ట్యాగ్ · 8 కథనాలు

కళ్యాణం కమనీయం రిలీజ్ లో మార్పు లేదు

సెన్సార్ పూర్తిచేసుకున్న కళ్యాణం కమనీయం

కళ్యాణం కమనీయం ట్రైలర్ రిలీజ్

కళ్యాణం కమనీయం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంతోష్ కు ఆసెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
ఇండస్ట్రీలో కొన్ని కొన్ని బ్యానర్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆ బ్యాన్ర్స నుండి సినిమాలు వస్తున్నాయి అంటే ఆసినిమాలపై ఆటోమేటిక్ గా అంచనాలు ఏర్పడతాయి. ఈసినిమాపై నమ్మకం ఏర్పడుతుంది. అలాంటి ప్రొడక్షన్ సంస్థే వైజయంతి మూవీస్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ కూడా ఒక బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. ఎప్పటినుండో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది ఈసంస్థ. ఎంతో మంది హీరోలకు ఎన్నో హిట్ సినిమాలను అందించి వారి జాతకాలనే మార్చేసింది ఎంతో మంది హీరోలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయే చిత్రాలు నిర్మించింది.

సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం రివ్యూ
ఫైనల్ గా చెప్పాలంటే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో తెరకెక్కిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ తో ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ఈసినిమాను అన్ని వర్గాల వారు చూసి ఎంజాయ్ చేయొచ్చు.

కళ్యాణం కమనీయం రిలీజ్ లో మార్పు లేదు
సంక్రాంతి వచ్చిందంటే చాలు సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా వరకూ పెద్ద హీరోల సినిమానే సంక్రాంతి బరిలోకి పోటీకి దిగుతాయి. ఇక ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే పలువురు పెద్ద హీరోల సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అందులో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, అజిత్ నటించిన తునివు ఇంకా విజయ్ నటించిన వారసుడు సినిమాలు ఉన్నాయి. అందుకే దాదాపు చిన్న సినిమాలు సంక్రాతిని లైట్ తీసుకుంటాయి. కానీ అన్ని పెద్ద సినిమాలు ఉన్నా కానీ ఏమాత్రం లెక్కచేయకుండా ఒక చిన్న సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఆ సినిమా మరేదో కాదు కళ్యాణం కమనీయం.

సెన్సార్ పూర్తిచేసుకున్న కళ్యాణం కమనీయం
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో పెళ్లి నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రమని సెన్సార్ బృందం అభినందనలను తెలియజేశారు.

కళ్యాణం కమనీయం ట్రైలర్ రిలీజ్
అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. ఇక సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలోఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. దీనిలోభాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ హీరోయిన్ అనుష్క చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. లవ్, ఎమోషన్, కామెడీ సన్నివేశాలు అన్ని ఎలిమెంట్స్ ఈసినిమాలో కనిపిస్తున్నాయి.

కళ్యాణం కమనీయం- వెడ్డింగ్ మెలోడియస్ ఓ మనసా సాంగ్ రిలీజ్
టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్ కూడా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబర్ తో ప్రేక్షకుల ముందుకు రాగా అది మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఇక ప్రస్తుతం మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. ప్రస్తుతం ఈసినిమా షూటంగ్ ను ముగించుకునే పనిలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. పెళ్లి నేపథ్యంలో ఈసినిమా రూపొందించనున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పటికే రిలీజ్…

కళ్యాణం కమనీయం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్ . ఇక ఆతరువాత తను నేను, పేపర్ బాయ్ అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో డీసెంట్ హిట్ లను అందుకున్నాడు. అలానే రీసెంట్ గా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమా వచ్చింది. ఇక ఈసినిమా హిలోరియస్ ఎంటర్ టైనర్ గా మంటి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సంతోష్ శోభన్

రిలీజ్ అయిన కళ్యాణం కమనీయం ఫస్ట్ లుక్
యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వంలో సంతోష్ శోభన్ , ప్రియ భవానీ శంకర్ జంటగా తెరకెక్కిన కళ్యాణం కమనీయం మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. కంటెంట్ ప్రధాన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోసంతోష్ శోభన్. తాజాగా మరో డిఫరెంట్ లవ్ స్టోరీతో సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు .ఈ మూవీ తో ప్రియ భవానీ శంకర్ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.