
ట్యాగ్ · 10 కథనాలు


కె.జి.యఫ్2 పై కాంతార కిషోర్ షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరో యష్ న్యూ లుక్
ఫైనల్లీ 'కె.జి.ఎఫ్2' రిలీజ్ డేట్ ఖరారు

ఫైనల్లీ కె.జి.ఎఫ్ 2 వర్క్ స్టార్ట్..!

'RRR' రిలీజ్ డేట్ ను తీసుకున్న KGF2..!

ఫ్యాన్స్ కు కె.జి.యఫ్ స్టార్ రిక్వెస్ట్
తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు వారి సినిమాల నుండి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక హీరోలు కూడా అభిమానులను నిరాశ పరచకుండా ఉండటానికే ట్రై చేస్తుంటారు. ఏదో ఒక సర్ ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈసారి కన్నడ స్టార్ హీరో యష్ అభిమానులకు కాస్త నిరాశ తప్పదు. జనవరి 8వ తేదీన యష్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా యష్ కొత్త సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని చూస్తున్నారు. ఈనేపథ్యంలో తన పుట్టినరోజుకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేనని…

కె.జి.యఫ్2 పై కాంతార కిషోర్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం కన్నడ పరిశ్రమ మంచి బూమ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎంత మంచి సినిమా వచ్చినా కన్నడ ప్రేక్షకులకు తప్పా పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. అయితే కె.జి.యఫ్ తరువాత కన్నడ పరిశ్రమ రేంజ్ మారిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇక పార్ట్ 1 విజయంతో దానికి సీక్వెలన్ కూడా తీసి గతఏడాది రిలీజ్ చేశారు అది కూడా ఘన విజయం సాధించింది. ఒకరకంగా చెప్పాలంటే కె.జి.యఫ్ తరువాత కన్నడ సినిమాలకు మంచి డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అలాంటి సినిమాపై అదే పరిశ్రమకు చెందిన నటుడు షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ నటుడు ఎవరో కాదు కాంతార సినిమాలో…

స్టార్ హీరో యష్ న్యూ లుక్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది, పాన్ ఇండియా స్టార్ గా మారారు. కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఒరిజినల్ రిలీజ్ డేట్ కే ఫిక్స్ అవుతున్న 'కె.జి.యఫ్ 2'..?
కె.జి.యఫ్ 2.. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ చేయలేకపోయారు. గత ఏడాది సమ్మర్ లో కావాల్సింది. ఇప్పటివరకూ పెండింగ్ లో పడిపోయింది. మరోవైపు ఈ సినిమా డైరెక్టర్ వేరే సినిమాతో బిజీ అయిపోవడంతో సినిమా ప్రమోషన్స్ కూడా దాదాపు ఆపేశారు. ఈ సినిమా నుండి సాలిడ్ అప్ డేట్ వచ్చి కూడా చాలా కాలం అయింది. గత ఏడాది టీజర్ రిలీజ్ చేశారు.. ఆ తరువాత సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీ నటుల పోస్టర్లు రిలీజ్ చేశారు తప్పా మరే అప్ డేట్ లేదు.

నెక్స్ట్ ప్రభాసా? ఎన్టీఆరా?.. ప్రశాంత్ నీల్ క్లారిటీ
జూనియర్ ఎన్టీఆర్ 'కేజీఎఫ్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ రోజుకో వార్త మాత్రం వస్తూనే ఉంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పెద్ద ఎత్తున డేట్స్ కూడా ఇచ్చినట్టుకూడా వార్తలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా పై ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ తో కూడా సినిమా చేస్తున్నట్టు ఆ మధ్య వార్తలు జోరుగా వినిపించాయి. కానీ ఆ విషయంలో కూడా క్లారిటీ రాలేదు.
'సంజయ్ దత్' బర్త్ డే కి 'కె.జి.యఫ్2' టీమ్ సర్ప్రైజ్..?
కె.జి.యఫ్ హిట్ సంచలన విజయం దక్కించుకోవడంతో దాని సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎంత ఎదురు చూస్తున్నారో అంత వెనక్కి వెళ్తుంది. మరోపక్క దర్శక నిర్మాతలు మాత్రం తొందరలోనే సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ అధీర పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 29 న సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో ఆరోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి టీజర్ ఆ లేకపోతే సంజయ్ దత్ కు సంబంధించిన అప్ డేటే ఏదైనా ఇస్తారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

KGF2 రిలీజ్ పై క్లారిటీ - ఆడియన్స్ కు ఏం కావాలో తెలుసు..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా వచ్చిన `కె.జి.ఎఫ్- చాప్టర్ 1` సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రఖ్యాత హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించగా, కన్నడలో 100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం హిందీలో సుమారు 50 కోట్లు వసూలు చేసింది. ఇక అదే జోష్ తో `కె.జి.ఎఫ్- చాప్టర్ 2' కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
ఫైనల్లీ 'కె.జి.ఎఫ్2' రిలీజ్ డేట్ ఖరారు
మొత్తానికి కె.జి.ఎఫ్2 రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు చిత్రయూనిట్. మొన్నటి వరకూ పలు డేట్ లు తెరపైకి వచ్చాయి. మొదట ఈ సమ్మర్ లో రిలీజ్ అనుకున్నారు.. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్' సినిమా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవ్వడంతో ముందుగా ఆర్ఆర్ఆర్ అనుకున్న డేట్ జులై 30 న తమ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక గత కొద్దిరోజులుగా ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు పోటీగా అదే రోజు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు రాగా దానిపై యష్ స్పందించి అది ఎప్పటికీ జరగదని చెప్పాడు. ఇక ఇవన్నీ ఎందుకులే అనుకున్నారేమో కానీ తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. అక్టోబరు 23న రిలీజవుతుందని సోషల్…

ఫైనల్లీ కె.జి.ఎఫ్ 2 వర్క్ స్టార్ట్..!
ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించగా, కన్నడలో 100 కోట్లు వసూలు చేసింది. నిజానికి కన్నడం 100కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు.

'RRR' రిలీజ్ డేట్ ను తీసుకున్న KGF2..!
'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ డేట్ మారిన సంగతి తెలిసిందే. కాస్త ఎక్కువ టైమ్ పడుతుండటంతో అనుకున్న ముందుగా చెప్పిన డేట్ ను మర్చి వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ ను మార్చారు. ఈ ఏడాది 2020 జులై 30 న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి మార్చారు. ఇక 'ఆర్ఆర్ఆర్' టీమ్ అలా డేట్ మార్చిందో లేదో అప్పుడే మరో సినిమా ఆ రిలీజ్ డేట్ ను బుక్ చేసుకుంది. ఆ సినిమా ఏదో కాదు. ప్రశాంత్ నీల్ దర్శత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.ఎఫ్2 సినిమా.