ఫ్యాన్స్ కు కె.జి.యఫ్ స్టార్ రిక్వెస్ట్

KGF Star Yash Important Message To Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,KGF 2,KGF 2 Movie,KGF 2 Telugu Movie,KGF 2 Update,KGF 2 Updates,KGF 2 Movie Updates,KGF 2 Movie Update,KGF 2 Movie Latest Updates,KGF 2 Movie Latest Update,KGF 2 Latest Update,KGF 2 Latest Updates,KGF 2 Telugu Movie Latest Updates,KGF 2 Movie News,KGF 2 Telugu Movie Latest News,KGF 2 Movie Latest News,Yash KGF 2,Yash KGF 2 Movie,Yash,Yash Movies,Yash New Movie,Yash Latest Movie,Yash Upcoming Movie,Yash New Movie Update,Yash Latest Movie Update,KGF Star Yash Message To Fans,Yash Message To Fans,Yash Birthday,Yash Birthday Celebrations,KGF Star Yash's Message To Fans Ahead Of His Birthday

తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు వారి సినిమాల నుండి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక హీరోలు కూడా అభిమానులను నిరాశ పరచకుండా ఉండటానికే ట్రై చేస్తుంటారు. ఏదో ఒక సర్ ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈసారి కన్నడ స్టార్ హీరో యష్ అభిమానులకు కాస్త నిరాశ తప్పదు. జనవరి 8వ తేదీన యష్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా యష్ కొత్త సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని చూస్తున్నారు. ఈనేపథ్యంలో తన పుట్టినరోజుకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేనని రిక్వెస్ట్ చేస్తున్నాడు యష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు. ఆపోస్ట్ లో తనపై ప్రేక్షకాభిమానులు అందరూ చూపిస్తున్న ప్రేమకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు ముఖ్యంగా తన ఫ్యాన్స్ ప్రేమ నిజంగా వెలకట్టలేదని తెలిపారు. ప్రతి ఏడాది తనకు పుట్టినరోజు జరుపుకోవడం పెద్దగా ఆసక్తి ఉండదని, అయితే ఫ్యాన్స్ కోసం ఇష్టంగా జరుపుకుంటానని తెలిపారు. ఇక ఈ ఏడాది పుట్టినరోజుకి తాను తన ఊరిలో ఉండడం లేదని, అలానే తన నుండి వస్తుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్న అప్ డేట్ అతి త్వరలోనే వస్తుందని, అందుకే మరికొన్నాళ్లపాటు అభిమానులు వెయిట్ చేయాలని రిక్వెస్ట్ చేశారు.

కాగా కె.జి.యఫ్ సినిమాతో కన్నడ రాక్ స్టార్ యష్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడో తెలిసిందే కదా. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక దీని సీక్వెల్ గా వచ్చిన కె.జి.యఫ్ 2 కూడా రీసెంట్ గానే రిలీజ్ అయి మరో సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉండగా.. ఆ అంచనాలను ఎక్కడా తగ్గించకుండా రాఖీభాయ్ తన సత్తా చూపించాడు. ఇక ఇప్పుడు యష్ నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి అది తెలియాలంటే యష్ చెప్పినట్టు మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 5 =