
ట్యాగ్ · 7 కథనాలు


డిసెంబర్ లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్..!

'విక్రమ్' తరువాత 'ఇండియన్ 2' సినిమానే
ముఖ్యమంత్రి జగన్ కు కమల్ హాసన్ ధన్యవాదాలు
మరో వివాదంలో కమల్..!
ఆగష్ట్ నుండి రజినీ-కమల్ సినిమా..!

కబాలి డైరెక్టర్ తో కమల్..!
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం విక్రమ్ సినిమాతో బిజీగాఉన్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా రీసెంట్ గానే కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ తో సినిమాపై అంచనాలు, క్యూరియాసిటీని మరింత పెంచేశాడు. విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ పలువురు ప్రముఖలు నటిస్తుండగా రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డిసెంబర్ లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్..!
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి తోడు ఈమధ్య ఈసినిమా గురించి శంకర్ కు లైకా కు మధ్య వివాదాలు కూడా వచ్చాయి.

'విక్రమ్' తరువాత 'ఇండియన్ 2' సినిమానే
లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విక్రమ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసారి కమల్ గ్యాంగ్ స్టర్ గా సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టినా మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఆతరువాత కమల్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో మరోసారి బ్రేక్ పడింది. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం ,షూటింగ్ దశలో ఉండగా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు.
ముఖ్యమంత్రి జగన్ కు కమల్ హాసన్ ధన్యవాదాలు
కోట్లాది ప్రజలను తన గాన మాధుర్యంతో ఆకట్టుకున్న లెజెండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం కు భారత దేశ అత్యున్నత "భారత రత్న "పురస్కారం అందజేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , భారత ప్రధాని నరేంద్ర మోదీ కి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. బాలు కు భారతరత్న పురస్కారం పై విజ్ఞప్తి చేసిన జగన్ కు తమిళ సూపర్ స్టార్ , మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తన మద్దతు తెలిపారు.
మరో వివాదంలో కమల్..!
విలక్షణ నటుడు కమల్ హాసన్ కాస్త బోళా మనిషి అని తెలుసు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే మనిషి. అయితే అది ఒక్కోసారి వర్క్ అవుట్ అయినా ఒక్కోసారి మాత్రం పలు వివాదాలకు దారితీస్తుంది. ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న కమల్.. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు. రీసెంట్ గా తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఇటీవల లైవ్ ప్రోగ్రామ్ లో కమల్ ముచ్చటించిన సంగతి తెలిసిందే. అయితే... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా అంటే ఛారిటీ కాదని... టికెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారమని చెప్పారు. త్యాగరాజ స్వామిలా రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక కమల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది…
విజయ్ పై కమల్ ప్రశంసలు - కమర్షియల్ మాయలో పడలేదు నువ్వు..!
తమిళ ప్రేక్షకులతో మక్కల్ సెల్వన్‌గా పిలుపించుకున్న నటుడు విజయ్ సేతుపతి. మొదటి నుండి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ.. తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకే తక్కువ కాలంలోనే మంచి నటుడిగా, స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు. పక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కీలకమైన పాత్రల కోసం విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు.
ఆగష్ట్ నుండి రజినీ-కమల్ సినిమా..!
ఈ ఏడాది 'దర్బార్' సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్. ప్రస్తుతం తను అజిత్‌తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నాడు. ఖుష్బూ,మీనా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.... కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది.