
ట్యాగ్ · 7 కథనాలు


దర్శకుడు రాజమౌళి పై కంగనా రనౌత్ ప్రశంసలు

సౌత్ స్టార్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్..!

"తలైవి " మూవీ కి సీక్వెల్

ప్రభాస్ తో మళ్ళీ నటించాలని ఉంది..!

ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్

కంగనా ఎమర్జెన్సీ మళ్లీ వాయిదా
ఈమధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారించింది కంగనా. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మంచి ప్రశంసలే దక్కించుకుంది. ఇప్పుడు మరో పవర్ ఫుల్ లేడీ పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎమర్జెన్సీ. అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ పాత్రలో ఈసినిమాలో నటిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై కంగనా రనౌత్ ప్రశంసలు
బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని కంగనా రనౌత్ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. తలైవి , మణికర్ణిక వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న కంగనా రనౌత్ బెస్ట్ యాక్ట్రెస్ గా 4 నేషనల్ , 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటించిన ఎమర్జెన్సీ హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కంగనా ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా బ్లాక్ బస్టర్ చంద్రముఖి మూవీ సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ లో చంద్రముఖి పాత్రలో నటిస్తున్నారు.

దర్శకుడు రాజమౌళి పై కంగనా రనౌత్ ప్రశంసలు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ , "ఆర్ ఆర్ ఆర్ "మూవీ ని విజువల్ వండర్ గా తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

సౌత్ స్టార్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం సౌత్ స్టార్స్ హవా నార్త్ లో ఎలా కొనసాగుతుందో చూస్తూనే ఉన్నాం. బాహుబలి ఫ్రాంచైజ్ నుండి మొదలైన హవా ఆతరువాత కె.జి.యఫ్ , సాహో, ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా వరకూ కొనసాగుతూ వస్తుంది. కరోనా పరిస్థితిలో కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఇప్పుడు మన నార్త్ స్టార్స్ పై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

"తలైవి " మూవీ కి సీక్వెల్
విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ ఆయ్యి ప్రేక్షకాదరణ పొందింది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో జయలలితగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ , ఎమ్ జి ఆర్ పాత్రలో అరవింద్ స్వామి , కరుణానిధిగా ప్రకాష్ రాజ్ , జానకి రామచంద్రన్ పాత్రలో మధుబాల,శశికళ పాత్రలో పూర్ణ, జయలలిత మదర్ సంధ్య పాత్రలో భాగ్యశ్రీ నటించారు.

ప్రభాస్ తో మళ్ళీ నటించాలని ఉంది..!
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. ఇక ఇంత రేంజ్ ఉన్న హీరోతో సినిమా చేయాలని ఏ హీరోయిన్ కు మాత్రం ఉండదు చెప్పంది. ప్రతి ఒక్కరూ అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుంటారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా ప్రభాస్ తో నటించాలని ఉందని చెప్పింది. అయితే మాములు హీరోయిన్ అయితే వేరేలా ఉండేది కానీ బాలీవుడ్ క్వీన్ కంగనా లాంటి హీరోయిన్ చెప్పడం అంటే మాత్రం నిజంగా ఆసక్తికరమైన విషయమే.

ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్
సక్సెస్ ఫుల్ "గ్యాంగ్ స్టర్ "మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కంగనా రనౌత్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రెకషకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "క్వీన్ "మూవీ లో కంగనా రనౌత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు."మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ " మూవీ లో నటిస్తూ కంగన దర్శకత్వం వహించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా కంగన ప్రధాన పాత్రలో తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందిన"తలైవి "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.