ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో యష్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ప్యాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. వంద కోట్ల కలెక్షన్లను చూడని కన్నడ ఇండస్ట్రీలో ఏకంగా 250 కోట్ల కనక వర్షాన్ని కురిపించాడు రాకీ భాయ్. దీనితో చాప్టర్ 2ను కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా… ఈ రోజు ఏ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Rebuilding An Empire!!!
Here We Go #KGFChapter2FirstLook 💥@hombalefilms @TheNameIsYash @prashanth_neel @duttsanjay @VKiragandur @SrinidhiShetty7 @bhuvangowda84 @BasrurRavi @Karthik1423 @AAFilmsIndia @excelmovies @FarOutAkhtar @ritesh_sid @VaaraahiCC pic.twitter.com/DIemJHf7l0— Hombale Films (@hombalefilms) December 21, 2019
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరుగందూర్ భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తుంది. రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 2020లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























