కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiranjeevi Upcoming Movie Details

ట్యాగ్ · 10 కథనాలు

సినిమా వార్తలు

ఈ నలుగురు నా కెప్టెన్లు

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ.. ప్రకటిస్తూ మంచి స్పీడ్ మీద ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చివరి దశకు చేరుకుంది. ఇక షూటింగ్ దశలో ఉండగానే లూసిఫర్ రీమేక్ ను కూడా రీసెంట్ గా ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలు పెట్టనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'లూసిఫర్' రీమేక్ కు డైరెక్టర్ ఫిక్స్

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. మొదట వినాయక్ అన్నారు. ఆ తర్వాత వినాయక్ తప్పుకున్నాడని.. ఆ తర్వాత రీమేక్ భాద్యతలు సాహో డైరెక్టర్ సుజీత్ కు అప్పచెప్పినట్టు.. సుజీత్ కూడా కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడని అన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సుజీత్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు ఈమధ్య వార్తలు వినిపించాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆ సినిమా కోసమే గుండు లుక్ ట్రై చేశాం ..!

ఇటీవల అర్బన్ మాంక్ లుక్ తో మెగా స్టార్ చిరంజీవి మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్ మేకింగ్ వీడియోను 'మేకింగ్ ఆఫ్ ద అర్బన్ మాంక్' పేరుతో ఇటీవలే తన ఇన్స్టా లో విడుదల చేసి గుండు చేయించుకోలేదని చిరు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు ఈ లుక్ ఎందుకు..? ఏదైనా సినిమా కోసమా..? అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ ఇంకా ఉంది. అయితే 'వేదాళం' రీమేక్‌ కోసమే ఈ గుండు లుక్‌ను ప్రయత్నిస్తున్నారని టాక్‌ కూడా వినిపించింది. ఇక లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్‌ చిరంజీవి తన గుండు లుక్‌పై క్లారిటీ ఇచ్చారు. 'వేదాళం' రీమేక్‌ కోసమే గుండు లుక్‌ను ట్రై చేస్తున్నట్లు, అయితే ఆ లుక్‌ ఇంకా ఫైనలైజ్‌ కాలేదని…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు క్లారిటీ.. అందుకే సుజీత్ ప్లేస్ లో వినాయక్

ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టాలని.. ముందు రామ్ చరణ్ తో వున్న సీన్స్ పూర్తి చేయాలనీ భావిస్తోందట చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెప్టెంబర్ 22.. నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు

చిరంజీవి నట ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఇంత స్థాయికి ఎదిగారు కాబట్టి ఎంతో మంది నటీ నటులకు ఆయన స్ఫూర్తి. మొదట కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా పరిచయమై మెగా స్టార్ రేంజ్ కు ఎదిగాడు. ఇక చిరు మొదట నటించిన `ప్రాణం ఖరీదు` సినిమా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. దీనితో ఈ సినిమాను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేశారు చిరు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు 'అర్బన్ మాంక్' లుక్ సీక్రెట్ రివీల్

సోషల్ మీడియాలో ఏదో ఒక సస్పెన్స్ క్రియేట్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటే. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండీ ఇప్పటివరకూ ఏదో ఒక సర్ ప్రయిజ్ ఇస్తూనే వున్నారు. ఇక ఇటీవల అర్బన్ మాంక్ లుక్ తో మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసేశాడు. అసలు ఈ లుక్ ఎందుకు..? ఏదైనా సినిమా కోసమా..? లేకపోతే మామూలుగానే గుండుచేపించుకున్నారా? అబ్బో ఎవరికి తోచిన ఆలోచన వాళ్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లుక్ వెనుక వున్న సీక్రెట్ ఏంటో చెప్పేసారు చిరు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి కొత్త అవతారం

మెగా అభిమానుల ఆరాధ్య దైవం మెగా స్టార్ చిరంజీవి దాదాపు 10 సంవత్సరాల తరువాత బ్లాక్ బస్టర్ మూవీ "ఖైదీ నెం 150 " తో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో చిరంజీవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక, అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. తరువాత "సైరా నరసింహా రెడ్డి " మూవీ లో తన నటనా విశ్వరూపం ప్రదర్శించి చిరంజీవి ఆకట్టుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో నటిస్తున్నారు. "

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Remembers Mother Teresa On Her Birth Anniversary
సినిమా వార్తలు

మథర్ థెరిస్సా ను గుర్తు చేసుకున్న మెగాస్టార్

కేవలం సినిమా అప్ డేట్స్.. వ్యక్తిగత విషయాలు, ఫొటోస్, వీడియోస్ మాత్రమే కాదు పలు ముఖ్యమైన విషయాలను కూడా మెగా స్టార్ చిరు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. ఈరోజు మదర్ థెరీసా పుట్టినరోజు సందర్భంగా ఆమెను గుర్తుచేసుకున్నారు చిరంజీవి. తన ట్విట్టర్ ద్వారా ఆమెకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ.. `మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్లినా ప్రేమను పంచాలి.. మదర్ థెరీసా 110వ జన్మదినోత్సవం సందర్భంగా గొప్ప మాతృమూర్తిని గుర్తు చేసుకుంటున్నా. ఆమె చూపించిన స్వార్థరహిత ప్రేమ, మానవత్వం ఈ ప్రపంచాన్నే హీల్ చేస్తుంది అంటూ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్

"ప్రాణం ఖరీదు" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరించారు. కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసి మెగా స్టార్ గా మారి చిరంజీవి టాలీవుడ్ లో తిరుగు లేని హీరోగా రాణిస్తున్నారు. 149 సినిమాలలో నటించిన చిరంజీవి పొలిటికల్ పార్టీ "ప్రజారాజ్యం " ను స్థాపించి సినిమాలకు దూరం అయ్యారు. సుమారు 10 సంవత్సరాల తరువాత చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ గా "ఖైదీ నెం 150 "రూపొందింది. ఆ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో చిరంజీవి స్టామినా ను నిరూపించింది.

Team TFNవాట్సాప్
Mega Star Most Awaited Film Acharya,Acharya Movie To Release On This Date,latest telugu movies news,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Mega Star Chiranjeevi,Chiranjeevi Acharya,Acharya Movie Latest News,Acharya Telugu Mo
సినిమా వార్తలు

'ఆచార్య' వచ్చేది అప్పుడేనట..!

ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను అనుకున్న టైం కే తీసుకురావాలని... తొందరగా సినిమాను ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అన్ని పనులు తొందరగా పూర్తి చేసి ఆగస్టు 14 న విడుదల చేయాలని చూస్తున్నారట. ఎట్టి పరిస్థితులలో ఆగస్ట్ 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.మరి రీసెంట్ గానే సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్ లో మన సినిమా 100 రోజులలో పూర్తి చేయాలని చిరంజీవి దర్శకుడు కొరటాల దగ్గర మాట తీసుకున్నారు. అలా చిరంజీవి కోరుకున్నట్లు జరిగితే ఆగస్ట్ మిస్ అయ్యే సమస్యే లేదు.

TFN Adminవాట్సాప్

షేర్