
ట్యాగ్ · 8 కథనాలు


హిందీ 'జెర్సీ' పై నాని రియాక్షన్

"జెర్సీ "మూవీ కాంబినేషన్ మరోసారి ?

'నాని' ఏడిపించేశాడు

అర్జున్ కథకు 2ఏళ్లు

హీరో నాని పై షాహిద్ కపూర్ ప్రశంసలు
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నాని ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ గీతా ఆర్ట్స్ , దిల్ రాజు ప్రొడక్షన్స్ , సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడి గా హిందీ రీమేక్ "జెర్సీ" తెరకెక్కుతుంది.

హిందీ 'జెర్సీ' పై నాని రియాక్షన్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. జెర్సీ సినిమాలో నాని అర్జున్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇక ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు షాహిద్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి ఈసినిమా కూడా ఎప్పడో మొదలైంది కానీ కరోనా వల్ల పలుమార్లు షూటింగ్ కు అంతరాయం కలిగింది. షూటింగ్ ను కూడా ఎప్పుడో పూర్తి చేసుకుంది కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. ప్రస్తుతం మేకర్స్ సినిమాను రిలీజ్ కు సిద్దం చేసే…

"జెర్సీ "మూవీ కాంబినేషన్ మరోసారి ?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హీరో నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ "మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని తన సహజమైన నటనతో సినిమాకు ప్రాణం పోశారు . ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో కళ్ళతో పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. షాహిద్ కపూర్ హీరో గా "జెర్సీ" హిందీ రీమేక్ "జెర్సీ " మూవీను దర్శకుడు గౌతమ్ తెరకెక్కిస్తున్నారు.

'నాని' ఏడిపించేశాడు
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. 2019 ఏప్రిల్ 19న విడుదలైన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన న్యాచురల్ నటనతో నవ్విస్తాడు... ఏడిపిస్తాడు అందుకే న్యాచురల్ స్టార్ అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. ఈసినిమాలో కూడా నాని తన ఎమోషన్ తో ప్రేక్షకులను కంటతడి పెట్టిసాడు. నానికి కొడుకుగా చేసిన రోనిత్, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించారు. సత్యరాజ్, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు…

అర్జున్ కథకు 2ఏళ్లు
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు.. ఎవరి స్టైల్ వారిది..అందరి నటన ఒకేలా ఉండదు.. ఒకేలా నటించలేరు కూడా. ఇక ఇప్పుడున్న హీరోల్లో కామెడీ అయినా.. ఎమోషనల్ అయినా మనసుకు హత్తుకుపోయేలా తన సహజ నటనతో మెప్పించే హీరో ఎవరైనా వున్నారంటే అది నాని అని చెప్పొచ్చు. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు న్యాచురల్ స్టార్ అనే అవార్డు ఇచ్చారంటేనే అర్థంచేసుకోవచ్చు తన నటన గురించి.

"జెర్సీ "మూవీ కి నేషనల్ అవార్డ్ పై హీరో నాని స్పందన
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధా శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ " మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని , హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నేషనల్ అవార్డ్స్ లో "జెర్సీ "మూవీ ఉత్తమ చిత్రం గా ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా స్పందించిన హీరో నాని ఒక వీడియో ను రిలీజ్ చేశారు.

నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఉత్తమ నిర్మాణ సంస్థ , ""జెర్సీ " మూవీ ఉత్తమ చిత్రం గా జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు నిర్మాణ సంస్థలకూ సినీ ప్రముఖులు అభినందనలు అందజేస్తున్నారు. జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న అందరికీ అభినందనలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.

నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న జెర్సీ, మహర్షి సినిమాలు
కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 2019లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డ్స్ లో భాగంగా మన తెలుగు సినిమాలు జెర్సీ, మహర్షి సినిమాలు కూడా అవార్డ్స్ ను సొంతం చేసుకున్నాయి.