
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 160


లవ్ మీ 2 డేస్ కలెక్షన్స్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

రవితేజ 75కి హీరోయిన్ దొరికేసింది

మైత్రీ చేతికి క్రేజీ సినిమాల నైజాం హక్కులు

కన్నప్ప టీజర్ కు కేన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్

ఇండియన్ 2 సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మైత్రీ చేతికి మనమే నైజాం రైట్స్

ఓజీ.. టైటిల్ అర్ధం ఇదే - డైరెక్టర్ సుజీత్

కార్తీ 26 టైటిల్ రిలీజ్

ఆయ్ రంగనాయకి రిలీజ్

భజే వాయు వేగం ట్రైలర్ రిలీజ్

బచ్చలమల్లి ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్
అల్లరి నరేష్ ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఒకే జోనర్ కు పరిమితమవ్వకుండా పలు జోనర్లు ట్రై చేయడానిక చూస్తున్నాడు. ఈమధ్య నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్ల ప్రజానీకం అంటూ సీరియస్ పాత్రలు చేయగా సామిరంగ సినిమాలో మరోసారి గమ్యం సినిమాలోని తరహా పాత్రను చేశాడు. రీసెంట్ గా మళ్లీ తన కామెడీ యాంగిల్ ను బయటకు తీస్తూ ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో వచ్చాడు.

గోట్ కోసం విజయ్ మరోసారి
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ యాక్టింగ్ తోపాటు సింగింగ్ లోకూడా ఇరగదీస్తాడని తెలిసిందే. విజయ్ తో తన సినిమాల్లో ఒక్క సాంగ్ అయినా పాడిస్తుంటారు సంగీత దర్శకులు.అవన్నీ చార్ట్ బాస్టర్ అయ్యాయి.అయితే ఈసారి ఒక్క సాంగ్ తో ఆపలేదు విజయ్. ఏకంగా రెండు పాటలు పాడాడు.విజయ్ ప్రస్తుతం ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) అనే సినిమా చేస్తున్నాడు.నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.జూన్ లోపు కంప్లీట్ కానుంది.

లవ్ మీ 2 డేస్ కలెక్షన్స్
సమ్మర్ లో బాక్సాఫీస్ కాస్త వెలవెలబోయింది అని చెప్పొచ్చు. ఎప్పుడూ సమ్మర్ కు పలు సినిమాలు రిలీజ్ అయి సందడి చేస్తాయి. కానీ ఈ ఏడాది మాత్రం పెద్దగా సినిమాలు ఏం రిలీజ్ కాలేదు. ఈనేపథ్యంలో తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా లవ్ మీ. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన సినిమా లవ్ మీ.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
యంగ్ హీరో విశ్వక్ సేన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సాంగ్స్ చార్ట్ బాస్టర్ కావడం అలాగే టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ట్రైలర్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమా ట్రైలర్ ను కూడా విడుదలచేశారు.ఈ ట్రైలర్ ను ఊర మాస్ గా కట్ చేసి అంచనాలను పెంచడం లో టీం సక్సెస్ అయ్యింది.ఇందులో విశ్వక్ డైలాగ్స్, ఆటిట్యూడ్ హైలైట్ అయ్యాయి.ఇప్పటివరకు యూట్యూబ్ లో ట్రైలర్ వ్యూస్ 2 మిలియన్లు దాటింది.

రవితేజ 75కి హీరోయిన్ దొరికేసింది
రవితేజ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే 75వ సినిమాకు హీరోయిన్ దొరికేసింది.సామజవరగమన రైటర్ భాను బోగవరపు ఈసినిమా ను తెరకెక్కించనున్నాడని తెలిసిందే.ఈసినిమా కోసం హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశారు.యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించనుంది.త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించనున్నారు.ఇక శ్రీలీల,రవితేజ తో జత కొట్టడం ఇది రెండో సారి.

సీక్వెల్‌కి ముందు రీ-రిలీజ్‌కి సిద్దమైన భారతీయుడు
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఇండియన్ 2'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా వీరి కాంబినేషన్ లో 1996లో వచ్చిన 'భారతీయుడు' (ఇండియన్)కి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతుండటం విశేషం. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. బ్రహ్మానందం, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ చేతికి క్రేజీ సినిమాల నైజాం హక్కులు
ఈమధ్య నిర్మాణ సంస్థలు కూడా డిస్ట్రిబ్యూషన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. సినిమాను తాము నిర్మించకపోయినా రిలీజ్ చేయడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఈ పంథాలోకి వచ్చాయి. అందులో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకటి. ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా తన సత్తా చాటుతుంది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

కన్నప్ప టీజర్ కు కేన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్
బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా కన్నప్ప. మంచు విష్ణు కేరీర్ లోనే వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. శివుని భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈసినిమా వస్తుండటం.. దానికి తోడు ప్రభాస్ తో పాటు ఈసినిమాలో భారీ కాస్టింగ్ కూడా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్
టాలీవుడ్ దమ్ కా దాస్ విశ్వక్ సేన్ తిరుమలను సందర్శించారు. ఆయన హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు ఆయన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ టీమ్‌తో కలిసి తిరుమలకు విచ్చేసారు. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న విశ్వక్ సేన్, యూనిట్ సభ్యులకు ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

గౌతమ్ కాన్వకేషన్.. తండ్రిగా గర్విస్తున్నా - మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పుత్రోత్సాహంలో ఉన్నారు. ఆయన తనయుడు గౌతమ్ ఘట్టమనేని తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన కాన్వకేషన్‌లో గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు సతీమణి నమ్రత, కూతురు సితారలతో కలిసి హాజరయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేశ్, నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మహేష్ బాబు, నమ్రత చేసిన పోస్ట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ 2 సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. జూన్ 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మైత్రీ చేతికి మనమే నైజాం రైట్స్
హీరో శర్వానంద్ కు సాలిడ్ హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. ఆ మధ్య వచ్చిన ఒకే ఒక జీవితం ఒక మోస్తరు విజయాన్ని అందించినా మంచి కమ్ బ్యాక్ ను అయితే ఇవ్వలేకపోయింది. కమర్షియల్ గా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇక ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఓజీ.. టైటిల్ అర్ధం ఇదే - డైరెక్టర్ సుజీత్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన కొంతకాలం సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇవన్నీ భారీ అంచనాలున్న మూవీస్ కావడం గమనార్హం. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కార్తీ 26 టైటిల్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. పొన్నియిన్ సెల్వన్, సర్దార్, సినిమాలతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న కార్తీకి జపాన్ తో బ్రేక్ పడింది. డిఫరెంట్ మేకోవర్ తో వచ్చినా జపాన్ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు కార్తీ.

మనమే- మెలోడియస్ ఓ మనమే ఫుల్ సాంగ్ రిలీజ్
కొంచం గ్యాప్ తరువాత ప్రామిసింగ్ హీరో శర్వానంద్ నుండి వస్తున్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. కొంత కాలంగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలతో అలరిస్తున్న శర్వా ఈసినిమాలో ప్లే బాయ్ తరహా ఎనర్జిటిక్ రోల్ లో కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఆయ్ రంగనాయకి రిలీజ్
మ్యాడ్ తరువాత ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నుండి వస్తున్న సినిమా ఆయ్. గోదావారి బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ ఫ్రెండిష్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ఈ మేలోనే విడుదలకావాల్సి ఉండగా వాయిదా వేశారు.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా మొదటి పాట సుఫియానా రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

బుజ్జిపై నాగచైతన్య రైడింగ్.. కల్కి టీమ్‌కి హ్యాట్సాఫ్
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'బుజ్జి' గురించే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ బుజ్జి ఎవరంటే..? పాన్ ఇండియా స్టార్ పభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898 AD’ చిత్రంలో కనిపించనున్న కారు. అయితే ఈ కారు సినిమాలో చాలా కీలక పాత్ర పోషించనుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే తెలియజేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆ కారును డిజైన్ చేయించడం విశేషం. ఎఫ్ 1 రేసింగ్‌లో పాల్గొనే కార్ల వంటి మోడల్లో ఉన్న బుజ్జిని చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. 'బుజ్జి’ని ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ఇటీవలే మేకర్స్ స్పెషల్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.

భజే వాయు వేగం ట్రైలర్ రిలీజ్
బెదురులంక తరువాత యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం.ఈసినిమా ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది.స్నేహం,క్రికెట్,డబ్బు చుట్టూ తిరిగే కథ తో వస్తుంది ఈసినిమా.ట్రైలర్ చూస్తే సినిమాలో యాక్షన్ బాగానే ఉన్నట్లు వుంది.ఎమోషనల్ సీన్ తో ట్రైలర్ ను ఎండ్ చేశారు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఆకట్టుకుంది.

పుష్ప 2 నుండి రావు రమేష్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు బన్నీ. మరోవైపు ఈసినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా పస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాయో చూాశాం. రీసెంట్ గా రిలీజ్ చేసిన పుష్ప పుష్ప సాంగ్ కూడా ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకున్నాయే తెలిసిందే.

రేపు ఓటీటీలోకి ఆడు జీవితం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'సలార్' ఫేమ్, మాలీవుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆడు జీవితం'. ఈ సినిమా ఇంగ్లీష్‌లో 'గోట్ లైఫ్' అనే పేరుతో విడుదలయింది. ఈ సినిమాలో అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించగా.. అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా.. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 'ఆడు జీవితం' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది. థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం, మూవీ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది.