
ట్యాగ్ · 9 కథనాలు


బ్రహ్మానందం మూవీ గ్లింప్స్ రిలీజ్

బ్రహ్మానందం గీసిన అద్భుతమైన చిత్రాలు

రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి షాక్

'రంగమార్తాండ' బ్రహ్మీ నెవర్ బిఫోర్ పెర్ఫామెన్స్
లిటిల్ సోల్జర్ - అన్నయ్యతో బేబీ కావ్య ఫైటింగ్

ఆ ఉద్దేశంతోనే ఈ సినిమాలో నటించాను - బ్రహ్మానందం
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్‌తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.

బ్రహ్మానందం మూవీ గ్లింప్స్ రిలీజ్
పల్లకిలో పెళ్లికూతురు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఆ తరువాత పలు సినిమాలు చేసినా కూడా మంచి విజయాన్ని అయితే దక్కించలేకపోయాయి. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో తండ్రి బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ముక్యంగా రియల్ లైఫ్‌లో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ సినిమాలో తాతామనవళ్లుగా నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

బ్రహ్మానందం నుండి బ్రహ్మీ ఫస్ట్ లుక్ రిలీజ్
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈవయసులో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఇప్పుడు సెలక్టివ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. ఆ మధ్య రంగమార్తండ సినిమాలో సీరియస్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కొడుకు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. బ్రహ్మనందం అనే టైటిల్ తోనే ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో బ్రహ్మానందం కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా ప్రీ లుక్ పోస్టర్, ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.

బ్రహ్నీ నేను ఆటోబయోగ్రఫి బుక్ పై చెర్రీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. ఆయన డేట్స్ లేకపోయినా వెయిట్ చేసి మరీ ఆయన డేట్స్ తీసుకునేవాళ్ళు. అలా తక్కువ సమయంలో 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం ఈయన పేరు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు చాలా సెలక్టివ్ గా పాత్రలను ఎంచుకుంటూ పలు…

బ్రహ్మానందం గీసిన అద్భుతమైన చిత్రాలు
బ్రహ్మనందం...పరిచయం అక్కర్లేని పేరు.దాదాపు 1250కు పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు ఈ లెజండరీ కమెడియన్.అంతేకాదు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.ఉత్తమ హాస్య నటుడిగా 5సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న కమెడియన్ కూడా ఆయనే.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. బ్రహ్మనందం మల్టీ ట్యాలెంటెడ్.ఒక్క నటనే కాదు ఆయన మంచి చిత్రకారుడు అని కూడా మనకు తెలుసు.వయసు పైబడిన కారణంగా గతకొంత కాలంగా సినిమాలు తగ్గించేసారు దాంతో తనలోని ఆర్టిస్టు ను బయటికి తీశారు.ఇటీవల బ్రహ్మానందం వేసిన కొన్నిపెయింటింగ్స్ బాగా పాపులర్…

రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి షాక్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ,రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రంగమార్తాండ. అమ్మానాన్నల కథతో తెరకెక్కిన ఈచిత్రం ఉగాది రోజున విడుదలై పాజిటివ్ రివ్యూస్ మరియు పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రంలో లెజండరీ కమెడియన్, బ్రహ్మనందం కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. చక్రపాణి అనే పాత్రలో బ్రహ్మనందం , ప్రకాష్ రాజ్ కు స్నేహితుడు గా కనిపించగా ఆ పాత్ర ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఇప్పటివరకు కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించిన బ్రహ్మనందం ,రంగమార్తాండలో ఎమోషనల్ పాత్రలో నటించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు…

'రంగమార్తాండ' బ్రహ్మీ నెవర్ బిఫోర్ పెర్ఫామెన్స్
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా స్టార్ట్ చేసిన షెడ్యూల్ లో బ్రహ్మీ కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్, బ్రహ్మీ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ కృష్ణ వంశీ కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. నట రాక్షసుడు ప్రకాష్ రాజ్, పద్మశ్రీ బ్రహ్మానందం గారితో ఒక పవర్ ఫుల్ సీన్ ఇప్పుడే షూట్ జరిగింది.. ఇంత వరకూ ఎప్పుడూ…
లిటిల్ సోల్జర్ - అన్నయ్యతో బేబీ కావ్య ఫైటింగ్
కావ్య, బాలాదిత్య బాల నటులుగా 1996 లో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఇప్పటికీ ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారు. ఇక ఈ చిత్రంలో నటించిన బేబీ కావ్యను కూడా ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ సినిమాకు కావ్యనే ఒక పిల్లర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో కావ్యకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరిలో నేషనల్ అవార్డు కూడా లభించిందంటేనే చెప్పొచ్చు కావ్య ఏ రేంజ్లో నటించిందో. ఇక బాలాదిత్య గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో కావ్య, బాలాదిత్య చేసే కామెడీ.. ఇద్దరూ ఫైటింగ్ చేసుకునే సన్నివేశాలు చాలా కామెడీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి…

హోమ్ వర్క్ ఎలా ఎస్కేప్ చేయాలి - బేబీ కావ్య కామెడీ
కావ్య, బాలాదిత్య బాల నటులుగా 1996 లో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఇప్పటికీ ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారు. ఇక ఈ చిత్రంలో నటించిన బేబీ కావ్యను కూడా ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ సినిమాకు కావ్యనే ఒక పిల్లర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో కావ్యకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరిలో నేషనల్ అవార్డు కూడా లభించిందంటేనే చెప్పొచ్చు కావ్య ఏ రేంజ్లో నటించిందో. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి బేబీ కావ్య చేసిన కామెడీ సీన్ మీకోసం. ఈకింద లింక్ క్లిక్ చేసి.. చూసి ఎంజాయ్ చేయండి.