
ట్యాగ్ · 8 కథనాలు


బాలకృష్ణ సినిమాలో నేను లేను..!

పవన్ పై బోయపాటి షాకింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి అలానే ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఉంటాయి ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్స్. సినిమాల సంగతి పక్కన పెడితే పవన్ ను ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఎంతోో ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. ఎవరిని పవన్ కళ్యాణ్ గురించి అడిగినా పాజిటివ్ గానే రెస్పాన్స్ అవుతారు. ఇక ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ కూడా పవన్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు బోయపాటి శ్రీను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి శ్రీను ను పవన్ గురించి అడగగా దానికి ఆయన పవన్ కళ్యాణ్…

"అఖండ" మూవీ సీక్వెల్ పై బోయపాటి ఫోకస్?
హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన “అఖండ“మూవీ జనవరి 21న ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసింది. 75 కోట్ల కు పైగా షేర్ సాధించిన “అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో…

తెలుగు ఆడియన్స్ కు బోయపాటి స్పెషల్ థ్యాంక్స్..!
ప్రస్తుతం ఎక్కడ చూసినా అఖండ సందడే కనిపిస్తుంది. బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఈనెల 2న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. ఇక ఈసినిమా కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. దీంతో అభిమానుల ఆనందానికి అయితే హద్దులు లేకుండా పోయాయి. అఖండ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం.. దానికి తోడు కలెక్షన్స్ కూడా భారీగా వస్తుండటంతో ముందు ముందు రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా కాస్త ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు.

బోయపాటి శ్రీను చేతుల మీదుగా ‘కేస్ 99’ ఫస్ట్‌లుక్ రిలీజ్
ప్రియదర్శిని రామ్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం 'కేస్ 99'. నిఖిల్ ,అనువర్ణ, జంటగా మానవ సంబంధాలే ముఖ్య ఆయుధాలుగా తెరకెక్కిన చిత్రం ‘కేస్ 99’. ఇంకా ఈ సినిమాలో ‘పలాస’ఫేమ్ తిరువీర్, అపరాజిత, రోషన్, అజయ్,అశోక్‌రావ్,ప్రణీత పట్నాయక్ (కేర్ ఆఫ్ కంచెరపాలెం) , క్రిష్‌రాజ్,మనోజ్ ముత్యం,విజయ్ గోపరాజుతదితరులు నటిస్తున్నారు.
ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ - బోయపాటి సినిమా టీజర్ రిలీజ్
మొత్తానికి ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలయ్య-బోయపాటి సినిమా నుండి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి టైటిల్ నో.. ఫస్ట్ లుక్కో రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ ఏకంగా టీజర్ నే రిలీజ్ చేశారు. ఇక టీజర్ విషయానికొస్తే.. టీజర్ లో ఫైట్ ఎపిసోడ్ ను చూపించారు. పంచెకట్టుతో బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. అంతేకాదు ‘‘ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, శీనుగారు ‘మీ అమ్మ మొగుడు’ బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉందిరా అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ సూపర్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్. మొత్తానికి బర్త్‌డేకి అభిమానులు బిగ్ ట్రీటే…
బోయపాటి శ్రీను తొలి చిత్రం ‘భద్ర’కి 15 ఏళ్ళు
మాస్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. అలాంటి బోయపాటి దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘భద్ర’. టైటిల్ రోల్‌లో మాస్ మహారాజా రవితేజ నటించగా.. అతనికి జోడిగా మీరా జాస్మిన్ దర్శనమిచ్చింది. దీపక్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, పద్మనాభం, సునీల్, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్, ఈశ్వరీరావు, సుబ్బరాజు, సుధ, సురేఖా వాణి, ఝాన్సీ, రేవతి, జీవా ముఖ్య పాత్రలు పోషించారు.

బాలకృష్ణ సినిమాలో నేను లేను..!
బాలయ్య తో బోయపాటి సినిమా మొదలైన దగ్గరనుండి ఏదో ఒక వార్త తెరపైకి వస్తూనే ఉంది. ఇప్పటికే బాలయ్య పాత్రపై, హీరోయిన్ పై ఇలా పలు విషయాలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తూనే వుంది. ఇదిలా ఉండగా తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ కొట్టి.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. బాలయ్య పాత్రకు అసిస్టెంట్ గా చాలా కీలకమైన రోల్ ఒకటి ఉండగా.. దాని కొరకు ఆయనని తీసుకున్నారని.. రెండు రోజులుగా ఈ వార్త ప్రచారం అవుతుంది. అయితే ఇప్పుడు ఆ వార్తలను ఖండించాడు నవీన్.
బాలయ్య హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి..!
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య విలన్ గా నటిస్తున్నాడన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కాస్త నెగెటివ్ షేడ్ ఉంటుందని.. అంతేకాని విలన్ కాదని చెప్పారు. అంతేకాదు ఇప్పటికే భూమిక నెగెటివ్ రోల్ చేస్తుందని…