
ట్యాగ్ · 12 కథనాలు


సోషల్ మీడియా లో కీర్తి సురేష్ హవా
టైటిల్ మారిన కీర్తి సురేష్ మూవీ

వరుస సినిమాలతో బిజీ అవుతున్న 'మహానటి'

కీర్తి సురేష్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్

కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ ప్రారంభం

తెలుగు సినిమా జాతీయ ఉత్తమ నటీమణుల చరిత్ర
'మిస్ ఇండియా'గా కీర్తి సురేష్?

ఎగ్జైటింగ్ అప్ డేట్ త్వరలో

హీరో నాని కి కీర్తి సురేష్ స్వీట్ బర్త్ డే విషెస్
హీరో నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వారిద్దరూ జంటగా దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సోషల్ మీడియా లో కీర్తి సురేష్ హవా
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.
టైటిల్ మారిన కీర్తి సురేష్ మూవీ
తెలుగు , తమిళ , మలయాళ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి ప్రధాన పాత్రలో నటించిన "మిస్ ఇండియా ", "గుడ్ లక్ సఖి " మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్నాయి. "రంగ్ దే "(తెలుగు ), "అన్నాత్తే "(తమిళ) మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. "మరక్కార్ "(మలయాళ ) మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.
'శ్రీదేవి' సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో 'కీర్తి సురేష్'..?
సూపర్ హిట్ అయిన సినిమాలను ఈ మధ్య సీక్వెల్స్ చేయడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వచ్చే హిట్ సినిమాలకు సీక్వెల్స్ అంటే ఓకే కానీ ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ అంటే ఇప్పుడు కష్టమే. ఇప్పుడు అలాంటి ఒక సినిమానే సీక్వెల్ తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒకటి కాదు రెండు కాదు 42 ఏళ్ళ తర్వాత.

వరుస సినిమాలతో బిజీ అవుతున్న 'మహానటి'
మొత్తానికి 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాతో ఒక్కదారిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నది. అంతే ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. ఈ సక్సెస్ ఫామ్‌లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ మరింత బిజీ అవుతుంది కీర్తి సురేష్.

కీర్తి సురేష్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్
తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. గతంలో ఈ సినిమా టైటిల్ మిస్ ఇండియా అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అనుకున్నట్టే మిస్ ఇండియా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ప్రతీ భారతీయుడు గర్వపడే మూవీ "మైదాన్ " - కీర్తి సురేష్
లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో సావిత్రి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకొన్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే బాలీవుడ్ మూవీ మైదాన్ 19 వ తేదీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ బదాయి హో దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్, కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా మైదాన్ మూవీ ప్రముఖ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.

కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ ప్రారంభం
తమిళ, తెలుగు మూవీస్ తో బిజీగా ఉన్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ ఈరోజు ప్రారంభమయింది. బోనీకపూర్ నిర్మాతగా, బ్లాక్ బస్టర్ మూవీ బదాయి హో దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్, కీర్తి సురేష్ జంటగా రూపొందనున్న మైదాన్ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫుట్ బాల్ కోచ్ , మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా మైదాన్ మూవీ రూపొందుతుంది.
కీర్తి సురేష్ మరో థ్రిల్లర్ - ఈసారి ఎమోషనల్ మిస్టరీ
నరేంద్ర అనే కొత్త డైరెక్టర్ తో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. గతకొద్ధి కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కొనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు 'మిస్ ఇండియా' అనే టైటిల్ ని పెట్టే ఆలోచలో వున్నారు.

తెలుగు సినిమా జాతీయ ఉత్తమ నటీమణుల చరిత్ర
ఎన్ని సినిమాలు తీసినా.. ఎన్ని విభిన్నమైన పాత్రలు చేసినా దానికి మంచి గుర్తింపు వచ్చినప్పుడు వచ్చే కిక్కే వేరు. ఎంత ప్యాషన్ తో సినిమాలు చేసినా తమకు కూడా మంచి అవార్డులు రావాలన్న స్వార్థం కొంచమైనా నటీనటుల మనసులో ఉంటుంది. ఆ నాటి తరం నుండి నేటి వరకు ఎంతో మంది నటీ నటులకు ఎన్నో అవార్డులు దక్కాయి. ఇక ఎంత మంది నటీనటులు సినిమాల్లో నటించినప్పటికీ కొందరినే జాతీయ అవార్డు వరిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సినిమాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చే ఈ అవార్డును దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు కదా. ఇప్పుడు అలాంటి గొప్ప అనుభూతిలోనే వుంది కీర్తి సురేష్. ఇక మన తెలుగు నాటికీ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కి…
'మిస్ ఇండియా'గా కీర్తి సురేష్?
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నరేంద్ర అనే డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. మహేష్ కొనేరు నిర్మిస్తున్నాడు. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. గతకొద్ధి కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఎగ్జైటింగ్ అప్ డేట్ త్వరలో
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నగేష్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయంకానున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ సహనిర్మాతగా వ్యవహరించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేయనున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.