
ట్యాగ్ · 7 కథనాలు


ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు

జగన్ తో ముగిసిన భేటీ.. త్వరలో గుడ్ న్యూస్..!

ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..!
ఆర్ఆర్ఆర్ లో నాపాత్ర చిన్నదే కానీ..!

సీఎం జగన్ తో సమావేశం పై మహేష్ బాబు స్పందన
చిత్ర పరిశ్రమ సమస్యల పై హీరోలు చిరంజీవి , ప్రభాస్, మహేష్ బాబు, దర్శ కులు రాజమౌళి, కొరటాల శివ, నటులు పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి, సీఎం జగన్ తో సమావేశం అయిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. గత 6 నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కన్ఫ్యూజన్ లో ఉంది. నిజానికి ఈరోజు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి, స్పెషల్ గా పేర్ని నాని కి, సిన్సియర్ థ్యాంక్స్ టు సీఎం జగన్ కి అని అన్నారు. మీరందరూ ఒక వారం పది రోజుల్లోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పారు.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు
చిత్ర పరిశ్రమ సమస్యల పై చిరంజీవి , ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి సీఎం జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. చిన్న సినిమాలకు ఐదవ షోకు అంగీకారం, తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్టుగానే ఆంధ్రాలోనూ అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలూ కల్పిస్తామనీ సీఎం జగన్ అన్నట్టుగా చిరంజీవి చెప్పారు. ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందనిచెప్పామనీ , జగన్ గారితో చర్చ ఫలప్రదం అయ్యిందనీ , దానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, పేర్ని నానికి, అలాగే న్యాయబద్ధంగా ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలనీ , ఈ నెల మూడవ వారం లోపల…

జగన్ తో ముగిసిన భేటీ.. త్వరలో గుడ్ న్యూస్..!
సినిమా టికెట్ల రేటు పెంపు విషయంపై ఏపీ ప్రభుత్వానికి.. టాలీవుడ్ కు మధ్య గత కొద్దిరోజులుగా వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇక నేడు మరోసారి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అయితే ఈసారి జగన్ తో పాటు సినీ పరిశ్రమ నుండి ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..!
గతకొంతకాలంగా ఏపీ టికెట్ల రేటు పెంపు విషయంపై అటు టాలీవుడ్ కు, ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాదిన ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్‌ను బాగా తగ్గించడంతో సినీ పరిశ్రమ అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మొదట ఒకరిద్దరి హీరోలు మాత్రమే స్పందించారు.. ఆ తరువాత ఒకరిద్దరు ప్రొడ్యూసర్స్ ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిశారు. అయినా కూడా ఎలాంటి పరిష్కారం జరగలేదు. ఇక ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ ప్రభుత్వ తీరుని విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పేర్ని నాని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడి, ఆయన…
ఆర్ఆర్ఆర్ లో నాపాత్ర చిన్నదే కానీ..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో శ్రియ కూడా అతిధి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా నుండి కోలుకున్న రాజమౌళి.. ప్లాస్మా దానానికి టైముంది..!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి.. ఆయన కుటుంబ సబ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. నాకు.. నా ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ వచ్చింది... వైద్యుల సూచన మేరకు మేము హోం క్వారంటైన్లో ఉంటున్నాం. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. ఇక ఈ విషయం చెప్పి రాజమౌళి ఇప్పటికే రెండు వారాలు అయిపోయింది. హోమ్ క్వారంటైన్ పూర్తి అవ్వడంతో మరోసారి టెస్ట్ చేయించుకోగా అందులో అందరికీ నెగిటివ్ వచ్చిందట. ఈ విషయాన్నికూడా రాజమౌళినే స్వయంగా తన ట్విట్టర్ లో తెలిపారు.
'రాజమౌళి'ని కూడా వదలని కరోనా... ఫ్యామిలీకి కరోనా పాజిటివ్..!
కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమంది ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మొన్నటికి మొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పటికే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. అలాగే శిల్పారెడ్డి కూడా కరోనా నుంచి కోలుకున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు.