ట్యాగ్ · 49 కథనాలు · పేజీ 3
'KGF2' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!
KGF చాప్టర్ 2 మూవీ రిలీజ్ వాయిదా ?
పోరాట ఘట్టాలు మినహా 'కేజీఎఫ్: చాప్టర్ 2' పూర్తి
టీజర్ కోసం కష్టపడుతున్న కె.జి.ఎఫ్ 2 టీమ్..!
హైదరాబాద్ లో "కె.జి.ఎఫ్ చాప్టర్ 2" ఆఖరి షెడ్యూల్
కె.జి.ఎఫ్2 టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
యష్ బర్త్ డే కి కె.జి.యఫ్ 2 టీజర్..?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 పై ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వచ్చి వారి ఎదురుచూపులకు బ్రేక్ వేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల ఇంకా వెనక్కి వెళ్ళింది. ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ షూటింగ్ లో యష్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ ఫైనల్ షెడ్యూల్ లోనే సంజయ్ దత్ కూడా పాల్గొనబోతున్నారు. త్వరలోనే సినిమా…
'KGF2' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!
లాక్ డౌన్ వల్ల చాలా సినిమాల రిలీజ్ విషయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇక చిన్న సినిమాల సంగతేమో కానీ.. పెద్ద సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం రోజుకో వార్త వస్తూనే వుంది. ఇక 'కె.జి.ఎఫ్2' సినిమా రిలీజ్ విషయంలో కూడా గత కొద్ది రోజులుగా ఈ కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక ఈ విషయంపై ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా... ఏదో ఒక రూమర్ అయితే వస్తూనే ఉంది. ఇక తాజాగా వచ్చిన రూమర్స్ పై 'కె.జి.ఎఫ్2' నిర్మాత కార్తీక్ గౌడ స్పందించి..30 రోజుల షూటింగ్ మిగిలి ఉందని, రెండు ఫైట్స్ మినహా షూటింగ్ పూర్తయ్యిందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, జూలైలో ప్రభుత్వం షూటింగ్‌కి అనుమతిచ్చినా అక్టోబర్ 23నే సినిమాను…
KGF చాప్టర్ 2 మూవీ రిలీజ్ వాయిదా ?
దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ " KGF చాప్టర్1" కన్నడభాషలో ఘనవిజయం సాధించి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.
పోరాట ఘట్టాలు మినహా 'కేజీఎఫ్: చాప్టర్ 2' పూర్తి
పాన్ ఇండియా మూవీగా రిలీజైన కన్నడ చిత్రం 'కేజీఎఫ్: చాప్టర్ 1'.. నేషనల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాకి సంబంధించిన సెకండ్ పార్ట్ 'కేజీఎఫ్: చాప్టర్ 2'.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
టీజర్ కోసం కష్టపడుతున్న కె.జి.ఎఫ్ 2 టీమ్..!
ఒక్కసారి ఒక సినిమాపై అంచనాలు పెంచేసిన తర్వాత దానిని తప్పించడం అంత ఈజీ కాదు. దాని తర్వాత వచ్చే సీక్వెల్ పై ఆ ప్రెషర్ మాములుగా ఉండదు. అసలు మించి సీక్వెల్ అదిరిపోవాలంటే...అంతకుమించి అన్నట్టు ఉండాలి సీక్వెల్. మరి దాని కోసం దర్శకనిర్మాతల దగ్గరనుండి హీరో వరకూ ఎంత కష్టపడతారో.. ఎంత టెన్షన్ ఉంటుందో చెప్పడం కష్టం.. ఆ ప్లేస్ లో ఉంటే కానీ మనకు అర్ధమవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు కె.జి.ఎఫ్2 టీమ్.
హైదరాబాద్ లో "కె.జి.ఎఫ్ చాప్టర్ 2" ఆఖరి షెడ్యూల్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ కన్నడ మూవీ "కె.జి.ఎఫ్ చాప్టర్ 1" ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ నెలకొల్పిన విషయం తెలిసిందే. శాండల్ వుడ్ చరిత్రలో 200కోట్లకు పైగా వసూళ్ళు సాధించి, హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ రూపొందుతుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు.
కె.జి.ఎఫ్2 టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించగా, కన్నడలో 100 కోట్లు వసూలు చేసింది. నిజానికి కన్నడం 100కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రేర్ ఫీట్ ను దాటి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.
కె.జి.యఫ్ చాప్టర్2 ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో యష్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ప్యాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. వంద కోట్ల కలెక్షన్లను చూడని కన్నడ ఇండస్ట్రీలో ఏకంగా 250 కోట్ల కనక వర్షాన్ని కురిపించాడు రాకీ భాయ్. దీనితో చాప్టర్ 2ను కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా... ఈ రోజు ఏ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.

" కె .జి.ఎఫ్ 2" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్
HOMBALE ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన " కె .జి.ఎఫ్ చాఫ్టర్ 1" కన్నడ మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శాండల్ వుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి