్టి అవకాశాలు అందిపుచ్చుకుంటూ తనేంటో నిరూపించుకుంటుంది. ఈమధ్య కాలంలో వచ్చిన చావు కబురు చల్లగా అలానే ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలు కూడా సరైన విజయాన్ని అందిచలేకపోయాయి.

'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ పై అప్ డేట్..!
ప్రస్తుతం పెద్ద పెద్ద బ్యానర్స్ యంగ్ హీరోలతో, యంగ్ డైరెక్టర్స్ తో అలానే చిన్న సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్నసినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మైత్రీ మూవీ మేకర్స్ - క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ల నిర్మాణంలో ప్రస్తుతం రెండు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తుంది. రమేష్ కాదూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే ప్రారంభించారు.

తమిళ మూవీ కి లావణ్య త్రిపాఠి గ్రీన్ సిగ్నల్
సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి ., ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా రూపొందిన “దూసుకెళ్తా “మూవీ ఘనవిజయం సాధించింది. “బ్రమ్మన్ “మూవీ (2014) తో లావణ్య కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “మనం “, “భలే భలే మొగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు.
హాకీ ఛాంపియన్ పాత్రలో లావణ్య త్రిపాఠి
వెంకటాద్రి టాకీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వం లో హాకీ నేపథ్యం లో "A 1 ఎక్స్ ప్రెస్ " మూవీ రూపొందుతుంది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు, హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. హాకీ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న " A 1 ఎక్స్ ప్రెస్" మూవీ టాలీవుడ్ లో ఈ జానర్ లో మొదటి మూవీ. హీరో సందీప్ కిషన్ కూడా ఈ జానర్ లో ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు.