ట్యాగ్ · 9 కథనాలు

జాను మూవీ పబ్లిక్ ఒపీనియన్

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి..!

`జాను` రన్ టైమ్ డిటైల్స్

'జాను' రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
'జాను' మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు
సమంత తాను ఇంట్లో వుండే నేను లేనని చెప్పించినా... శర్వా తాను చేయగలనా అని ఆలోచించినా నన్ను నమ్మండి అని వారికీ భరోసా ఇచ్చి మరీ సినిమాను రీమేక్ చేసాడు దిల్ రాజు. ఇంతకీ ఆ సినిమా ఏంటో స్ట్రైక్ అయివుంటుంది కదా. అదే '96' రీమేక్ జాను. తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన క్లాసిక్ ప్రేమకథ ‘96'. ఇక ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా, సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 7న (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చూసిన…

హగ్గింగ్ కూడా లేని హాంటింగ్ లవ్ స్టోరీ జాను
ఇక సాంకేతికంగా ప్రతి ఒక్కరి నుండి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ తీసుకోగలిగాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ఇక నిర్మాణ పరంగా శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ అధినేత అయిన దిల్ రాజు మేకింగ్ వాల్యూస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయినా జాను లాంటి చిత్రాల నిర్మాణంలో బడ్జెట్ కంటే నిర్మాత అభిరుచిని మాత్రమే అభినందనీయమైన అంశంగా పరిగణించాలి. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలా స్కేలింగ్ తో, ఫీలింగ్ తో ఇలాంటి రేర్ ఫిలిమ్స్ ను రేటింగ్ చేయకూడదు. ఇలాంటి అరుదైన ప్రయత్నాలకు మినహాయింపులు లేని అభినందనలు అందించటం అవసరం. ముఖ్యంగా దిల్ రాజు లాంటి అభిరుచి, దక్షత గల నిర్మాతలు మాత్రమే చేయగల ఇలాంటి ఎటెంప్ట్స్ కు "రిమార్క్

జాను మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి..!
ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి అని అంటున్నాడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... దిల్ రాజు నిర్మాతగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన '96' సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 'జాను' టైటిల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ టైటిల్ విషయంలోనే దిల్ రాజు ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాడు.

'జాను' చిత్రంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు - దిల్‌రాజు
శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈసందర్భంగా మంగళవారం వైజాగ్‌లో జరిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ కార్యక్రమంలో...

`జాను` రన్ టైమ్ డిటైల్స్
తమిళనాట ఘనవిజయం సాధించిన `96`.. తెలుగులో `జాను` పేరుతో రూపొందిన సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని మాతృక దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ రూపొందించాడు. `దిల్` రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఒరిజినల్ వెర్షన్ కి బాణీలు అందించిన గోవింద్ వసంత సంగీతమందించాడు.

'జాను' - 'ది లైఫ్ ఆఫ్ రామ్' వీడియో సాంగ్ రిలీజ్
శర్వానంద్, సమంత జంటగా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక పాటలకు కూడా మంచి స్పందన లభిస్తుంది. ''ప్రాణం నా ప్రాణం'', ''ఊహలే ఊహలే'' పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ''ది లైఫ్ ఆఫ్ రామ్'' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'జాను' రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
శర్వానంద్, సమంత జంటగా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
ఫిబ్రవరి 7వ తేదీ విడుదలకు సిద్ధమైన 4 చిత్రాలు
డిఫరెంట్ జానర్ లలో రూపొందిన 4 సినిమాలు ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కు సిద్ధం అయ్యాయి. ఇప్పుడు ఆ 4 సినిమాల గురించి తెలుసుకుందాం. రిలీజ్ కు పోటీ పడుతున్న ఈ నాలుగు మూవీస్ లో ఏ మూవీ విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.