
ట్యాగ్ · 48 కథనాలు · పేజీ 3

హీరో రామ్ కు మరోసారి జోడీగా అనుపమ పరమేశ్వరన్ ?

హీరో రామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లుక్

పోల్ గేమ్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ బెస్ట్ మూవీ ?
రామ్ మిర్రర్ సెల్ఫీ
"RED " మూవీ దీపావళికి థియేటర్స్ లో రిలీజ్ ?
'రెడ్' సినిమా - డబ్బింగ్ పూర్తి చేసిన రామ్
న్యూ లుక్ లో హీరో రామ్

ఫ్రెష్ లుక్ లో హీరో రామ్
"దేవదాసు ", "రెడీ ", "కందిరీగ ", "పండగ చేస్కో ", "నేను శైలజ ", "హలో గురు ప్రేమకోసమే " వంటి సూపర్ హిట్ మూవీస్ లో రామ్ పోతినేని తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు. చాక్లెట్ బాయ్ లా ఉండే హీరో రామ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మాస్ క్యారెక్టర్ లో పక్కా హైదరాబాదీ యువకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
హీరో రామ్ కు మరోసారి జోడీగా అనుపమ పరమేశ్వరన్ ?
సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ప్రేమమ్ "," శతమానం భవతి ", "హలో గురు ప్రేమకోసమే ", రాక్షసుడు" వంటి సూపర్ హిట్ మూవీస్ లో అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. స్లిమ్ గా మరింత అందంగా మారిన అనుపమ ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న "18పేజెస్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ కి కథానాయిక గా ఎంపిక అయ్యారని సమాచారం.

హీరో రామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లుక్
"ఇస్మార్ట్ శంకర్ "విజయోత్సాహం లో ఉన్న హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో నిజ సంఘటనలతో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ సంక్రాంతి కి రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. మణి శర్మ సంగీతం అందించారు. కొవిడ్ - 19 కారణంగా "RED " మూవీ రిలీజ్ వాయిదాపడింది.

పోల్ గేమ్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ బెస్ట్ మూవీ ?
వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ , ఇలియానా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "దేవదాసు "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో హీరో రామ్ , హీరోయిన్ ఇలియానా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చక్రి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.
రామ్ మిర్రర్ సెల్ఫీ
బ్లాక్ బస్టర్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయిన రామ్ పోతినేని ఆ మూవీ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "రెడీ ", "కందిరీగ ", "పండగ చేస్కో ", "నేను శైలజ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మాస్ క్యారెక్టర్ లో రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా జీ సినీ అవార్డ్ అందుకున్నారు.
"RED " మూవీ దీపావళికి థియేటర్స్ లో రిలీజ్ ?
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర లలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. సూపర్ హిట్ "తడమ్ "తమిళ మూవీ కి తెలుగు రీమేక్ గా "RED " మూవీ రూపొందింది.
'రెడ్' సినిమా - డబ్బింగ్ పూర్తి చేసిన రామ్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. రామ్ తన డబ్బింగ్ పూర్తి చేసినట్టు తన ఇన్స్టా ద్వారా తెలిపాడు.
న్యూ లుక్ లో హీరో రామ్
పలు రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీస్ లో స్మార్ట్ బాయ్ గా కనిపించిన రామ్ పోతినేని గడ్డంతో రఫ్ లుక్ తో కనిపించిన యాక్షన్ థ్రిల్లర్ "ఇస్మార్ట్ శంకర్" మూవీ ఘనవిజయం సాధించింది. అదే లుక్ తో రామ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "RED" మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. హీరో రామ్ ఇప్పుడు క్లీన్ షేవ్ తో స్మార్ట్ లుక్ లో మారిపోయారు.