
ట్యాగ్ · 10 కథనాలు


RC 16 టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్

చరణ్ కు బన్నీ స్వీట్ బర్త్ డే విషెస్


RRR టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

మెగా ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్

నిగర్వి అయిన చిరంజీవిని గర్విష్టిని చేసిన రామ్ చరణ్

రామ్ చరణ్‌కి బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తన బాబాయి, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చరణ్ క్లోజ్ ఫ్రెండ్, టాలీవుడ్ స్టార్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ పంచుకున్నారు. ఇక వీరితోపాటుగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు, నటీనటులు రామ్ చరణ్‌కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

రామ్ చరణ్ బర్త్ డే.. 'పెద్ది'పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చరణ్ తండ్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. అలాగే చరణ్ కొత్త సినిమా పెద్ది గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. "మై డియర్ రామ్ చరణ్, పుట్టినరోజు శుభాకాంక్షలు.. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. 'పెద్ది' చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు. ఇది నీలోని నటుడి యొక్క కొత్త కోణాన్ని బయటకు తెస్తుందని, సినిమా ప్రియులకు మరియు అభిమానులకు ఒక విందుగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను!! దీన్ని కొనసాగించండి." అని పేర్కొన్నారు.

RC 16 టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన RC 16 అప్డేట్ వచ్చింది.ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈసినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే అదిరిపోయింది.ఇందులో చరణ్ రగ్గడ్ లుక్ లో ఊర మాస్ గా కనిపించాడు.ఈసినిమా కోసం చరణ్ బరువు పెరిగాడు.ఫస్ట్ లుక్ పోస్టర్ లో అది క్లియర్ గా కనిపించింది.ఉగాది పండగ రోజున గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈరోజే గ్లింప్స్ ఇవ్వాలనుకున్నా వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదాపడింది.

చరణ్ కు బన్నీ స్వీట్ బర్త్ డే విషెస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో రామ్ చరణ్ కు మెగా ఫ్యాన్స్ నుండి, సెలబ్రిటీల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. అంతేకాదు రామ్ చరణ్ కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వచ్చేస్తున్నాయి. దీనిలో భాగంగానే గేమ్ ఛేంజర్ నుండి ఇప్పటికే జరగండి అంటూ వచ్చే కలర్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

రామ్ చరణ్ బర్త్ డే.. విషెస్ తెలిపిన పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. వీరిలో చరణ్ బాబాయి, పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కజిన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్లోజ్ ఫ్రెండ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితరులున్నారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే 'కేజీఎఫ్' మరియు 'సలార్' ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరోలు శర్వానంద్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సహా పలు ప్రొడక్షన్ హౌజ్‌లు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు…

తిరుమల శ్రీవారి సన్నిధిలో రామ్ చరణ్ దంపతులు.. మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా సతీమణి ఉపాసనతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న రామ్ చరణ్, ఉపాసనలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చరణ్ దంపతులు కుమార్తె క్లీన్ కారాతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

RRR టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ పార్టీలో ప్రముఖ నటీనటులు, టాలీవుడ్ సెలబ్రిటీలు సహా పలువురు హాజరయ్యారు. రామ్ చరణ్, ఆయన సతీమణి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే CDP
సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్
ఈరెండు రోజులు మెగా ఫ్యామిలీ కి పండగే. రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఈరోజు నుండే సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ సందడి చేస్తున్నారు. ఇక అభిమానులకు రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్ కు ఒక రోజు ముందే తను నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉండగా మరో రెండు రోజులు మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ఉన్నట్టు తెలుస్తుంది. ఈవిషయం ఎవరో కాదు చరణ్ స్వయంగా అభిమానులతో చెప్పడంతో అభిమానులు సంతోషంలో ఉన్నారు.

నిగర్వి అయిన చిరంజీవిని గర్విష్టిని చేసిన రామ్ చరణ్
హీరోగా కెరీర్ ప్రారంభించాక రెండవ చిత్రానికే ఫిలిం ఇండస్ట్రీకి ఒక సరికొత్త రికార్డును సెట్ చేసాడు రామ్ చరణ్. ఇది ఏ వారసత్వ హీరోకు దక్కని అరుదైన అదృష్టం. ఇది వ్యక్తిగతంగా తనకు మాత్రమే కాదు... తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ప్రతిష్టాత్మక విశేషమనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చాలామంది అగ్ర తారలు తమ కుమారులను హీరోలుగా పరిచయం చేసినప్పటికీ రెండవ సినిమాకే రికార్డులు బద్దలు కొట్టిన దాఖలాలు లేవు. ఆ ఘనత కుమారుడు రామ్ చరణ్ ద్వారా దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తొలి చిత్రం “చిరుత ” లోనే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్ చరణ్ రెండవ చిత్రం “మగధీర” లోనే నటన పరంగా అంత…