
ట్యాగ్ · 9 కథనాలు


మెగాస్టార్-బాబి సినిమా లాంచ్ కు డేట్ ఫిక్స్..!

చిరంజీవి-బాబి సినిమా..పూనకాలు లోడింగ్..!

చిరంజీవి బర్త్ డే కి అప్ డేట్స్ వెల్లువ

స్పెషల్ డే రోజు సినిమా ప్రారంభం..!

మరోసారి 'చిరు' ద్విపాత్రాభినయం

వింటేజ్ లుక్ లో చిరు..!

చిరు సినిమాలో నవాజుద్దీన్..!

'చిరు'కు జోడీగా సోనాక్షి..!

"వాల్తేరు వీరయ్య " గా చిరంజీవి మాస్ లుక్
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన “ఆచార్య ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్” మలయాళ మూవీ రీమేక్ “గాడ్ ఫాదర్” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సూపర్ హిట్ “వేదాళం” తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ ” మూవీ కె ఎస్ రవీంద్ర(బాబీ ) దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మెగాస్టార్-బాబి సినిమా లాంచ్ కు డేట్ ఫిక్స్..!
మెగాస్టార్ చిరంజీవి కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలను చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలుపెట్టింది. ఆ సినిమా షూటింగ్ అవ్వగానే వెంటనే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

చిరంజీవి-బాబి సినిమా..పూనకాలు లోడింగ్..!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన మూవీలకు సంబంధించి వరుస అప్డేట్స్ వరుసపెట్టి ఇస్తున్నారు మేకర్స్. ఒకటి రెండు కాదు నాలుగు సినిమాల పోస్టర్స్, అప్ డేట్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో బాబి దర్శకత్వంలో వస్తున్నసినిమా కూడా ఉంది. . ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్రయూనిట్. పూనకాలు లోడింగ్ అంటూ బాబీ విడుదల చేసిన ఈ పోస్టర్ నిజంగానే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. మాస్ లుక్ తో ఉన్న చిరంజీవి పోస్టర్ ఆకట్టుకుంటుంది. లుంగీ కట్టి.. నోట్లో బీడీ పెట్టి చాాలా రోజుల తరువాత మళ్లీ చిరును మాస్ లుక్ లో చూస్తున్నాం. మళ్లీ పాత చిరంజీవిని చూస్తున్నట్టు ఉంది…

చిరంజీవి బర్త్ డే కి అప్ డేట్స్ వెల్లువ
సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ , కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

స్పెషల్ డే రోజు సినిమా ప్రారంభం..!
మెగాస్టార్ చిరు రీఎంట్రీ తరువాత వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో ముందుగా కొరటాలతో వస్తున్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్టే. అసలు కరోనా లేకపోతే ఈ ఆగష్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ కరోనా వల్ల ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈసినిమా తరువాత మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టేశారు. ఈసినిమాకోసం భారీ స్థాయిలో సెట్స్ కూడా వేయనున్నట్టు తెలుస్తుంది. ఆ పనులు కూడా ఇప్పటికే మొదలైపోయాయి కూడా.

మరోసారి 'చిరు' ద్విపాత్రాభినయం
మెగాస్టార్ చిరు గతంలోనే ముగ్గురు మొనగాళ్లు లాంటి సినిమాలో త్రిపాత్రాభినయం చేశాడు.. ఆతరువాత అందరివాడు సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరోసారి చిరు డ్యూయల్ రోల్ లో నటించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటునే ఈసినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక ఈసినిమాల తరువాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్న సంగతి తెలిసందే కదా. మెహర్ రమేష్ తో ఒకసినిమా ఉండగా.. బాబితో మరో సినిమా ఉంది.

వింటేజ్ లుక్ లో చిరు..!
రీఎంట్రీ తరువాత చిరంజీవి ఫుల్ స్పీడుమీదున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. సెకండ్ వేవ్ ముందే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఒక రెండు వారాల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు షూటింగ్స్ ప్రారంభమవ్వడంతో మళ్లీ షూటింగ్ లలో పాల్గొననున్నారు. వీటితో పాటు మూడు కొత్త సినిమాలను ఓకే చేశారు చిరంజీవి. అందులో ఒకటి మలయాళ చిత్రం 'లూసిఫర్' రీమేక్, మరో చిత్రం తమిళ చిత్రం వేదాళం రీమేక్. లూసిఫర్ రీమేక్‌ను ఎ.మోహన్‌రాజా తెరకెక్కిస్తుండగా, వేదాళం రీమేక్‌లను మెహర్ రమేష్ తెరకెక్కించనున్నారు. ఇవి కాకుండా యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమాను…

చిరు సినిమాలో నవాజుద్దీన్..!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది. ఇక ఈసినిమా తరువాత చిరంజీవి లూసిఫర్ సినిమాను చేయనున్న సంగతి కూడా విదితమే.

'చిరు'కు జోడీగా సోనాక్షి..!
బాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు ఒక్కోక్కరిగా తెలుగు ఇండస్ట్రీలో సందడి చేస్తున్నసంగతితెలిసిందే కదా. ఇప్పటికే విజయ్ దేవరకొండ సినిమా లైగర్ లో అనన్య పాండే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా, ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా పదుకొనె, ఇంకా గని సినిమాలో సాయి ముంజ్రేకర్ ఇలా పలువురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు అది కూడా చిరుతో జోడీ కట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి.