కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Jr NTR

ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ ?

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కియారా అద్వానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ హిందీ రీమేక్ "కబీర్ సింగ్ " మూవీ లో కియారా అద్వానీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. "కబీర్ సింగ్ " మూవీ ఘనవిజయం తో కియారా పలు బాలీవుడ్ అవకాకాశాలు అందుకున్నారు. కియారా ప్రధాన పాత్రలో రూపొందిన "ఇందూ కి జవానీ "మూవీ డిసెంబర్ 11 వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ స్టైల్ లో డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ముందుండి నడిపించి భారత క్రికెట్ అభిమానులకు దగ్గరయ్యారు. లాక్ డౌన్ సమయం లో పలు వీడియోస్ తో వార్నర్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. మైండ్ బ్లాక్ (సరిలేరు నీకెవ్వరు ), బుట్ట బొమ్మ (అల వైకుంఠపురములో ) సాంగ్స్ ను తన వైఫ్ తో స్టెప్స్ వేసి వార్నర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పేస్ యాప్ తో స్టార్ హీరోస్ ప్రభాస్ , మహేష్ బాబు , రామ్ చరణ్ , అల్లు అర్జున్ ముఖాలకు తన ముఖం సెట్ చేసి సోషల్ మీడియా లో షేర్ చేసి ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ తో నటించడం అద్భుతం - పూజాహెగ్డే

టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో పూజాహెగ్డే ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Romantic Movie Actress Ketika Sharma Grabs Opportunity To Play Lead Role Opposite Jr NTR In NTR 30
సినిమా వార్తలు

"#NTR30" మూవీ లో కేతిక శర్మ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "#NTR30"మూవీ రూపొందనుంది. మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్ళే ఈ మూవీ కై దర్శకుడు త్రివిక్రమ్ నటీ నటులను ఎంపిక చేస్తున్నారు. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా కేతిక శర్మ ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లేడీ విలన్ గా రమ్యకృష్ణ ?

తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు మూవీస్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. "పడయప్పా "తమిళ మూవీ లో రజనీకాంత్ కు ధీటుగా నటించి రమ్యకృష్ణ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి", "బాహుబలి 2" మూవీస్ లో శివగామి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రమ్యకృష్ణ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మిడ్ నైట్ చలిలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ షూటింగ్

కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి చాలా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టగా టీం మాత్రం నిర్విరామంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒక్కసారి కమిట్ అయితే ఎంత కష్టమైనా షూటింగ్ కు మాత్రం బ్రేక్ చెప్పడు. ఇక ఇప్పటికే షూటింగ్ కు సంబంధించి పలు వీడియోలు పోస్ట్ చేయగా ఇప్పుడు మరో వీడియో ను ఆర్ఆర్ఆర్ టీం పోస్ట్ చేసింది. ఇక వీడియోలో చూస్తుంటే చ‌లికి వ‌ణుకుతూ షూటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి దీపావళి విషెస్

ఈ మధ్య ఆర్ఆర్ఆర్ నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా రేపు దీపావళి కావడంతో అభిమానులకు మరో సర్ఫరైజ్ ఇచ్చారు. అందరికీ దీపావళి విషెస్ చెపుతూ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ఇక ఫొటోల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ తెలుపు రంగు దుస్తుల్లో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. తారక్, చెర్రీకి రాజమౌళి ఏదో వివరిస్తున్నట్లు ఓ ఫొటో ఉంది. వారి ముగ్గురి వెనుక ఆర్ఆర్ఆర్ అనే అక్షరాలు కనపడుతున్నాయి. చెర్రీ, తారక్ కలిసి, అలాగే విడివిడిగా కూడా ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం సోషల్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫైట్ సీక్వెన్స్ షూట్ లో 'ఆర్ఆర్ఆర్'

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా..ఫైనల్ గా ఇటీవలే షూట్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈ సెట్ లో హాలీవుడ్ నటి.. ఈ సినిమాలో లేడీ స్కాట్ గా చేస్తున్న ఆలిసన్ డూడి అడుగుపెట్టేసింది. బాలీవుడ్ నటి అలియా భట్ కూడా త్వరలోనే సెట్ లో అడుగుపెట్టనుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్ కు మాటిచ్చిన ఎన్టీఆర్

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. హీరోలంటే అభిమానులకు ఎంత ప్రేమ ఉంటుందో.. తమ అభిమానులపై కూడా అదే ప్రేమను... అదే అభిమానాన్ని చూపిస్తారు మన హీరోలు. ఇక అనారోగ్యంతో ఉన్న తమ అభిమానులను స్వయంగా కలిసిన హీరోలు కూడా చాలా మంది వున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్ ఇలా పలువురు హీరోలు తమ అభిమానుల లాస్ట్ విష్ ను తీర్చినవాళ్ళే. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఒక ఫ్యాన్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతోపాటు మాటిచ్చాడు కూడా.

TFN Adminవాట్సాప్

షేర్