
ట్యాగ్ · 7 కథనాలు


20 ఏళ్ల సక్సెఫుల్ జర్నీ

మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా

22 సంవత్సరాల కల తీరింది - దిల్ రాజు

రాజావారు రాణిగారు డైరెక్టర్ తో దిల్ రాజు సినిమా
టాలీవుడ్ టాప్ ప్రొడ్యసర్ దిల్ రాజు ఒక పక్క పెద్ద పెద్ద హీరోలతో.. భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూనే మరోపక్క కంటెంట్ ఒరింయెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. కథలో కంటెంట్ ఉంటే దిల్ రాజు చిన్న సినిమాలు కూడా తీయడానికి ఎప్పుడు ముందుంటాడు. ఇక ఇప్పటికే పలు సినిమాలు నిర్మిస్తుండగా.. ఇప్పుడు మరో సినిమాను ప్రకటించాడు. రాజావారు రాణిగారు సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు రవి కిరణ్ కోలా. ఈసినిమాతోనే కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈసినిమా మంచి విజయం సాధించింది.

20 ఏళ్ల సక్సెఫుల్ జర్నీ
డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. నిజానికి దిల్ రాజు అసలు రేపు వెంకట రమణా రెడ్డి అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు 2003లో నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ మూవీని తొలిసారిగా నిర్మించారు. నిర్మాతగా ఫస్ట్ సినిమాతోనే తన బ్యానర్ పై మంచి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆసినిమానే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజు అయ్యాడు. ఇక అక్కడి నుండి నిర్మాతగా తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దిల్ తర్వాత ఆయన వచ్చిన…

చరణ్, విజయ్ సినిమాల రిలీజ్ డేట్లు చెప్పిన దిల్ రాజు..!
బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఎంత పెరిగిందో చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి మేకర్స్ ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక మన నిర్మాతలు కూడా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర బాషల్లో కూడా సినిమాలు చేయడానికి.. తమ మార్కెట్ ను పెంచుకోవడానికి చూస్తున్నారు. ఇక అందులో మొదటగా చెప్పుకోవాల్సింది దిల్ రాజుగురించి. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ లలో దిల్ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ఇప్పటికే తన మార్క్ ను చూపించాడు దిల్ రాజు.

"మడ్డీ "మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు
"మడ్డీ "మూవీ ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీ గా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది. పి కె 7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభగల్ దర్శకత్వంలో యువన్ , రిథాన్ కృష్ణ , అనూష సురేష్ , అమిత్ శివదాస్ నాయర్ ప్రధానపాత్రలలో మడ్ రేసింగ్ నేపథ్యం లో తెరకెక్కిన "మడ్డీ " మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు.

మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమాను పట్టాలెక్కించనుండగా రామ్ చరణ్ శంకర్ తో సినిమాను చేయనున్నాడు. అయితే చరణ్-శంకర్ సినిమాను ఎప్పుడో ప్రకటిచినప్పటికీ మధ్యలో లైకా వివాదం రావడంతో ఈసినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయారు. తమ ఇండియన్ 2 సినిమాను కంప్లీట్ చేసిన తరువాతే శంకర్ వేరే సినిమాను చేయాలన్న కండీషన్ పెట్టింది. ఇక దీనిపై వాదించిన కోర్టు కూడా మీరు మీరు తేల్చుకోవాలని చెప్పినా కూడా అవేమీ వర్కవుట్ కాలేదు. రీసెంట్ గానే ఈసినిమాకు కోర్టు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. శంకర్…

22 సంవత్సరాల కల తీరింది - దిల్ రాజు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ , ప్రేక్షకులను అలరిస్తున్న దిల్ రాజు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాతగా రాణిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ భారీ అంచనాలతో , రికార్డ్ స్థాయి లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అగ్ర నిర్మాత దిల్ రాజు పాత్రికేయులతో సమావేశమయ్యారు.
‘షాదీ ముబారక్’చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు - దిల్ రాజు
పద్మశ్రీ దర్శకత్వంలో సాగర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘షాదీ ముబారక్’.దృశ్యా రఘునాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా...