
ట్యాగ్ · 7 కథనాలు


ఫిట్ నెస్ ట్రైనర్ గా దీపికా పడుకోణె
ప్రభాస్ కు జోడీగా దీపిక పడుకొనే ?
వెంటనే 'మహానటి' చూడండి..!
అనుష్క పాత్రలో దీపికా పదుకొణె?

ఆస్కార్ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా దీపికా పడుకొనే
సక్సెస్ ఫుల్ ఐశ్వర్య (2006 ) మూవీ తో శాండల్ వుడ్ లో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన దీపికా పడుకొనే బ్లాక్ బస్టర్ ఓం శాంతి ఓం మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. పలు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో దీపిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా పఠాన్ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దీపిక ప్రస్తుతం ఫైటర్ మూవీ లో కథానాయికగా , జవాన్ మూవీ లో అతిథి పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ k మూవీ తో దీపిక టాలీవుడ్ కు పరిచయం కానున్నారు.

ఫిట్ నెస్ ట్రైనర్ గా దీపికా పడుకోణె
బ్లాక్ బస్టర్ "ఓం శాంతి ఓం " మూవీ తో కథానాయికగా బాలీవుడ్ కు పరిచయం అయిన దీపికా పడుకోణె పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. దీపికా ప్రస్తుతం "83 ", "పఠాన్ ", "ఫైటర్ " మూవీస్ లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్ తో ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో కథానాయికగా దీపికా పడుకోణె ఎంపిక అయ్యారు.

నాగ్ అశ్విన్ -ప్రభాస్ సినిమాలో అక్టోబర్ నుండి దీపికా
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఇక నాగ్ అశ్విన్ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
ప్రభాస్ సినిమాకు 'దీపికా' గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే..!
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే రోజుకో వార్త తెరపైకి వస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా నటించే అవకాశం ఉందని ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికితోడు నాగ్ అశ్విన్ తీసిన మహానటి సినిమాపై ఇటీవల సోషల్ మీడియాలో స్పందిస్తూ తప్పక చూడండి అని కూడా చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టయింది.
ప్రభాస్ కు జోడీగా దీపిక పడుకొనే ?
వైజయంతి మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీ #Prabhas 21 రూపొందనున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీ లో హీరో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే ను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
వెంటనే 'మహానటి' చూడండి..!
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి' సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న సంగతి తెలిసిందనే. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనను అందరూ ప్రశంసించారు. కీర్తి సురేష్ ను జాతీయ ఉత్తమనటిగా నిలబెట్టింది ఈ సినిమా. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ అవార్డు తో పాటు.. ఫిలింఫేర్ అవార్డు.. ఇంకా పలు అవార్డులనే సొంతం చేసుకుంది. ఇక మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్ ఒక్కసారిగా మీరిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
అనుష్క పాత్రలో దీపికా పదుకొణె?
`అరుంధతి`(2009)... అగ్ర కథానాయిక అనుష్క దశ, దిశని మార్చివేసిన చిత్రం. జేజమ్మ, అరుంధతి... ఇలా రెండు విభిన్న పాత్రల్లో తన అభినయంతో కనువిందు చేసింది స్వీటీ. కోడి రామకృష్ణ దర్శకత్వం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణదక్షత... వెరసి బాక్సాఫీస్ వద్ద పలు సంచలనాలకు కేంద్రబిందువుగా నిలచింది `అరుంధతి`. అంతేకాదు... నాయికా ప్రాధాన్య చిత్రాలకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది.