
ట్యాగ్ · 8 కథనాలు


హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్..

పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్

శృతిహాసన్ డ్యాన్స్ రిహార్సల్
'గబ్బర్ సింగ్' ఆడియో లాంచ్.. బ్రహ్మీ-అలీ కామెడీ
సాలిడ్ ఎంటర్ టైనర్ మూవీ

ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ డే కి బ్లాస్టింగ్ గ్లింప్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ఇప్పటికే ఫస్ట షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు మరోపక్క ఎడిటింగ్ పనులను కూడా మొదలుపెట్టేశారు. మరోవైపు సెకండ్ షెడ్యూల్ కు సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ కూడా ఇచ్చారు హరీష్ అండ్ టీమ్. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. స్పెషన్ డే కు ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ స్పెషన్ డేట్ మరేదో కాదు మే 11. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్…

హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్..
పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ సినిమాలను అందించే డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్. షాక్ తో డైరెక్టర్ గా ఎంట్రీ గా ఇచ్చిన హరీష్ కు రవితేజ తో తీసిన మిరపకాయ్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. షాక్ ప్రశంసలు అందుకున్న కమర్షియల్ గా అంత వర్క్ అవుట్ అవ్వలేదు. అయినా హరీష్ ట్యాలెంట్ చూసి రవితేజ రెండో సారి నమ్మి అవకాశం ఇచ్చాడు అయితే ఈ సారి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హరీష్. 2011 లో విడుదలైన ఈచిత్రం ఆ ఏడాది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత హరీష్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. హరీష్ కెరీర్ బెస్ట్ మూవీ కూడా ఇదే.

పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది వకీల్ సాబ్ సినిమాతో ఖాతా తెరిచిన పవన్ ఈ ఏడాది భీమ్లానాయక్ తో మరో సంచలన విజయం సాధించారు. బాక్సాఫీస్ వద్ద ఈసినిమా ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీంతో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలానే హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. వీటిలో క్రిష్ హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు.

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “గబ్బర్ సింగ్ ” మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు.

శృతిహాసన్ డ్యాన్స్ రిహార్సల్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 3 సంవత్సరాల గ్యాప్ తరువాత శృతి హాసన్ కథానాయిక గా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన “లాభం”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “సలార్ “మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
'గబ్బర్ సింగ్' ఆడియో లాంచ్.. బ్రహ్మీ-అలీ కామెడీ
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత సంచలన విజయం దక్కిచుకుందో తెలుసు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబంగ్’కి రీమేక్‌గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ నటించిన తీరు.. ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా మురిపించింది.తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్.
సాలిడ్ ఎంటర్ టైనర్ మూవీ
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ "గబ్బర్ సింగ్ " రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శృతి హాసన్ కథానాయిక. "గబ్బర్ సింగ్ " మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. హీరో పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటించిన "గబ్బర్ సింగ్ " మూవీ విశేష ప్రేక్షకాదరణ పొంది సుమారు 150 కోట్లు కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’కి 8 ఏళ్ళు
“నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది”.. అంటూ 8 ఏళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేల్చిన పంచ్ డైలాగ్ థియేటర్లలో ఏ స్థాయిలో పేలిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ నటించిన తీరు.. ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా మురిపించింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబంగ్’కి రీమేక్‌గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఇక్కడ కూడా అదే బాట పట్టింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇందులో పవన్‌కు జోడిగా శ్రుతి హాసన్ నటించింది…